For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియాలో బిజినెస్ అంత ఈజీ కాదు : జర్మన్ ఆటో దిగ్గజం వోక్స్ వ్యాగన్ ఎండీ వ్యాఖ్యలు .. రీజన్ ఇదే !!

|

ఇండియాలో కొత్తగా రూ.8,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని భావించిన జర్మనీ ఆటో దిగ్గజం వోక్స్ వ్యాగన్ గ్రూప్ భారత దేశంలో వ్యాపారం చేయడం అంత సులభం కాదని, చైనా నుండి వాహనాల తయారీకి కావాల్సిన ముడి భాగాల దిగుమతులపై ఆంక్షలు విధించడం ఆలస్యం చేయడం వంటి చర్యలు తిరోగమన చర్యలని, పాత సోషలిస్ట్ మోడల్, క్లోజ్డ్ ఎకానమీలో మంచిదని పేర్కొంది.

 చైనా నుండి దిగుమతుల విషయంలో తీసుకున్న నిర్ణయంతో నష్టం

చైనా నుండి దిగుమతుల విషయంలో తీసుకున్న నిర్ణయంతో నష్టం

భారతదేశం చైనా నుండి దిగుమతుల విషయంలో తీసుకున్న నిర్ణయం ఇండియా యొక్క పోటీతత్వాన్ని దెబ్బతీస్తుంది మరియు ఎగుమతుల అవకాశాలను కూడా దెబ్బతీస్తుందని భారతదేశంలో కొత్త మోడళ్లను ప్రారంభించి కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తున్న సంస్థ వోక్స్ వ్యాగన్ తెలిపింది. ఇండియా ప్రతిచర్య మమ్మల్ని మరింత బాధపెడుతుందని పేర్కొన్నారు వోక్స్ వ్యాగన్ గ్రూప్ యొక్క ఇండియా వ్యాపారాలు మరియు సంస్థల (స్కోడా) ఎండి గురు ప్రతాప్ ఎస్ బొపరాయ్ .

 ప్రభుత్వ నిబంధనల్లో ఆకస్మిక మార్పులు కంపెనీలకు ఇబ్బంది అన్న వోక్స్ వ్యాగన్ ఎండీ

ప్రభుత్వ నిబంధనల్లో ఆకస్మిక మార్పులు కంపెనీలకు ఇబ్బంది అన్న వోక్స్ వ్యాగన్ ఎండీ

తమ ఉత్పతుల తయారీకి విడి భాగాల దిగుమతుల అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆటో కంపెనీలకు ప్రభుత్వం నుండి దీర్ఘకాలిక విధాన దిశ అవసరం అని పేర్కొన్న బోపరాయ్ నిబంధనలలో ఆకస్మిక మార్పులు కంపెనీలకు ఇబ్బంది అన్నారు. చైనా నుండి విడిభాగాల దిగుమతులపై పరిమితులపై, మాట్లాడిన ఎండీ బోపరాయ్ ప్రభుత్వ దిగుమతుల పరిమితులు అమలు చేయడం కష్టమని, ఆచరణాత్మకంగా లేదని అన్నారు.

 ప్రతి బడ్జెట్ లో విధానాలను సర్దుబాటు చేస్తే సంస్థల ప్రణాళికలకు దెబ్బ

ప్రతి బడ్జెట్ లో విధానాలను సర్దుబాటు చేస్తే సంస్థల ప్రణాళికలకు దెబ్బ

అంతేకాదు ఖచ్చితంగా 3 సంవత్సరాల నుండి ఒక దశాబ్దం వరకు నడిచే ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ మరియు పాలసీని కలిగి ఉండాలని అన్నారు .ప్రతి బడ్జెట్‌లో మీరు విధానాలను సర్దుబాటు చేస్తే మా ప్రణాళికలు దెబ్బతింటాయి అని బోపరాయ్ పేర్కొన్నారు .వోక్స్ వ్యాగన్ గ్రూప్ భారతదేశంలో పూణే మరియు ఔరంగాబాద్ వద్ద రెండు కర్మాగారాలను కలిగి ఉంది. స్థానికంగా స్కోడా, వోక్స్ వ్యాగన్ మరియు ఆడి వంటి బ్రాండ్ల నుండి మోడళ్లను తయారు చేస్తుంది . ఇది డుకాటీ మోటార్ సైకిళ్ళు కాకుండా పోర్స్చే, లంబోర్ఘిని నుండి కూడా వాహనాలను దిగుమతి చేస్తుంది.

Read more about: india business imports
English summary

ఇండియాలో బిజినెస్ అంత ఈజీ కాదు : జర్మన్ ఆటో దిగ్గజం వోక్స్ వ్యాగన్ ఎండీ వ్యాఖ్యలు .. రీజన్ ఇదే !! | Business is not easy in India.. this is the reason behind German auto giant Volkswagen MD comments

As it lines up a fresh Rs 8,000-crore investment for India, German auto giant volkswagen group has said that it is not easy to do business in the country and warned that putting restrictions on, or delaying, imports of critical components from China is a retrograde measure and an “old socialist model, held good in a closed economy”.
Story first published: Monday, August 10, 2020, 19:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X