2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశముంది. ఇప్పటికే బడ్జెట్‌కు సంబంధించిన కసరత్తు సాగుతోంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను, పారిశ్రామికవేత్తలను, ఆర్థిక నిపుణులను బడ్జెట్ రూపకర్తలు సంప్రదిస్తున్నారు. వివిధ వర్గాల సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (CII) సోమవారం పారిశ్రామిక రంగానికి సంబంధించి మరిన్ని ప్రోత్సాహకాలు అందించాలని కోరింది.

దిగుమతి సుంకాలు ఎత్తివేయాలి
దిగుమతులకు సంబంధించి రాబోయే మూడేళ్లకు గ్రేడెడ్ రోడ్ మ్యాప్ ప్రకటించాలని CII కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరుతూ ఆదివారం జాబితా విడుదల చేసింది. ముడి పదార్థాలపై దిగుమతి సుంకాలు పూర్తిగా ఎత్తివేయాలని కోరింది. తప్పనిసరి అనుకుంటే ముడి పదార్థాలపై జీరో నుండి 2.5 శాతం, ఫినిష్డ్ గూడ్స్ పైన 5 శాతం నుండి 7.5 శాతం, ఇంటర్మీడియేట్స్ పైన 2.5 శాతం నుండి 5 శాతం మించకూడదని విజ్ఞప్తి చేసింది. దీంతో అంతర్జాతీయ కంపెనీలు తమ ఉత్పత్తి యూనిట్లను భారత్‌కు తరలించి, మన ఎగుమతులు పెరిగేందుకు దోహదపడతాయని పేర్కొంది.

వేతనాలపై రాయితీ పెంచాలి
దేశంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు కొత్త ఉద్యోగుల వేతనాలపై ఇస్తోన్న రాయితీని మరింత పెంచాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఉన్నత నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులకు చెల్లించే జీతాల్లో కంపెనీలు మూడేళ్ల వరకు 30% పన్ను రాయితీ క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే నెలవారీ జీతం రూ.25,000 వరకు పరిమితం. వచ్చే బడ్జెట్లో దీనిని రూ.50,000కు పెంచాలని కోరింది.

క్లిష్టమైన బడ్జెట్
భారతీయ బ్యాంకుల బ్యాడ్ లేదా డౌట్‌ఫుల్ రుణాలకు సంంధించిన ప్రొవిజన్స్‌ను 8.5 శాతం నుండి 15 శాతానికి పెంచాలని కోరింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రికవరీకి అవసరమైన చర్యలు బడ్జెట్‌లో ఉండాలని కోరింది. కరోనా కారణంగా పలు రంగాలు కుదేలాన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్ నిర్మలా సీతారామన్‌కు ఎంతో క్లిష్టమైనదేనని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications