పసిడి ధరల క్షీణత; ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే!!
పసిడి ధరలు నేడు కాస్త తగ్గాయి. బంగారం ధర కొద్దిగా తగ్గినా బంగారం కొనుగోలుదారులలో సంతోషం కనిపిస్తుంది. ఒకవేళ బంగారం ధరలు పెరిగితే మాత్రం పసిడి ప్రియులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇక తాజాగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 100 రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 100 రూపాయల మేర ధర తగ్గింది.
ఈరోజు దేశంలోని వివిధ ప్రధాన నగరాలలోనూ బంగారం ధరలు ఎలా ఉన్నాయి అంటే హైదరాబాద్ లో 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారానికి 55 వేల 400 రూపాయలు, 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారానికి 60 వేల 450 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది.

హైదరాబాద్ మాత్రమే కాకుండా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ లో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,400, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,450 రూపాయలుగా ట్రేడవుతోంది.దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర 55, 550 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,600 రూపాయలుగా ట్రేడవుతోంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55 వేల 400 రూపాయలు కాగా, 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 వేల 450 రూపాయలు గా ప్రస్తుతం విక్రయించబడుతుంది. బెంగళూర్ లో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55 వేల 450 రూపాయలు కాగా, 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నేడు 60 వేల 500 రూపాయలుగా విక్రయించబడుతుంది.
కలకత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,400 రూపాయలుగా, 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,450 రూపాయలుగా ట్రేడవుతోంది.దేశంలోనే బంగారం ధరలు అధికంగా ఉండే తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, మధురై, కోయంబత్తూర్, సేలం, ఈరోడ్, తిరుపూర్, తిరునల్వేలి, తిరుచ్చిలలో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,800 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60, 900 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది.


Click it and Unblock the Notifications