ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఇవ్వాళ మిశ్రమ ఫలితాలు కనపించాయి. లాభాలతో ఆరంభమైన మార్కెట్స్ సాయంత్రానికి పతనం అయ్యాయి. స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో నష్టపోయాయి. సెన్సెక్స్‌లో ఉన్న షేర్లన్నీ రెడ్ జోన్‌లో కనిపించాయి. సిమెంట్ సెగ్మెంట్‌కు చెందిన షేర్లన్నీ ఇన్వెస్టర్లను ముంచాయి. ఐటీ, రియాల్టీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, కేపిటల్ గూడ్స్, ఆటోమొబైల్స్.. ఇలా అన్నీ కీలకమైన బెంచ్‌మార్క్ ఇండైసెస్ అన్నీ నష్టపోయాయి. మైనస్‌లల్లో పడిపోయాయి.

48 పాయింట్ల లాస్..
ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 48 పాయింట్లు నష్టపోయింది. ట్రేడింగ్ 55,769.23 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఉదయం లాభపడ్డ 500కు పైగా పాయింట్లు.. సాయంత్రానికి తుడిచి పెట్టుకుపోయాయి. గరిష్ఠంగా 56,368 పాయింట్ల వద్ద నమోదైన ట్రేడింగ్.. సమయం గడుస్తున్న కొద్దీ నేల చూపులు చూసింది. 55,000ల కంటే దిగువకు పడిపోయింది. గురువారం నాటి క్లోజింగ్‌తో పోల్చుకుంటే 48 పాయింట్ల నష్టంతో 55,769.23 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగిసింది.

నిఫ్టీ అంతే..
నిఫ్టీ 50 కూడా అదే స్థాయిలో క్షీణించింది. 43.70 పాయింట్లను నష్టపోయింది. ఉదయం 100 పాయింట్ల మేర లాభంతో ట్రేడింగ్ ఆరంభమైనప్పటికీ.. అది ఎంతోసేపు స్థిరంగా నిలవలేదు. గరిష్ఠంగా 16,746.45 పాయింట్ల వద్ద ట్రేడింగ్ అయింది నిఫ్టీ. అనంతరం దాని గ్రాఫ్ పడిపోయింది. రెడ్ జోన్‌లోకి వచ్చింది. గురువారం నాటి ముగింపు ట్రేడింగ్‌తో పోల్చుకుంటే 43.70 పాయింట్ల నష్టంతో 16,628 వద్ద ముగిసింది. మార్కెట్స్‌లో ఉదయం ఉన్న జోష్.. సాయంత్రానికి కనిపించలేదు. సెన్సెక్స్, నిఫ్టీ- నష్టాల్లో ముగియడంతో ఇన్వెస్టర్లు ఉసూరుమన్నారు.

కొంత కోలుకున్నా..
చివరి రెండుగంటలో కోలుకున్నట్టే కనిపించింది. రికవరీ అవుతుందనుకున్న దశలో మళ్లీ కూలింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో సెన్సెక్స్ 56,091 పాయింట్ల నుంచి 56,216.61 పాయింట్ల వద్దకు ఎగబాకింది. ఎక్కువ సేపు అక్కడే స్థిరంగా నిలవలేకపోయింది. మళ్లీ క్రమంగా క్షీణించింది. చివరికి 55,769.23 పాయింట్ల వద్ద ఇవ్వాళ్టి ట్రేడింగ్ ముగిసింది.

అల్ట్రాటెక్ భారీ లాస్..
ఇవ్వాళ భారీగా నష్టపోయిన షేర్లల్లో సిమెంట్ రంగానికి చెందిన షేర్లు ఎక్కువగా కనిపించాయి. రామ్‌కో సిమెంట్స్-రూ.63.30 పైసలు, దాల్మియా భారత్-రూ.116.75 పైసలు, జేకే సిమెంట్ లిమిటెడ్-రూ.199.35 పైసలు, అల్ట్రాటెక్ సిమెంట్స్-రూ.330.25 పైసల మేర నష్టపోయాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్-రూ.రూ.93.05 పైసలు, బిర్లా కార్పొరేషన్-రూ.54.70 పైసలు, రేమాండ్ లిమిటెడ్-రూ.127.15 పైసల మేర నష్టాన్ని మిగిల్చాయి ఇన్వెస్టర్లకు.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications