న్యూఢిల్లీ: ప్రత్యేక రుణాలు తీసుకునే ప్రణాళిక(స్పెషల్ బారోయింగ్ ప్లాన్)లో భాగంగా అరువుకు తీసుకున్న మొత్తం రూ. 6,000 కోట్లను కేంద్రం రాష్ట్రాలకు మొదటి దఫాగా విడుదల చేసింది. వస్తువ సేవల పన్ను(జీఎస్టీ) పరిహారంగా ఈ మొత్తాన్ని అందజేసింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం 5.19 వడ్డీ రేటుతో అరువు తీసుకుంది.

ఏపీతోపాటు 16 రాష్ట్రాలకు రూ. 6వేల కోట్ల జీఎస్టీ పరిహారం
రుణాలు తీసుకునే కాలం 3 నుండి 5 సంవత్సరాల పరిధిలో ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అరువు తీసుకున్న రూ. 6వేల కొట్లను మొదటి దఫాగా 16 రాష్ట్రాలకు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, ఒడిశా, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ తోపాటు రెండు కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్మూకాశ్మీర్‌లకు ఈ మొత్తాన్ని పంపించినట్లు ఆర్థిక శాఖ ఒ ప్రకటనలో వెల్లడించింది.

ఆర్థిక లోటుపై ప్రభావం ఉండబోదు..
గత కొంత కాలంగా జీఎస్టీ వసూళ్లు భారీ మొత్తంలో క్షీణించిన నేపథ్యంలో రాష్ట్రాల తరపున కేంద్రం 1.1 లక్షల కోట్ల రుణాలను తీసుకునేందుకు సిద్ధమైంది.
కాగా, రుణాలు తీసుకోవడం ప్రభుత్వ ఆర్థిక లోటుపై ఎలాంటి ప్రభావం చూపదు, ఈ మొత్తాలు రాష్ట్ర ప్రభుత్వాల మూలధన రసీదులుగా, ఆయా ఆర్థిక లోటుల యొక్క ఫైనాన్సింగ్‌లో భాగంగా ప్రతిబింబిస్తాయని పేర్కొంది.

సెప్టెంబర్‌లో పెరిగిన జీఎస్టీ వసూళ్లు
ఇది ఇలావుండగా, తాజాగా, జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. సెప్టెంబర్ నెలకు సంబంధించి మొత్తం రూ. 95,480 కోట్ల జీఎస్టీ రూపంలో వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇవే అత్యధిక వసూళ్లు కావడం గమనార్హం. గత ఏడాది సెప్టెంబర్ నెలతో పోలిస్తే.. ఈసారి వసూళ్లు 4 శాతం పెరిగితే, ఈ ఏడాది ఆగస్టుతో పోలిస్తే 10 శాతం పెరగడం సానుకూలాంశం. మొత్తం జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ వాతా రూ. 17,741 కోట్లు కాగా, స్టేట్ జీఎస్టీ రూ. 23,131 కోట్లు అని తెలిపింది. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూపంలో రూ. 47,484 కోట్లు, సెస్సుల నుంచి రూ. 7,124 కోట్లు వచ్చినట్లు వెల్లడించింది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ దశలవారీగా ఎత్తివేస్తున్న నేపథ్యంలో జీఎస్టీ వసూళ్లు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications