ఆర్థిక మందగమనం, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో గత ఏడాది ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. వేతనాలు పెరిగే పరిస్థితులు కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఉద్దీపన చర్యల నేపథ్యంలో ఇటీవల పరిస్థితులు మారుతున్నాయి. అయితే సగటు ఉద్యోగికి ఈసారి పెద్దగా ఊరట దక్కని పరిస్థితులు ఉన్నాయని ఓ సర్వేలో వెల్లడైంది. భారత్‌లో కంపెనీలు ఈ ఏడాది సగటున 9.1 శాతం మేర వేతనాలు పెంచనున్నట్లు హెచ్ఆర్ కన్సల్టెన్సీ ఏఆన్ నివేదిక అంచనా వేసింది.

9.1 శాతం మేర పెరగనున్న వేతనాలు
వివిధ కంపెనీలు ఈ ఏడాదిన 9.1 శాతం మేర వేతనాలు పెంచనున్నాయి. ఆసియా - పసిఫిక్ ప్రాంతంలో భారత్‌లో పెరగనున్న శాలరీలే అత్యధికం. 2019లో 9.3 శాతం మేర వేతనాలు పెరిగాయి. 20 రంగాలకు చెందిన వెయ్యికి పైగా సంస్థల నుంచి సమాచారాన్ని సేకరించారు.

ఎంతైనా చెల్లించేందుకు...
ఈ సర్వే ప్రకారం 39 సంస్థలు 10 శాతం మేర, 42 సంస్థలు 8 నుండి 10 శాతం మేర వేతనాలు పెంచనున్నాయి. సరాసరిన గత ఏడాది పెరిగిన దాని కంటే (9.3 శాతం) తక్కువ కావడం గమనార్హం. అధిక నైపుణ్యం, స్కిల్ కలిగిన సిబ్బందిని నియమించుకునేందుకు సంస్థలు మొగ్గు చూపుతుండటంతో వీరికి ఎంతైనా జీతాలు చెల్లించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి.

గట్టి పోటీ..
ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే అధిక ద్రవ్యోల్భణంతో పాటు నైపుణ్యాల విషయంలో గట్టి పోటీ ఉండటం వల్ల భారత దేశంలో వేతనాల పెంపు వేగంగా కనిపిస్తోందని ఈ సర్వే వెల్లడించింది.

పదేళ్లలో అత్యల్పం.. కానీ చైనా కంటే ఎక్కువ
గడిచిన పదేళ్లలో సరాసరిన వేతనాల పెరుగుదల శాతం అత్యల్పం ఇదే కావడం గమనార్హం. అయితే ఆసియా పసిఫిక్ దేశాల్లో భారత్‌లో 9.1% పెరగనుండగా చైనాలో 6.3% మాత్రమే పెరగనుంది. ఫిలిప్పీన్స్‌లో 5.8%, మలేషియాలో 5.3%, సింగపూర్‌లో 3.8%, ఆస్ట్రేలియాలో 3.1% పెరగనున్నాయని సర్వేలో తేలింది.

నిరాశలోను.. అధిక శాలరీ..
వేతనాల పెంపు 9.1 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఆశాజనకం, అధికం అంటున్నారు. వివిధ కారణాల వల్ల భారత్ మందగమనంలో ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది నిరాశాజనక ఆర్థిక పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్‌లో వేతనాలు అధికంగానే పెరుగుతున్నాయని భావించవచ్చునని, ముఖ్యంగా ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లోనే ఇండియాలో అధికమని హెచ్ఆర్ కన్సల్టెన్సీ ఏఆన్ భాగస్వామి పెర్నాడేస్ వెల్లడించారు.

ఈ రంగాల్లో అధిక శాలరీలు..
తయారీ, ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో పని చేస్తున్న వారి జీతభత్యాలు అధికంగా పెరగనున్నాయని, ఆ తర్వాత ఎఫ్ఎంసీజీ, కెమికల్స్, ఇతర విభాగాలు ఉన్నాయని ఈ సర్వేలో వెల్లడైంది.

ఈ-కామర్స్‌లో డబుల్ డిజిట్ పెంపు
ఈ-కామర్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్ బిజినెస్‌లలో వేతనాల పెరుగుదల శాతం డబుల్ డిజిట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. కంపెనీల్లో వేతనాల పెరుగుదల మధ్య వ్యత్యాసం తగ్గుతున్నట్లుగా ఈ సర్వేలో వెల్లడైంది. 85 శాతం కంపెనీలలో వేతనాల పెరుగుదల 85 శాతంగా ఉండవచ్చు.

92 శాతం మంది ఆశావాహ దృక్పథం
ఈ సర్వే ప్రకారం.. ఇందులో పాల్గొన్న కంపెనీల్లో 92 శాతం కంపెనీలు 2020 ఏడాదిలో తమ వ్యాపారం వృద్ధి సాధిస్తుందని లేదా స్థిరంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. మిగతా 8 శాతం మంది మాత్రం ఆశాజనకంగా ఉండే పరిస్థితులు లేవన్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications