ఉద్యోగం దొరకటమే కష్టం అన్న సమయంలో మీరేంటి ఇలా పిలిచి మరీ ఉద్యోగం ఇస్తారని చెబుతున్నారు అనేదే కదా మీ డౌట్? అవునండీ... ఇందులో డౌట్ పడాల్సిన విషయం ఏమీ లేదు. మీరు గనుక డేటా సైంటిస్ట్ అయ్యారనుకోండి.. నిజంగానే 2020 లో మిమ్మల్ని పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఏడాది కేవలం డేటా సైంటిస్ట్ ఉద్యోగాలే సుమారు 1.5 లక్షలు లభించనున్నాయంట. సరైన నైపుణ్యం లేకపోవటం చేత గతేడాది కంపెనీలు ఎవరినీ నియమించుకోలేదట. దాంతో సుమారు 1 కొలువులు ఖాళీగా ఉండిపోయాయట. ఇప్పుడు చెప్పండి మరి.. . ఈ స్కిల్ కు డిమాండ్ ఏ స్థాయిలో ఉందో! కేవలం ఉద్యోగం ఇవ్వటమే కాదు జీతం కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుందని ఈ రంగంలోని నిపుణులు పేర్కొంటున్నారు. 5 ఏళ్ళ అనుభవం ఉన్న ఒక సాఫ్టువేర్ ఇంజనీర్ కు లభించే వేతనం కంటే 2 ఏళ్ళ అనుభం ఉన్న డేటా సైంటిస్టు కు అధికంగా శాలరీ లభిస్తోంది అంటే డిమాండ్ ను అర్థం చేసుకోవచ్చు. డిజిటల్ విప్లవం వచ్చిన తర్వాత డేటా కి ప్రాధాన్యత పెరిగింది. ఏం చేయాలన్న డేటా నే కీలకం. దానిని సరిగ్గా అనలైజ్ చేయగలిగే వారికి ఇక తిరుగు ఏముంటుంది చెప్పండి.

62% అధికం...
2019 సంవత్సరం తో పోల్చితే... 2020 లో డేటా సైన్స్ విభాగంలో ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉండనున్నాయి. 2020 లో ఏకంగా 62% వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొత్తగా 1.5 లక్షల డేటా సైంటిస్ట్ ఉద్యోగాలు లభిస్తాయని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అది కూడా 5 ఏళ్ళ లోపు అనుభవం ఉంటే చాలంటున్నారు. గ్రేట్ లెర్నింగ్ అనే సంస్థ దీనిపై ఒక పరిశోధన చేసి ఒక నివేదికని వెలువరించింది. ఈ విషయాన్ని ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. ఎగ్జిక్యూటివ్, మేనేజర్, సీనియర్ మేనేజర్ స్థాయి లో అధిక సంఖ్యలో ఉద్యోగాలు లభించనున్నాయి. 2019 లో సుమారు 97,000 కొలువులు ఖాళీగా ఉండటం కూడా ఈ ఏడాదిలో అధిక సంఖ్యలో డేటా సైన్స్ ఉద్యోగాలు వచ్చేందుకు కారణం అని అంటున్నారు.

రూ 10 లక్షల సగటు వేతనం...
కొంత కాలంగా అన్ని రంగాల్లోకి టెక్నాలజీ వచ్చి చేరింది. ఇప్పుడంతా ఆన్లైన్ లోనే కొనుగోలు చేస్తున్నారు. దీంతో వినియోగదారుల అభిరుచులు తెలుసుకుని, వారికి తగిన ఉత్పత్తులు, సేవలను అందించేందుకు కంపెనీలు డేటా ఎనాలిసిస్ పై ఆధారపడుతున్నాయి. డాటాను సరిగ్గా అనలైజ్ చేయగలిగే సైంటిస్టులకు అందుకే డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు వీరికి ప్యాకేజీ లు భారీగా ఉంటున్నాయి. డేటా సైంటిస్ట్ ఉద్యోగులకు సగటున రూ 10 లక్షల వార్షిక వేతనం లభిస్తోంది. ఇది రూ 13 లక్షల వరకు ఉండటం విశేషం. మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ లో నైపుణ్యం కలిగిన వారికి డేటా సైన్స్ విభాగంలో మంచి భవిష్యత్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో అధికం...
ఇండియా లో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో డేటా సైంటిస్టులకు మరింత అధికంగా డిమాండ్ ఉంటోంది. ఈ రంగంలో వారికి సగటు వేతనం రూ 13.5 లక్షల వరకు లభిస్తోంది. తర్వాత స్థానంలో తయారీ రంగం నిలుస్తోంది. అన్ని రకాల మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లోనూ డేటా సైంటిస్టులకు డిమాండ్ పెరిగింది. ఈ రంగంలో సగటున రూ 12 లక్షల వార్షిక వేతనం అందిస్తున్నారు. హెల్త్ కేర్ రంగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ రంగాల్లో కూడా మెరుగైన డిమాండ్ ఉంది. ఈ రంగాల్లో ఉద్యోగాలు వెతుక్కునే వారికి రూ 10.5 లక్షల నుంచి రూ 11.5 లక్షల వరకు వేతనం చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్ అమ్మకాలు గణనీయంగా పెరిగిపోయాయి కాబట్టి, ఈ కామర్స్ రంగంలోనూ డాట్ సైంటిస్టులకు డిమాండ్ పెరిగింది. ఇక్కడ వీరికి రూ 10 లక్షల వార్షిక శాలరీ ఆఫర్ చేస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?



Click it and Unblock the Notifications