For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bank Vs Post Office: ఫిక్స్ డ్ డిపాజిట్‍ బ్యాంకులో చేయాలా లేక పోస్టాఫీస్‍లో చేయాలా..?

|

భారత దేశంలో మధ్యతరగతి వారు ఎక్కువగా ఉంటారు. వారు చిన్న మొత్తాల్లో పొదువు చేస్తుంటారు. వారికి పొదుపు చేయడానికి మొదటగా గుర్తొచ్చేవి బ్యాంకులు, పోస్టాఫీస్. భారతీయులలో చాలా మంది ఇప్పటికీ తమ డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదా టర్మ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడి పెడుతున్నారు. ఎందుకంటే ఇందులో రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే బ్యాంక్, పోస్టాఫీస్ వేటిలో వడ్డీ ఎక్కువ వస్తుందంటే..

రెపో రేటు 5.4

రెపో రేటు 5.4

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలి రెపో రేటును ఆగస్టు ప్రారంభంలో ప్రకటించిన తరువాత ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను పెంచాయి. 50 బేసిస్‌ పాయింట్లు పెరిగిన తర్వాత ప్రస్తుత రెపో రేటు 5.4 శాతంగా ఉన్నాయి. చాలా బ్యాంకులు వివిధ కాల వ్యవధుల్లో వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. డిపాజిటర్లు వారి ఆర్థిక లక్ష్యాలను బట్టి 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను ఎంచుకోవచ్చు.

వడ్డీ రేటు 6.7 శాతం

వడ్డీ రేటు 6.7 శాతం

బ్యాంకుల మాదిరిగానే, ఇండియా పోస్ట్ సర్వీసెస్ కూడా 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు వివిధ కాల వ్యవధిలో ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లను అందిస్తుంది. పెట్టుబడిదారులకు హామీతో కూడిన స్థిర రాబడిని అందిస్తోంది. FD పథకం కోసం కనీస మొత్తం రూ. 1,000 పెట్టుబడి పెట్టొచ్చు. పోస్టాఫీస్ లో ఒక సంవత్సరం డిపాజిట్ కోసం, పోస్ట్ ఆఫీస్ 5.5 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఒక-మూడేళ్ల పథకానికి, వడ్డీ రేటు 5.5 శాతం. 5 సంవత్సరాల కాల వ్యవధి డిపాజిట్ కోసం వడ్డీ రేటు 6.7 శాతంగా ఉంది.

బ్యాంక్ FDలు vs పోస్ట్ ఆఫీస్ FDలు

బ్యాంక్ FDలు vs పోస్ట్ ఆఫీస్ FDలు

పోస్ట్ ఆఫీస్ FDలు ప్రభుత్వ పథకాలు, అవి ప్రభుత్వ సెక్యూరిటీలతో అనుసంధనం అయి ఉంటాయి. బ్యాంక్ FD రేట్లు సెంట్రల్ బ్యాంక్ రేట్ రివిజన్‌పై ఆధారపడి ఉంటాయి. మార్కెట్ పనితీరుపై ఆధారపడి ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులకు గురవుతాయి. అందువల్ల, వివిధ బ్యాంకులు వివిధ వడ్డీ రేట్లను అందిస్తాయి. పోస్ట్ ఆఫీస్ FD పథకాల వడ్డీ రేట్లు ప్రతి త్రైమాసికంలో సవరిస్తారు.

ఐదేళ్ల వరకే..

ఐదేళ్ల వరకే..

ఉదాహరణకు 2022-23 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో, ప్రస్తుతానికి రేట్లను మార్చకుండా ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. బ్యాంక్ FDలు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య ఫ్లెక్సిబుల్ పదవీకాలాన్ని కలిగి ఉంటాయి, అయితే పోస్టాఫీసు పథకాలు ఐదేళ్ల వరకు మాత్రమే పొడిగిస్తారు.

English summary

Bank Vs Post Office: ఫిక్స్ డ్ డిపాజిట్‍ బ్యాంకులో చేయాలా లేక పోస్టాఫీస్‍లో చేయాలా..? | Does fixed deposit get more interest in bank or post office?

The investment patterns and needs differ from investor to investor. It is quite intimidating to choose a perfect investment tool with the numerous financial choices we have at present.
Story first published: Saturday, August 20, 2022, 13:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X