ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చిత్రా రామకృష్ణ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆమె అరెస్ట్ దాదాపుగా ఖాయమైనట్టే కనిపిస్తోంది. ఇప్పటికే ఆమెను కేంద్రీయ దర్యాప్తు సంస్థ.. సీబీఐ పలుమార్లు విచారించింది. ఇదే కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్‌ను అరెస్టు చేశారు సీబీఐ అధికారులు. తాజాగా చిత్రా రామకృష్ణ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్‌ను ముంబైలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టి వేసింది. ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేయడం లాంఛనప్రాయమే అయింది.
చిత్రా రామకృష్ణన్ తన హయాంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని లీక్ చేయడం, సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డును సైతం తప్పుదారి పట్టించేలా వ్యవహరించారనే ఆరోపణలను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆమె ఓ యోగి సూచనలు, సలహాలను పాటించారని చెబుతున్నారు. ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్‌కు వచ్చే సమాచారాన్ని, వాటికి సంబంధించిన డేటాను- ఆ హిమాలయాల యోగి ఇచ్చిన సూచనల మేరకు ఎంపిక చేసిన వారికి లీక్ చేశారని సీబీఐ అధికారులు గుర్తించారు.

చిత్రా రామకృష్ణను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన సందర్భంగా ఆమె ఇచ్చిన సమాచారాన్ని అధికారులు రికార్డ్ చేశారు. దీని ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేస్తోన్నారు. ఇదివరకు ఎన్ఎస్ఈ మరో మాజీ ముఖ్య కార్యనిర్వహణాధికారి రవి నరేన్, ఆనంద్ సుబ్రమణిన్‌ల కోసం లుక్ అవుట్ సర్కులర్‌ను జారీ చేశారు. వారిద్దరూ దేశం విడిచి వెళ్లకుండా ఉండేలా తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సీబీఐ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇదే కేసులో ఓపీజీ సెక్యూరిటీస్ ప్రమోటర్స్ సంజయ్ గుప్తా సహా పలువురిపై సీబీఐ అధికారులు కేసు సైతం నమోదు చేశారు. ఈ కేసులో ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు కూడా పాలుపంచుకున్నారు. రామకృష్ణ, సుబ్రమణియన్ నివాసాల్లో రెండు రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు. కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగానే సీబీఐ అధికారులు చిత్రా రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. కాగా ఇప్పుడు తాజాగా ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టి వేయడంతో- అరెస్టు కావడం ఖాయమైంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications