For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Price Today: విపరీతంగా పెరుగుతున్న గోల్డ్ రేటు.. జాగ్రత్తగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు..

|

Gold Price Today: 2022లో ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని బాగానే కూడబెట్టాయి. ఆర్థిక స్థిరత్వానికి ఇలా చేస్తుంటాయి. అయితే భారతీయులు పసిడి ప్రియులని అందరికీ తెలుసు. ఇటీవల కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో దీనిపై కస్టమ్స్ డ్యూటీ పెంచాలని నిర్ణయించటంతో గోల్డ్ రేటు ప్రస్తుతం గరిష్ఠ స్థాయికి పెరిగింది. అంతర్జాతీయ ధరలు గత నెలలో ఒక దశాబ్దపు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.

పెరుగుతున్న గోల్డ్..

పెరుగుతున్న గోల్డ్..

నవంబర్ 2022 నుంచి బంగారం ధర దాదాపుగా 15 శాతం ర్యాలీ చేసింది. దీనికి కారణం గడచిన 55 ఏళ్లుగా ఎన్నడూ లేనివిధంగా ప్రపంచ దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని అధికంగా కొనటమే. ఒక పక్క ద్రవ్యోల్బణం పెరగటంతో ఆర్థిక వ్యవస్థలు అస్థిరతకు లోనవుతున్నాయి. దీంతో డాలర్ కు డిమాండ్ భారీగా పెరిగింది. డాలర్ బలంగా ఉన్నప్పుడు అరుదుగా మాత్రమే బంగారం ధరలు ర్యాలీ చేస్తుంటాయి. ప్రపంచ దేశాలు ప్రధానంగా తమ ద్రవ్య విధానంలో వడ్డీ రేట్లను పెంచుతున్న తరుణంగా బంగారం ఇన్వెస్టర్లకు స్వర్గధామంగా మారటం కూడా ఈ రేట్ల పెరుగుదలకు ఒక కారణంగా కనిపిస్తోంది.

 గోల్డ్ భారీగా కొన్న దేశాలు..

గోల్డ్ భారీగా కొన్న దేశాలు..

బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్న దేశాల జాబితాలో టర్కీ, చైనా, ఖతార్, ఈజిప్ట్, ఇరాక్, యూఏఈ సెంట్రల్ బ్యాంకులు ముందంజలో ఉన్నాయి. ఈ క్రమంలో భారత సెంట్రల్ బ్యాంక్ RBI కూడా తన నిల్వలను పెంచుకుంది. 2022లో రిజర్వు బ్యాంక్ 33 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఈ క్రమంలో గోల్డ్ కొన్న ఏకైక అభివృద్ధి చెందిన మార్కెట్ ఎకానమీగా సెంట్రల్ బ్యాంక్ ఐర్లాండ్ నిలిచింది.

2022లో చరిత్ర..

2022లో చరిత్ర..

ట్రేడ్ బాడీ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం 2022లో సెంట్రల్ బ్యాంకులు ఏకంగా 4,741 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. 1950 తర్వాత ఇంత భారీగా బంగారం కొనుగోళ్లు జరగటం ఇది రెండవ అత్యధికమైనది. భారత్ అనుకరిస్తున్న పద్ధతి ప్రకారం మెుత్తం చెలామణిలో ఉన్న నోట్లకు బదులుగా బంగారం, విదేశీ మరి స్వదేశీ సెక్యూరిటీలను కలిగి ఉండాల్సి ఉంటుంది.

1991లో విషమ పరిస్థితి..

1991లో విషమ పరిస్థితి..

వాణిజ్య లోటు తారాస్థాయికి చేరుకున్న తరుణంలో 1991లో భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు రిజర్వు బ్యాంక్ తన బంగారం నిల్వలను తాకట్టు పెట్టింది. దీంతో చెల్లింపుల్లో డిఫాల్ట్ కాకుండా భారత్ నిలబడగలిగింది. అప్పుడు ఆర్బీఐ తరఫున IMF దగ్గర ఉన్న బంగారంలో 200 టన్నులను బయటి వ్యక్తులకు తెలియకుండా తరలించారు. ఇలా తరలించటం ఖర్చుతో కూడుకున్నదైనప్పటికీ.. విషయం బయటికి పొక్కితే బంగారం ధరలు విపరీతంగా పెరుగుతాయని అప్పట్లో మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ దీనిని పూర్తి చేశారు.

 ఈరోజు బంగారం ధరలు..

ఈరోజు బంగారం ధరలు..

ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ లో రూ.57,160గా ఉంది. విశాఖలో రూ.57,160, ముంబైలో రూ.57,160, చెన్నైలో 58,200, దేశ రాజధాని దిల్లీలో రూ.57,310గా ఉంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ లో రూ.52,400, విశాఖలో రూ.52,400, ముంబైలో రూ.52,400, చెన్నైలో రూ.53,350, దిల్లీలో రూ.52,550గా ఉన్నాయి.

English summary

Gold Price Today: విపరీతంగా పెరుగుతున్న గోల్డ్ రేటు.. జాగ్రత్తగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు.. | Central banks including RBI cautious Over Rising Gold Prices Steaply after 55 years

Central banks including RBI cautious Over Rising Gold Prices Steaply after 55 years
Story first published: Sunday, February 5, 2023, 14:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X