భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా లక్షల కోట్ల దెబ్బ, హైదరాబాద్ కాగ్నిజెంట్ మూసివేత!

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వైరస్ వ్యాప్తి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. దీంతో ప్రపంచ మార్కెట్లు ఎగుడుదిగుడులు ఎదుర్కొంటున్నాయి. మొత్తంగా తీవ్ర నష్టాలు చవి చూస్తున్నాయి. కరోనా కారణంగా 3,382 మంది చనిపోగా, 97,699 మందికి సోకింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ ప్రభావం భారీగానే పడుతుందని అంచనాలు వేస్తున్నారు. చైనా ముడి పదార్థాలు, ఇతర వస్తువులు, ఎగుమతులపై ఆధారపడిన భారత్‌పై కూడా భారీ ప్రభావం చూపుతుంది.

దెబ్బ మీద దెబ్బ

దెబ్బ మీద దెబ్బ

గత క్యాలెండర్ ఇయర్ ఆర్థిక మందగమనం కారణంగా ఆటో, ఎఫ్ఎంసీజీ, రియాల్టీ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోయారు. డిమాండ్, ఉత్పత్తి తగ్గింది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వం చర్యలతో పరిస్థితు సద్దుమణుగుతున్నదనుకునే సమయంలో కరోనా వైరస్ దెబ్బకొట్టింది.

ఎగుమతులు డౌన్

ఎగుమతులు డౌన్

కరోనా ప్రభావంతో ఎగుమతి వాణిజ్యం 34.8 కోట్ల డాలర్ల మేర తగ్గవచ్చునని ఐక్య రాజ్య సమితి తాజా నివేదిక అంచనా వేసింది. ఎగుమతి వాణిజ్యం తీవ్రంగా ప్రభావితమైన పదిహేను దేశాల్లో ఇండియా ఉంది. కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా 5,000 కోట్ల డాలర్ల మేర తగ్గి ఉంటాయని ఐరాస పేర్కొంది.

చమురు ఉత్పత్తిలో కోత

చమురు ఉత్పత్తిలో కోత

వైరస్ కారణంగా ప్రతిరోజు 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి కోత విధించేందుకు ఒపెక్ దేశాలు యోచిస్తున్నాయి. కరోనా కారణంగా మద్దతు ధర కోసం ఉత్పత్తి తగ్గించాలని చూస్తున్నాయి. ఈ ఏడాది రెండో క్వార్టర్‌లో ఉత్పత్తి కోత ఉంటుందని భావిస్తున్నారు. సభ్యులు కానీ దేశాలు రోజుకు 5 లక్షల బ్యారెళ్ల చమురును తగ్గించుకుంటాయని ఓపెక్ చెబుతోంది.

ఉక్కురంగంపై ప్రభావం

ఉక్కురంగంపై ప్రభావం

అంతర్జాతీయ ఉక్కు రంగంపై కరోనా ప్రభావం పడింది. ఏప్రిల్ - జూన్ క్వార్టర్‌లో టన్నుకు దాదాపు 30 డాలర్ల మేర ధరల ఒత్తిడిని భారత కంపెనీలు ఎదుర్కోవచ్చునని ఇండియా రేటింగ్స్ అభిప్రాయపడింది. ఉక్కు సంస్థల నిర్వహణ మార్జిన్లపై దేశీయ ఉక్కు ధరలు ఇప్పటికే ప్రభావం చూపుతున్నట్లు తెలిపింది.

శానిటైజర్‌కు డిమాండ్

శానిటైజర్‌కు డిమాండ్

కరోనా కేసులు పెరుగుతుండటంతో హ్యాండ్ శానిటైజర్ల అమ్మకాలు పది రెట్లు పెరిగాయి. మార్కెట్లో వీటికి కొరత ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో కంపెనీలు ఉత్పత్తిని పెంచాయి గత నెల రోజుల్లో శానిటైజర్ల అమ్మకాలు పది రెట్లు పెరగడంతో పాటు ధరలు కూడా పెరిగాయి. హిమాలయ డ్రగ్, గోద్రోజ్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్, హిందూస్థాన్ యూనీ లీవర్‌లు శానిటైజర్ ఉత్పత్తులు పెంచుతున్నాయి.

విమాన రంగానికి రూ.8.29 లక్షల కోట్ల నష్టం

విమాన రంగానికి రూ.8.29 లక్షల కోట్ల నష్టం

కరోనా ప్రభావం విమానయాన రంగంపై కూడా భారీగానే ఉంది. విమాన ప్రయాణాలు తగ్గుముఖం పట్టాయి. ఎయిర్ లైన్స్ చాలా రూట్లకు విమానాలను నిలిపివేశాయి. ఈ ఏడాది అంతర్జాతీయ విమానయాన పరిశ్రమకు రూ.8.29 లక్షల కోట్ల (113 బిలియన్ డాలర్లు) ఆదాయం తగ్గవచ్చునని అంచనా.

అన్ని దేశాలపై ప్రభావం..

అన్ని దేశాలపై ప్రభావం..

కరోనా ప్రభావం భారత వాణిజ్యంపై 348 మిలియన్ డాలర్లుగా ఉంటుందని ఐక్య రాజ్య సమితి అంచనా వేసింది. యూరోపియన్ యూనియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలు 15.6 బిలియన్ డాలర్లు, అమెరికా 5.8 బిలియన్ డాలర్లు, జపాన్ 5.2 బిలియన్ డాలర్లు, దక్షిణ కొరియా 3.8 బిలియన్ డాలర్లు, తైవాన్ 2.6 బిలియన్ డాలర్లు, వియత్నాం 2.3 బిలియన్ డాలర్లు ఉన్నాయి.

ఐటీ కంపెనీలు అప్రమత్తం

ఐటీ కంపెనీలు అప్రమత్తం

కరోనా ప్రభావం భారత ఐటీ కంపెనీలపై కూడా పడింది. కరోనా సోకినట్లు అనుమానం ఉంటే ఇంటికి పంపించేస్తున్నాయి. హైదరాబాదులోని డీఎస్ఎం కంపెనీలో ఉద్యోగికి కరోనా సోకింది. దీంతో ఈ కంపెనీ ఉద్యోగులను ఇంటికి పంపించాయి. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ.. ఇలా అన్ని ప్రాంతాల్లోని ఐటీ కంపెనీలు శానిటైజేషన్ చర్యలు చేపట్టాయి.

ప్రతి ఉద్యోగికి స్క్రీనింగ్..

ప్రతి ఉద్యోగికి స్క్రీనింగ్..

ప్రతి ఉద్యోగిని స్క్రీనింగ్ చేసి లోపలకు అనుమతిస్తున్నాయి. క్లయింట్స్ వద్దకు వెళ్లి ప్రాజెక్టులను పర్యవేక్షించే వారి విదేశీ ప్రయాణాలను వాయిదా వేస్తున్నాయి. అంతర్గతంగా నిర్వహించే ఈవెంట్లను, ఫంక్షన్లను హైదరాబాద్ సహా వివిధ నగరాల్లోని ఐటీ కంపెనీలు రద్దు చేశాయి.

కాగ్నిజెంట్ మూసివేశారు

కాగ్నిజెంట్ మూసివేశారు

హైదరాబాద్‌లోని కాగ్నిజెంట్ కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. రహేజా మైండ్ స్పేస్ పార్కులోని 20వ భవంతిలో ఈ కార్యాలయం ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఉద్యోగులకు మెయిల్స్ పంపించిందని తెలుస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+