ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నివాస మార్కెట్లో భారత్ నుంచి మూడు నగరాలకు చోటు దక్కింది. దేశ రాజధాని ఢిల్లీ 9వ స్థానంలో, బెంగళూరు 20వ స్థానంలో, ముంబై 28వ స్థానంలో నిలిచాయి. ఈ మేరకు గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ 'ప్రైమ్ గ్లోబల్ సిటీ ఇండెక్స్' స్థానిక మార్కెట్లో రియాల్టీ ధరల ఆధారంగా ర్యాంకులను ఇస్తుంది.

తొలి స్థానంలో మాస్కో
2019 ఆర్థిక సంవత్సరం తాజా క్వార్టర్ రిపోర్ట్ ప్రకారం లగ్జరీ రెసిడెన్షియల్ మార్కెట్లో రష్యా రాజధాని మాస్కో తొలి స్థానంలో నిలిచింది. గత ఏడాది కాలంలో ఇక్కడ ఇళ్ల ధరలు 11.1% వృద్ధి చెందాయి. రెండోస్థానంలో 10.3% పెరుగుదలతో
ఫ్రాంక్‌ఫర్ట్, మూడో స్థానంలో 8.9%తో తైపీ నిలిచింది. ఈ జాబితాలో సియోల్‌కు చివరి స్థానం లభించింది. ఈ నగరంలో ఖరీదైన గృహాల ధరలు 12.9 శాతం పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా 45 నగరాల్లో ఖరీదైన నివాస సముదాయాల ధరల కదలికలను స్థానిక కరెన్సీతో లెక్కగట్టి ఈ ర్యాంకులు ఇచ్చింది.

మన దేశంలో ఇలా...
ముంబై, ఢిల్లీ ర్యాంకులు పెంచుకున్నప్పటికీ గత మూడు నెలల్లో ఈ నగరాల్లో విలాసవంత గృహాల ధరలు స్థిరంగా ఉన్నాయని నైట్ ఫ్రాంక్ ఎండీ చైర్మన్ శిశిరై బైజాల్ అన్నారు. మన దేశంలో ప్రభుత్వ విధాన నిర్ణయాలు అఫర్టబుల్, మధ్యస్థాయి గృహాల అభివృద్ధికి పరిమితం అయ్యాయని, దీంతో లగ్జరీ ప్రాపర్టీ సంఘటిత కంపెనీలు, నిధులు సమృద్ధిగా ఉన్న కంపెనీలు మాత్రమే చేస్తున్నాయని చెప్పారు.

ఢిల్లీ ఓ స్థానం మెరుగు
ఢిల్లీ గతంలో కంటే ఓ స్థానాన్ని మెరుగుపరుచుకొని 9వ స్థానానికి ఎగబాకింది. గ్రేటర్ కైలాశ్, వసంత్ విహార్, ఆనంద్ నికేతన్, డిఫెన్స్ కాలనీ, గ్రీన్ పార్క్ వంటి ప్రాంతాల్లో లగ్జరీ హౌస్ ధరలు మూడో త్రైమాసికంలో సగటున 4.4 శాతం పెరిగాయి. ఢిల్లీలో లగ్జరీ హౌస్ విలువ చదరపు అడుగుకు సగటున 4.4 శాతం పెరిగి రూ.33,511కు పెరిగింది.

బెంగళూరు, ముంబైలలో ఎంత అంటే?
బెంగళూరు గతంలో 15వ స్థానంలో ఉండగా ఇప్పుడు 20 స్థానానికి తగ్గింది. ముంబై గతంలో 30వ స్థానంలో ఉండగా రెండో స్థానాలు ఎగబాకి 28వ స్థానంలో నిలిచింది. బెంగళూరులో లగ్జరీ హౌస్ ధరల స్థల విలువ 2.1 శాతం వృద్ధితో రూ.19,709కి, ముంబైలో 0.8 శాతం పెరిగి రూ.64,775కు చేరుకుంది.

పెరుగుతున్న లగ్జరీ ఇళ్లు
ఇదిలా ఉండగా, ఇటీవలే ఏడు ముఖ్య నగరాల్లో రూ.1.5 కోట్లకు పైన వ్యాల్యూ కలిగిన లగ్జరీ సెగ్మెంట్ ఇళ్లను 16,100 యూనిట్లకు పైగా లాంచ్ చేశారు. ఇదే పీరియడ్‌లోని 2017 కంటే ప్రస్తుతం లగ్జరీ హౌసింగ్ సరఫరా మూడు రెట్లుగా ఉందని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ చైర్మన్ అనుజ్ పూరి అన్నారు. 2019 మొదటి అర్ధ సంవత్సరంలో ఢిల్లీ, ముంబైలలో ఎక్కువ లగ్జరీ యూనిట్ల సరఫరా ఉందని, ఇది 59 శాతం ఉందన్నారు. ఆ తర్వాత బెంగళూరు, హైదరాబాదులలో వరుసగా 2,210, 2070గా ఉందన్నారు.
More From GoodReturns

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

Bengaluru: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మెట్రో.. ఏది బెస్ట్? సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ!

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications