ఈ-ఫైలింగ్ చేసిన ఆదాయపు పన్ను రిటర్న్స్(ITR)ను వెరిఫికేషన్ చేసుకొని పన్ను చెల్లింపుదారులకు ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ మరోసారి అవకాశం కల్పించింది. 2015-16 నుండి 2019-20 మదింపు సంవత్సరాలకు సంబంధించి ఎలక్ట్రానిక్ పద్ధతిలో దాఖలు చేసిన పన్ను రిటర్న్స్‌ను వెరిఫై చేసుకోని వారికి ఏకకాల సడలింపులు ఇస్తున్నట్లు ఐటీ విభాగం సోమవారం వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీలోగా రిటర్న్స్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని గడువు ఇచ్చింది. గత మదింపు సంవత్సరాలకు సంబంధించి ఈ-ఫైలింగ్ రిటర్న్స్ దాఖలు చేసి వెరిఫికేషన్ పూర్తి కాని వారికి వర్తిస్తుందని తెలిపింది.

వెరిఫికేషన్ ఇలా..
- డిజిటల్ సంతకం లేకుండా ఆన్‌లైన్ ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసినప్పుడు ఆధార్ ఓటీపీ (వన్ టైమ్ పాస్ వర్డ్) లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ-ఫైలింగ్ అకౌంట్లోకి లాగిన్ కావడం ద్వారా వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
- లేదా, ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ లేదా బెంగళూరులోని సీపీసీకి సంతకం చేసిన ఐటీఆర్ V పత్రాలను పంపించడం ద్వారా వెరిఫికేషన్ చేసుకోవచ్చు.
ఐటీఆర్‌లు అప్ లోడ్ చేసిన 120 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలి.

అందుకే సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు
బెంగళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ వద్ద వెరిఫికేషన్ పత్రం కోసం వేచి ఉన్న ఈ-ఫైలింగ్ రిటర్న్స్ చాలా పెండింగ్‌లో ఉన్నట్లు సీబీడీటీ తెలిపింది. సకాలంలో సమర్పించకుంటే ఆ ఐటీఆర్‌లను పరిగణలోకి తీసుకోరని తెలిపింది. ఈ నేపథ్యంలో వన్ టైమ్ మినహాయింపును ఇస్తున్నట్లు తెలిపింది.
పన్ను చెల్లింపుదారుల్లోని ఆందోళనను దృష్టిలో పెట్టుకొని 2015-16, 2016-17, 2017-18, 2018-19, 2019-20 మదింపు సంవత్సరాల ఈ-ఫైలింగ్ రిటర్న్స్ వెరిఫికేషన్‌కు సెప్టెంబర్ 30వ తేదీ వరకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.

అలాంటప్పుడు మినహాయింపులు
నిర్ణీత కాలంలో ఐటీఆర్-వీను దాఖలు చేసి వెరిఫికేషన్ పూర్తికాకపోతే నాన్-ఈఎస్టీ లేదా పెండింగ్, నాన్ రిసీట్ ఫర్ ఐటీఆర్ వీగా పరిగణించే అవకాశం ఉంది. కాబట్టి ఐటీ డిపార్టుమెంట్ పన్ను చెల్లింపుదారులకు ఈ వెసులుబాటును కల్పించింది.
సాధారణంగా 120 రోజుల్లో ఈ పన్ను రిటర్న్స్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. సాంకేతిక కారణాలతో ఇబ్బందులు తలెత్తిన సందర్భాల్లో ఆదాయపు పన్ను శాఖ మినహాయింపులు ఇస్తుంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications