గత ఏడాది సెప్టెంబర్‌లో ఆర్థికమందగమనం నేపథ్యంలో కంపెనీలకు ఊరట కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ ట్యాక్స్‌ను తగ్గించింది. దీనిని 30 శాతం నుండి 22 శాతానికి తగ్గించింది. అలాగే కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు 25 శాతం నుండి 15 శాతానికి తగ్గించింది. ఇది కంపెనీలకు ఎంతో ఊరట కల్పించిన నిర్ణయం. అంతకుముందు మందగమనం, ఇప్పుడు కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే గతేడాది ఇచ్చిన కార్పోరేట్ తగ్గింపు ఊరట కంపెనీలకు కేవలం రుణాలు చెల్లించేందుకు ఉపయోగపడ్డాయని, ఇప్పుడు మరోసారి ప్రభుత్వం సహకారం అవసరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) తన వార్షిక నివేదికలో పేర్కొంది.

కార్పోరేట్ ట్యాక్స్‌పై ఊహించింది ఒక్కటి..
పెట్టుబడుల చక్రాన్ని పునఃప్రారంభించే ఉద్దేశ్యంతో, మందగమనం సమయంలో కంపెనీలకు ఊరట కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది కార్పోరేట్ ట్యాక్స్‌ను తగ్గించింది. కానీ ఇది ఉద్దేశించిన లక్ష్యాన్ని అందుకోలేదని, కంపెనీలు మాత్రం రుణ బ్యాలెన్స్‌లు తగ్గించుకోవడానికి, క్యాష్ బ్యాలెన్స్‌లు పెంచుకోవడానికి ఉపయోగించాయని ఆర్బీఐ పేర్కొంది. ఆ మొత్తాన్ని తిరిగి వ్యాపారంలో పెట్టుబడులుగా పెట్టలేదని అభిప్రాయపడింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే ప్రభుత్వ వినియోగమే కీలకమని కూడా తెలిపింది. ప్రభుత్వ వ్యయాలు, ప్రత్యేకించి మౌలిక రంగంపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందని తెలిపింది. పెట్టుబడుల యాక్టివిటీ క్షీణించినందున ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ఓడరేవుల ప్రయివేటీకరణ వంటి అంశాలను సూచించింది.

పెట్టుబడులు బలహీనం
కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు వల్ల దానిని తిరిగి ఇన్వెస్ట్ చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ప్రభుత్వం భావించింది. కానీ అధి జరగలేదని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ పెట్టుబడి పునరుద్ధరణ అవసరమని తెలిపింది ఆర్బీఐ. సెప్టెంబర్ 2019 కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపును రుణ చెల్లింపులు, నగదు బ్యాలెన్స్ వంటి వాటికి ఉపయోగించినట్లు తెలిపింది.

కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపుతో ప్రభుత్వానికి భారీ ఆదాయ గండి
కార్పోరేట్ ట్యాక్స్‌ను 22 శాతానికి, కొత్త డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు ట్యాక్స్‌ను 15 శాతానికి తగ్గించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.1.45 లక్షల కోట్ల మేర గండిపడుతుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కాపిటల్ గూడ్స్ ప్రొడక్షన్ డేటా ప్రకారం పెట్టుబడుల డిమాండ్ జూన్ 2020లో 36.9 శాతం క్షీణించింది. కాపిటల్ గూడ్స్ ఇంపోర్ట్స్ జూలైలో 24.7 శాతంగా ఉంది. దీనిని బట్టి కార్పోరేట్ ట్యాక్స్ పాలనా సంస్కరణ మూలధన వ్యయాన్ని పెంచడంలో ఇప్పటి వరకు సఫలీకృతం కాలేదు.

పెట్టుబడి ప్యాకేజీ
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని మేజర్ పోర్ట్స్ వంటి ప్రయివేటీకరణ ద్వారా అదనపు వనరులు సేకరించవచ్చునని ఆర్బీఐ సూచించింది. కాగా, గత నెలలో ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో దేశంలో మౌలిక సదుపాయాల ఆస్తుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించి, అదనంగా ఖర్చులు చేయడం కోసం పెట్టుబడి ప్యాకేజీ అవసరమని ఎకనమిక్ పాలసీ అడ్వైజర్ సూచన చేశారు. కరోనా కారణంగా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దాదాపు 20 శాతం క్షీణించిన ఆర్థిక వ్యవస్థకు ఇలాంటి నిర్ణయాలు ఊతమిస్తాయని పేర్కొంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications