OnePlus ఇండియాలో 5వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. 5 ఇయర్ సందర్భంగా వివిధ మొబైల్ ఫోన్లపై ప్రత్యేక ఆఫర్స్ ప్రకటించింది. OnePlus 7T, OnePlus 7 Pro ఫోన్లను తక్కువ ధరకు ఇస్తోంది. ప్రత్యేక డిస్కౌంట్లు ఈ-కామర్స్ వెబ్ సైట్ అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి. నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది. ఈ మొబైల్ ఫోన్లపై కస్టమర్లకు భారీ ఆఫర్లు ప్రకటించింది.

రూ.10,000 వరకు డిస్కౌంట్
ఈ చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ (వన్‌ప్లస్) OnePlus 7T, OnePlus 7 Pro ఫోన్లపై మొత్తంగా రూ.10,000 వరకు డిస్కౌంట్ ఇస్తోంది. అలాగే, వివిధ బ్యాంకుల క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి తక్షణ డిస్కౌంట్ కొంత పొందవచ్చు.
HDFC కార్డుతో రూ.3,000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్
HDFC బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా రూ.3,000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ ఉంది. అలాగే ఈఎంఐ సౌకర్యం ఉంది. ఈ రెండు హ్యాండ్ సెట్లపై 6 నెలల ఈఎంఐ (నో-కాస్ట్) సౌకర్యం ఉంది.
ఆఫర్లు ఇక్కడ.. డిసెంబర్ 2 లాస్ట్ డేట్
OnePlus 7 Pro, OnePlus 7T ఫోన్లపై ఇదివరకు ఎప్పుడూ చూడని కళ్లు చెదిరే ఆఫర్లు ఉన్నాయని, ఇవి అమెజాన్ ఆన్ లైన్ స్టోర్‌తో పాటు భాగస్వామ్య స్టోర్స్‌ల్లో అందుబాటులో ఉంటాయని OnePlus India పేర్కొంది. ఈ ఆఫర్లు నవంబర్ 25వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు మాత్రమే ఉంటాయని తెలిపింది. ఇది అందరికీ పార్టీ సమయం అని, అమెజాన్‌తో ఫిఫ్త్ యానివర్సలీ సెలబ్రేషన్స్ చేసుకోండని పేర్కొంది.
భారీ తగ్గింపు..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డు పైన రూ.3,000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ ఉంది. నో కాస్ట్ ఈఎంఐ 6 నెలలు ఉంది. రూ.44,999 విలువ కలిగిన OnePlus 7 Pro కేవలం రూ.39,999కే వస్తుంది. రూ.37,999 విలువ కలిగిన OnePlus 7T రూ.34,999కే వస్తోంది. ఉదాహరణకు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ రూ.5,000కు తోడు HDFC కార్డు డిస్కౌంట్ రూ.3,000 వరకు ఉంటుంది. దీంతో మొబైల్ రూ.8,000 తక్కువ ధరకు వస్తోంది.
మొబైల్ ధరలు ఇలా...
- OnePlus 7T ధరలు... 8GB + 128GB వేరియంట్ రూ.37,999, 8GB + 256GB వేరియంట్ రూ.39,999గా ఉన్నాయి.
- OnePlus 7 Pro ధరలు... 6GB + 128GB మోడల్ రూ.48,990, 8GB + 256GB మోడల్ రూ.52,990, 12GB + 512GB మోడల్ రూ.57,999గా ఉన్నాయి.
- డిసెంబర్ 2వ తేదీ వరకు ఇవి రూ.10,000 వరకు తక్కువకు రానున్నాయి.


Click it and Unblock the Notifications