కంపెనీలకు షాక్ మీద షాక్: కీలక టైంలో వెళ్లిపోతున్న వర్కర్స్, అప్పుడే తిరిగి రాకపోవచ్చు

గత 40 రోజులుగా లాక్ డౌన్ కారణంగా ఉత్పత్తులు నిలిచిపోయాయి. అయితే గ్రీన్, ఆరెంజ్ జోన్‌లలో ఇప్పుడిప్పుడే ఆంక్షలు సడలిస్తున్నాయి ప్రభుత్వాలు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఎంటర్‌ప్రెన్యూయర్స్, ఎక్స్‌పోర్టర్స్‌కు చిక్కు వచ్చి పడింది. ఆయా రాష్ట్రాల్లో ఆయా కంపెనీలకు వలస కార్మికులు ఎంతో అవశ్యం. అయితే ఆంక్షలు సడలిస్తున్న తరుణంలో కార్మికులు తమ సొంతూళ్లకు తరలి వెళ్తున్నారు. ఇది చిన్న ఉత్పత్తిదారులకు ఇబ్బందికర అంశం.

అందుకే ఇళ్లకు రిటర్న్.. కంపెనీల ఆందోళన

అందుకే ఇళ్లకు రిటర్న్.. కంపెనీల ఆందోళన

లాక్ డౌన్ కారణంగా వ్యాపారాలు మూతబడ్డాయి. ఇప్పుడిప్పుడే ఆంక్షలు ఎత్తివేస్తుండటంతో సంస్థలు ఊపిరిపీల్చుకుంటున్నాయి. కానీ అంతలోనే వర్కర్స్ ఇళ్లకు వెళ్లిపోవడం కంపెనీలకు కలవరం కలిగిస్తోంది. లాక్ డౌన్ సమయంలో ఇతర చోట్ల ఇప్పటి వరకు ఎలాంటి ఉపాధి లేదు. ఉద్యోగం లేదు. దీంతో కార్మికులు కనీసం తమ ఊళ్లలో తమకు ప్రభుత్వం అందించే ప్రయోజనాలు అందుకునేందుకు, ఇతర కారణాలతో వెళ్తున్నారు. ఇప్పటి వరకు పనులు నిలిచిపోయాయని, కాబట్టి రాబోయే కొద్ది వారాల్లో ఉత్పత్తి పెరుగవచ్చునని, కన్‌స్ట్రక్షన్ మెటిరీయల్ సప్లై చైన్ సాధారణంగా మారే అవకాశం ఉందని, ఇలాంటి సమయంలో తగినంత కార్మిక శక్తి అవసరమని షాపూర్ జీ పల్లోంజీ ఇంజినీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ అధికార ప్రతినిధి చెప్పారు.

కార్మికులు వెళ్లిపోతే కష్టమే

కార్మికులు వెళ్లిపోతే కష్టమే

కార్మికులు ఇళ్లకు వెళ్లిపోతే ఇప్పటికే ఆయా రంగాల్లో అనుభవం ఉన్న లేబర్ కొరత ఏర్పడుతుందని, దీని వల్ల లాజిస్టిక్స్ పైన, స్థానిక డిస్ట్రిబ్యూషన్ పైన తమపై ప్రభావం చూపిస్తుందని బిస్లరీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జార్జ్ ఆంజెలో అన్నారు. అనుభవం ఉన్న లేబర్ వెళ్లిపోవడంతో పాటు ఇది తాత్కాలికంగా లేబర్ ఖర్చు పెంచుతుందని, నిర్వహణ సామర్థ్యంపై ప్రభావంఉంటుందన్నారు. అయితే వేలాది మంది కార్మికులు తమ ఇళ్ల పైన బెంగ పెట్టుకున్నారని, ఇక్కడ అక్కడ ఏం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితి అని దీంతో వారు తిరిగి వెళ్లేందుకు మొగ్గు చూపారన్నారు.

వారు లేకుంటే ఇబ్బందికరమే..

వారు లేకుంటే ఇబ్బందికరమే..

వలస కార్మికుల కొరత ఇబ్బందులు సృష్టిస్తుందని, అయితే లోకల్ లేబర్‌తో ముందుకు సాగగలమనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు పార్లే ప్రోడక్ట్స్ కేటగిరీ హెడ్ మయాంక్ షా అన్నారు. మే చివరి నాటికి దాదాపు 30 శాతం నార్మల్‌గా మారవచ్చునని ఇండియన్ సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులు తమ సొంత ఊర్లకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, అందుకు అనుగుణంగా వారికి అన్ని ఏర్పాట్లు చేయాలని చెబుతున్నారు. Foxconn 10 శాతం వర్క్ ఫోర్స్‌తో ఉత్పత్తి ప్రారంభించేందుకు అనుమతి లభించిందని, కానీ మ్యాన్ పవర్ ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. షియోమీ ఇండియా హెడ్ మను జైన్ స్పందిస్తూ.. తమకు అవసరమైన మ్యాన్ పవర్ లేదని, దీనికి కొద్ది వారాలు పట్టవచ్చునని చెప్పారు.

అప్పుడే తిరిగి రాకపోవచ్చు

అప్పుడే తిరిగి రాకపోవచ్చు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నేపథ్యంలో గ్రామాల్లో వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేస్తున్నాయని, దీని వల్ల వర్క్ ఫోర్స్ అప్పుడే తిరిగి వచ్చే అవకాశాలు లేవని, డబ్బులు సరైన విధంగా వస్తే తప్పు వారు నగరాలకు రావడానికి ఆసక్తి చూపకపోవచ్చునని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియ ఎంటర్ ప్రైజెస్ జనరల్ సెక్రటరీ అనిల్ భరద్వాజ్ అన్నారు. చిన్న వ్యాపారాలు 20 శాతం నుండి 25 శాతం కార్యకలాపాలు ప్రారంభించే అవకాశముందన్నారు. చిన్న కంపెనీలు సామాజిక దూరం, శానిటైజేషన్‌తో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో లేబర్ సమస్యను కూడా ఎదుర్కొంటున్నాయన్నారు. ఒకవేళ నగరాల్లో కార్మికులు ఉన్నప్పటికీ వారికి కంపెనీలకు వెళ్లేందుకు సరైన ట్రాన్సుపోర్టేషన్ లేదన్నారు.

చిన్న కంపెనీలకు ఇబ్బందులు

చిన్న కంపెనీలకు ఇబ్బందులు

జామ్, సాస్, జ్యూస్ తయారీ సంస్థలు కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయని, అలాగే తక్కువ వడ్డీ రేటుకు వర్కింగ్ కేపిటల్ లోన్స్ పొందడంలో ఇబ్బందులు పడుతున్నాయని, కేవలం మూడు నాలుగు వారాలకు సరిపడా సరుకు మాత్రమే ఉన్నందున రిటైల్ షెల్ఫ్స్ ఖాళీగా కనిపించే పరిస్థితులు ఎదురు కావొచ్చునని ఆల్ ఇండియా ఫుడ్ ప్రాసెసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుబోధ్ జిందాల్ అన్నారు.

ఓడ రేవుల్లోను..

ఓడ రేవుల్లోను..

అలాగే ఓడ రేవుల్లో కార్మికుల కొరత కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చెబుతున్నారు. ముంద్రా, కాండ్లా, నవ శివ వంటి ప్రాంతాల్లోని మైగ్రేంట్స్ ఇళ్లకు తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. కాండ్లాలో 10,000 మంది కార్మికులు ఇళ్లకు వెళ్లిపోవడానికి పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. రివర్స్ మైగ్రేషన్ ప్రపంచ ఎగుమతులపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. గత కొన్ని వారాల్లోనే 200-250 నుండి 30-40 కంటైనర్లకు పడిపోయినట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్తున్న వారు మరో మూడు నాలుగు నెలల వరకు తిరిగి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. యీపీ, బీహార్, రాజస్థాన్‌లలో రాజకీయ నాయకులు ఇక్కడే ఉండాలని మైగ్రెంట్స్‌కు విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి. వలస కార్మికులు వెళ్లకుండా కంటైనర్ ఫ్రైట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కేంద్రానికి లేఖ రాసింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+