కరోనా మహమ్మారి నేపథ్యంలో 2019-20 ఆర్థిక అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్స్(ఐటీ రిటర్న్స్) దాఖలుకు గడువును నవంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) బుధవారం తెలిపింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసిన FY20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్స్ దాఖలుకు గడువును సీబీడీటీ గతంలో జూన్ 30వ తేదీకి పొడిగించింది. కరోనా వైరస్ నేపథ్యంలో గడువును పొడిగించింది. మొదటిసారి జూలై 31కి, రెండోసారి సెప్టెంబర్ 30వ తేదీకి పొడిగించింది. ఇప్పుడు ఆ గడువును నవంబర్ 30వ తేదీకి పొడిగించింది.

రెండు నెలలు పొడిగింపు
కరోనా నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు ఐటీ విభాగం వివిధ మార్గాల్లో ఊరట కల్పిస్తోంది. ఇందులో భాగంగా 2018-19 అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించి పన్ను రిటర్న్స్ దాఖలకు 2 నెలలు పాటు పొడిగించి, నవంబర్ 30వ తేదీ వరకు ట్యాక్స్ పేయర్స్‌కు ఊరట కల్పించింది. కరోనా నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీడీటీ తెలిపింది. 2019-20 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆలస్యంగా దాఖలు చేసే రిటర్న్స్‌తో పాటు సవరించిన రిటర్న్స్ దాఖలు గడువును సెప్టెంబర్ 30వ తేదీ నుండి నుంచి నవంబర్ 30 వరకు పొడిగించినట్టు తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఒరిజినల్, సవరించిన ఐటీఆర్ దాఖలు విషయంలో పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం గడువును పొడిగించడం ఇది నాలుగోసారి.

ఐటీ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలి?
- ఆదాయపు పన్ను డిపార్టుమెంట్ పోర్టల్‌ను ఓపెన్ చేయాలి. incometaxindiaefiling.gov.in
- ఇదివరకే రిజిస్టర్ కాకపోయి ఉంటే రిజిస్టర్ చేసుకోవాలి.
- యూజర్లు తమ పాన్ కార్డును ఉపయోగించి ఐటీఆర్‌ను దాఖలు చేసుకునేందుకు రిజిస్టర్ చేసుకోవచ్చు. పాన్ కార్డు యూజర్ ఐడీగా పని చేస్తోంది.
- లాగిన్ అయిన తర్వాత ఐటీఆర్ ఫైలింగ్ ఆప్షన్ ఎంచుకోవాలి.
- అసెస్‌మెంట్ ఏడాదిని సెలక్ట్ చేసుకోవడం కోసం.. కొత్త పేజీలోకి వెళ్తారు. అక్కడ AYని సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఐటీఆర్ ఫామ్ నెంబర్ 1తో ఫైలింగ్ టైమ్ (ఒరిజినల్ లేదా రివైజ్డ్) ఎంచుకోవాలి.
- ప్రాసెస్ పూర్తయిన తర్వాత బ్యాంకు అకౌంట్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ట్యాక్స్ రీఫండ్‌ను పొందడానికి ఈ బ్యాంక్ నెంబర్ ఇస్తారు.

ఐటీ రిటర్న్స్ ఊరట
కాగా, పన్ను చెల్లింపుదారులకు కేంద్రం ఇటీవల ఊరట కల్పించే ప్రకటన చేసింది. రోజువారీ ట్రేడింగ్, స్వల్పకాల విక్రయాలు లేదా కొనుగోళ్లు చేసే వారు షేర్లు వారీ నివేదికలను తమ ఆదాయ పన్ను రిటర్న్స్‌లో పొందుపరచాల్సిన అవసరం లేదని ఆదాయపు పన్ను విభాగం తెలిపింది. 2020-21 మదింపు సంవత్సరానికి ఇది వర్తిస్తుందని శనివారం (సెప్టెంబర్ 26) ఓ నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈ మదింపు సంవత్సరానికి షేరు వారీ వివరాలను సమర్పించాల్సి ఉంటుందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీబీడీటీ స్పష్టతను ఇచ్చింది.


Click it and Unblock the Notifications