Budget 2022: నిర్మలమ్మ బడ్జెట్‌లో వేతనజీవులు ఏం కోరుతున్నారు?

కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో రెండో బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. ప్రత్యక్ష పన్నుల ఆదాయంలో 35 శాతం నుండి 40 శాతం వాటా కలిగిన వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులైన ఉద్యోగులు నిర్మలమ్మ తదుపరి బడ్జెట్ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆర్థికంగా చతికిలపడిన తమ కుటుంబాలకు జీవం పోసేందుకు ప్రభుత్వం నుండి రాయితీలు, మినహాయింపులు కోరుతున్నారు. ఈ బడ్జెట్‌లో వేతన జీవులు ఆదాయ పన్ను విధానంలో మార్పులు, స్టాండర్డ్ డిడక్షన్ పెంపు, పీఎఫ్ పైన వడ్డీ మినహాయింపు పెంపు, క్రిప్టో పెట్టుబడులపై స్పష్టత, హోమ్ లోన్ వడ్డీ మినహాయింపు పెంపును కోరుతున్నారు.

ఇన్వెస్ట్‌మెంట్ క్లెయిమ్ డిడక్షన్

ఇన్వెస్ట్‌మెంట్ క్లెయిమ్ డిడక్షన్

ప్రస్తుతం ఇన్వెస్ట్‌మెంట్ క్లెయిమ్ డిడక్షన్ రూ.1,50,000గా ఉంది. లైఫ్ ఇన్సురెన్స్ ప్రీమియం, డిఫర్డ్ యాన్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్, వివిధ మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ షేర్లు, డిబెంచర్స్, ట్యూషన్ ఫీజు వంటివి ఉన్నాయి. వీటిపై పన్ను మినహాయింపు పరిమితి రూ.1.50 లక్షలుగా ఉంది. దీనిని రూ.2,50,000కు పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

పీఎఫ్ పరిమితి పెంపు

పీఎఫ్ పరిమితి పెంపు

ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో ప్రతి సంవత్సరం జమ చేసే మొత్తం రూ.2.50 లక్షలు. ఈ మొత్తం దాటితే ఆ సొమ్ము పైన వచ్చే వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. గత బడ్జెట్‌లో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే కరోనా అస్థిర పరిస్థితుల కారణంగా ఉద్యోగులు, వారికుటుంబాలకు మరింత సామాజిక భద్రత కల్పించేందుకు ఈ పరిమితిని కనీసం రూ.4 లక్షలకు పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది.

క్రిప్టో బిల్లుపై స్పష్టత

క్రిప్టో బిల్లుపై స్పష్టత

గత పార్లమెంటు సమావేశాల్లో క్రిప్టోకరెన్సీ బిల్లును తీసుకు వస్తారని భావించారు. క్రిప్టో పెట్టుబడులను నిషేధిస్తారా, నియంత్రిస్తారా, పన్నులు విధిస్తారా అనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. అయితే అప్పుడు బిల్లు తీసుకురాలేదు. అయితే బడ్జెట్‌లో క్రిప్టో పెట్టుబడులపై నిర్మలమ్మ స్పష్టత ఇవ్వవచ్చునని భావిస్తున్నారు.

న్యూ ట్యాక్స్ రెజిమ్ మార్పులు

న్యూ ట్యాక్స్ రెజిమ్ మార్పులు

ప్రభుత్వం ఇటీవల పన్ను స్లాబ్స్ రేటును గణనీయంగా తగ్గించింది. అయినప్పటికీ హెచ్ఆర్ఏ, ఎల్టీఏ, స్టాండర్డ్ డిడక్షన్, చాప్టర్ VI-A తగ్గింపులు మొదలైన కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి మినహాయింపు పరంగా షాక్ అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో సెక్షన్ 115బీఏసీ ప్రకారం కొత్త పన్ను విధానంలో మార్పులు చేయాలని అంటున్నారు.

హోమ్ లోన్ వడ్డీ మినహాయింపు

హోమ్ లోన్ వడ్డీ మినహాయింపు

వడ్డీ రేట్లు అందుబాటులో ఉండటంతో చాలామంది గృహ రుణంతో ఇల్లు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ రుణానికి చెల్లించే వడ్డీకి ప్రస్తుతం రూ.2 లక్షల వరకు మినహాయింపు ఉంది. దీనిని మరో రూ.1 లక్షకు పెంచాలని కోరుతున్నారు. హెచ్ఆర్ఏ లేని వారికి ఇంటి అద్దెకు ఇస్తున్న మినహాయింపును రూ.1.50 లక్షలు చేయాలని శాలరైడ్ కోరుతున్నారు.

వర్క్ ఫ్రమ్ హోమ్

వర్క్ ఫ్రమ్ హోమ్

చివరగా, కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కార్యాలయ ఖర్చులు తగ్గాయి. ఇది సంస్థకు తగ్గిన ఖర్చులు. కానీ ఉద్యోగులకు ఖర్చులు పెరిగాయి. ఇంట్లోనే ఇంటర్నెట్, ప్రత్యేక గది, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఫర్నీచర్ కోసం అదనపు ఖర్చు అవుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని పన్ను మినహాయింపును రూ.50,000కు ఉండాలని కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+