Deficit: దిగొచ్చిన కరెంట్ ఖాతా లోటు.. చమురు ధరలే కీలకం
Deficit: దేశీయ కరెంట్ ఖాతా లోటుపై ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ సర్వే నిర్వహించింది. దాని నివేదిక ప్రకారం ఇండియా కరెంట్ ఖాతా లోటు(CAD)లో గణనీయమైన క్షీణత నమోదైంది. FY23 నాల్గవ త్రైమాసికంలో 1.3 బిలియన్ డాలర్ల మేర తగ్గినట్లు సర్వే పేర్కొంది. చమురు ధరలు తగ్గడంతో వాణిజ్య లోటు సైతం తగ్గే అవకాశం ఉంది అని ICICI సెక్యూరిటీస్ ప్రధాన ఆర్థికవేత్త ప్రసేన్‌జిత్ K.బసు సైతం అంచనా వేశారు.
2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ 3.3 బిలియన్లకు పైగా ఉంది. ఇది స్థూల జాతీయోత్పత్తి (GDP)లో 0.4 శాతానికి సమానమైనంగా ఉన్నట్లు 22 మంది నిపుణులపై నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. అంతకు ముందు త్రైమాసికంలో ఈ లోటు 18.2 బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం.

"గ్లోబల్ కమోడిటీ ధరలను నియంత్రించడం వల్ల వాణిజ్య లోటు తగ్గుతుందని భావిస్తున్నాం. అయితే ఇందుకోసం మునుపటి త్రైమాసిక స్థాయిల్లో బ్యాలెన్స్ స్థిరంగా ఉండాల్సిన అవసరం ఉంది. తద్వారా సేవల ఎగుమతులు పుంజుకుంటాయి" అని మోర్గాన్ స్టాన్లీకి చెందిన ఇండియా ఎకనామిస్ట్ చీఫ్ ఉపాసనా చచ్రా అభిప్రాయపడ్డారు.

పోల్ ప్రకారం ఇటీవల త్రైమాసికంలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ 9.8 బిలియన్ల మిగులు కలిగి ఉంటుందనిని అంచనా. అంతకు ముందు త్రైమాసికంలో నమోదైన 11.1 బిలియన్ల నుంచి చాలావరకు తగ్గింది. ముగిసిన ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈసారి కరెంట్ ఖాతా లోటు (CAD) GDPలో సగటున -1.5 శాతం దిగివస్తుందని గత వారం విడుదలైన మరో రాయిటర్స్ పోల్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications