దేశంలో మందగమనం తాండవం చేస్తోంది. సరుకులు, ఉత్పత్తులు కొనే వాళ్ళు కరువై కంపెనీలు కుయ్యోమొర్రో అంటున్నాయి. నిత్యావసరాల మాట అటుంచితే బిస్కట్లు కొనే వారు కూడా ఒకటి పది సార్లు ఆలోచించే పరిస్థితి నెలకొంది. డిమాండ్ పెరుగుతోందన్న మాట ఎప్పుడు వినిపిస్తుందా అని కంపెనీలు చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నాయి. భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు ఇప్పుడు డిమాండ్ లేక పోవడంతో తలపట్టుకుంటున్నాయి. చేసేది లేక ఖర్చులను తగ్గించుకోవడానికి ముందు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఆ తర్వాత ఎక్కడ కోత పెట్టాలో చూస్తున్నాయి.
ముఖ్యంగా దేశీయ ఆటో ఆటోమొబైల్ రంగం పరిస్థితి మరీ దీనంగా తయారయిపోయింది. ఏం తక్కువ ఏడాది కాలంగా కంపెనీల అమ్మకాలు తగ్గుతుండటంతో మందగమన పరిస్థితి ఎలా ఉందో బోధపడుతోంది. అమ్మకాలను పెంచుకోవడానికి కంపెనీలు చేయని ప్రయత్నమంటూ లేదు. భారీగా డిస్కౌంట్లు, ఆఫర్లు, క్యాష్ బ్యాక్ లు ఇస్తున్నప్పటికీ కస్టమర్లు మాత్రం వాహనాలను కొనుగోలు చేసే విషయంలో పక్కాగా ఉంటున్నారు. తప్పదు అనుకుంటే తప్ప వాహనాల జోలికి వెళ్లడం లేదు. అందుకే అమ్మకాలు అంతంత మాత్రంగా ఉన్నాయి.

వస్తోంది.. గ్రేట్ వాల్ మోటార్స్
చైనాలో అతిపెద్ద ఎస్ యువీ ల తయారీ కంపెనీ ఇది. ఈ కంపెనీకి భారత మార్కెట్ పై కన్ను పడింది. ఇక్కడి మార్కెట్లోకి ప్రవేశించే ప్రయత్నంలో భాగంగా తన భారత అనుబంద సంస్థ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేసింది. దేశీయ మార్కెట్లో దాదాపు 7,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనతో ఈ కంపెనీ ఉంది. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తమ ప్రణాళికలు వెల్లడించాలని కంపెనీ ఉన్నతాధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ సమావేశం తర్వాత కంపెనీ భవిష్యత్ వ్యూహాలు ఏమిటన్నది తెలిసే అవకాశం ఉంటుంది.

5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్
గ్రేట్ వాల్ కంపెనీ తన వాహనాలను తయారు చేయడానికి అనువైన ప్రాంతాన్ని పరిశీలించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ ఆటోమొబైల్ రంగ కంపెనీలు ఉన్న ప్రాంతాలను కంపెనీ వర్గాలు చూస్తున్నట్టు సమాచారం. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఆటో మొబైల్ కంపెనీలు తమ యూనిట్లను కలిగి ఉన్నాయి. కాగా ఇప్పటికే కొన్ని కంపెనీలకు ఉన్న యూనిట్లను కూడా ఈ కంపెనీ పరిశిలీస్తున్నట్టు సమాచారం.

పెరగనున్న పోటీ..
ఇప్పటికీ దేశీయ కార్ల మార్కెట్లో పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది. మరో వైపు మందగమన ప్రభావం వల్ల వాహనాల అమ్మకాలు తగ్గిపోతున్నాయి. బీఎస్ 6 నిభందనలు, ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకురావాలని ప్రభుత్వం ఒత్తిడి చేయడం వల్ల కంపెనీలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
* మారుతీ, హ్యుండై, మహీంద్రా, టాటా మోటార్స్, రెనో, హోండా, టొయోట, ఆడీ, బీఎండబ్య్లు, స్కోడా, ఫోక్స్ వ్యాగన్, మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, ఫోర్డ్ , ఫియట్ వంటి కార్ల కంపెనీలతో దేశీయ మార్కెట్ పోటీవంతంగా తయారైంది.
* ఈ ఏడాదిలో కొత్తగా ఎంజీ మోటార్, కియా కంపెనీలు ఈ మార్కెట్లోకి ప్రవేశించి పోటీని మరింత తీవ్రం చేశాయి. ఈ కంపెనీల వాహనాలకు కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో మరిన్ని కంపెనీలు కూడా భారత మార్కెట్ పై ఆసక్తి చూపుతున్నాయి. ఈ కంపెనీల్లో ఒకటే గ్రేట్ వాల్. అయితే ఈ కంపెనీ వచ్చిన తర్వాత పరిస్థితి ఏవిధంగా ఉంటుందో వేచి చూడాల్సింది.

కొత్త కంపెనీలు వస్తే మంచిదే...
కొత్త కంపెనీలు రావడం వల్ల వినూత్న టెక్నాలజీ, ఫీచర్లు కలిగిన వాహనాలు మార్కెట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. కంపెనీల మధ్య పోటీ కారణంగా ధరలు కూడా అందుబాటులోనే ఉండటానికి ఆస్కారం ఏర్పడుతుంది. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ప్రభుత్వానికి రాబడులు కూడా పెరుగుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
More From GoodReturns

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు..డబుల్ గేమ్ మొదలు పెట్టిన చైనా.. గగ్గోలుపెడుతున్న ట్రంప్ ..

హార్ముజ్ జలసంధిపై నీ పెత్తనమేంది.. అమెరికాపై విరుచుకుపడిన చైనా.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?



Click it and Unblock the Notifications