ఈ-కామర్స్ వెబ్‌సైట్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) షాకిచ్చింది. ఈ వెబ్‌సైట్స్ డిస్కౌంట్‌లపై దర్యాఫ్తు జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక బ్రాండ్స్, కొన్ని మొబైల్ ఫోన్లకు ఇచ్చే ప్రాధాన్యతపై కూడా దర్యాఫ్తు చేయాలని సోమవారం సూచించింది.
దర్యాఫ్తు అవసరమని సీసీఐ అభిప్రాయపడింది. దర్యాఫ్తు జరిపి 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని యాంటీ ట్రస్ట్ బాడీ తన డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించింది. అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ బెజోస్ ఈ వారం భారత్‌లో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని, ప్రభుత్వ అధికారులను కలిసే అవకాశముంది. ఆయన పర్యటనకు ముందు ఈ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం.

సీసీఐకి సహకరిస్తామని అమెజాన్
తమ భారీ డిస్కౌంట్లపై ఆందోళనల నేపథ్యంలో సీసీఐతో కలిసి పని చేస్తామని అమెజాన్ ప్రకటించింది. అమెజాన్ పైన వచ్చిన ఆరోపణలను పరిష్కరించే అవకాశాలను తాముస్వాగతిస్తున్నామని, తాము సీసీఐకి పూర్తిగా సహకరిస్తామని పేర్కొంది.

చట్టాలకు కట్టుబడి ఉంటామని ఫ్లిప్‌కార్ట్
తమ కంపెనీ అన్ని చట్టాలకు లోబడి సాగుతోందని, చట్టాలకు కట్టుబడి ఉంటామని, తాము సీసీఐ ఆర్డర్‌ను పరిశీలిస్తున్నామని వాల్‌మార్ట్ నేతృత్వంలోని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వెబ్ సైట్ల భారీ డిస్కౌంట్లపై ఢిల్లీ వ్యాపార్ మహాసంఘ్ సీసీఐకి ఫిర్యాదు చేసింది.

మొబైల్ ఫోన్స్ ప్రత్యేక లాంచ్
డీప్ డిస్కౌంట్, ప్రిఫరెన్షియల్ లిస్టింగ్ వంటి వాటిపై దర్యాఫ్తు చేయాల్సిన అవసరముందని, వీటి వల్ల ప్రతికూల ప్రభావం ఉందా అనే కోణంలో దర్యాఫ్తు చేయాలని సీసీఐ పేర్కొంది. ఎంపిక చేసిన మొబైల్ ఫోన్ల ప్రత్యేక లాంచింగ్, కొంతమంది అమ్మకందారులకు ప్రాధాన్యత, ప్లాట్‌ఫాంలో తగ్గింపు పోటీపై ప్రతికూల ప్రభావం చూపే పర్యావరణాన్ని సృష్టిస్తాయని సీసీఐ అభిప్రాయపడింది.

2018లో ప్రత్యేకంగా లాంచ్ చేసిన మొబైల్స్ ఎన్ని అంటే
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ప్రత్యేకంగా కొన్ని మొబైల్ ఫోన్లను లాంచ్ చేసి, విక్రయిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ మానుఫ్యాక్చరర్స్, ఈ-కామర్స్ వెబ్ సైట్స్ మధ్య ఇందుకు ఎక్స్‌క్లూజివ్ పార్ట్‌నర్‌షిప్ ఉన్నట్లుగా భావిస్తున్నారు. 2018లో ఫ్లిప్‌కార్ట్ 67 మొబైల్ ఫోన్లు ఎక్స్‌క్లూజివ్‌గా లాంచ్ చేయగా, అమెజాన్ 45 మొబైల్ ఫోన్లు లాంచ్ చేసింది. అధిక డిస్కౌంట్లు, ప్రిఫరెన్షియల్ లిస్టింగ్ ద్వారా ఆయా బాండ్స్, అమ్మకందారులకు అనుకూలంగా మారవచ్చునని సీసీఐ భావిస్తోంది. దీనిపై సమగ్ర దర్యాఫ్తు కోరింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications