Budget 2022: ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడున్న ఆదాయపు పన్ను స్ట్రక్చర్ పైన 65 శాతం మంది ట్యాక్స్‌పేయర్స్ అసంతృప్తితో ఉన్నారని ఓ సర్వేలో వెల్లడైంది. ఈ మేరకు యు-గవ్ సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రస్తుత ఆదాయం పన్ను పరిమితులు పెంచాలని స్పష్టం చేశారు. తద్వారా వేతన జీవులపై పన్ను భారం తగ్గించాలన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆదాయపు పన్నుకు సంబంధించి ఊరట ప్రకటనలు వస్తాయని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో యు-గవ్ సర్వే నిర్వహించింది.

స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి
దేశ ఆర్థిక అభివృద్ధికి ఆదాయపు పన్ను చాలా ముఖ్యమని 74 శాతం మంది వెల్లడించారు. అయితే 38 శాతం మంది మాత్రం ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయపు పన్ను మినహాయింపును రూ.5 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి పదిమందిలో ముగ్గురు ప్రస్తుత రూ.1.5 లక్షల పన్ను రాయితీ పెంచాలని కోరారు. 32 శాతం మంది వేతనజీవులకు కల్పిస్తున్న రూ.50వేల స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.75వేలు లేదా రూ.1 లక్షకు పెంచాలని కోరుతున్నారు. స్టాండర్డ్ డిడక్షన్ పెంచాలని కోరుతున్న వారిలో 40 ఏళ్లకు పైన ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు.

వైద్య ఖర్చులు, ఇంటి రుణంపై వడ్డీ
కరోనా నేపథ్యంలో వైద్య ఖర్చులు పెరిగాయని, ఈ నేపథ్యంలో సెక్షన్80డీ పరిధఇలోని వైద్య ఖర్చుల పరిమితిని పెంచాలని మూడింట ఒకవంతు మంది చెప్పారు. 35 శాతం మంది వైద్య ఖర్చుల పరిమితిని పెంచాలని కోరారు.
అలాగే, హౌసింగ్ లోన్ వడ్డీ పైన పన్ను రాయితీని పెంచాలని కోరారు. 80 శాతం మంది పన్ను చెల్లింపు సబబు అని చెప్పగా, 25 శాతం మంది 10 శాతం చెల్లించవచ్చునని చెబుతున్నారు. అందరి పైన పన్ను విధించాలని 35 శాతం మంది అభిప్రాయపడ్డారు.

బడ్జెట్ పైన ప్రభావం
వ్యాపారులు, సంపన్నుల్లో 51 శాతం మంది మిగతా వారికంటే ఎక్కువ పన్ను చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 1.5 కోట్ల మంది, భారత్‌లో 1022 మంది అభిప్రాయాలను సేకరించింది. 47 శాతం మంది పట్టణవాసులు ప్రతియేటా బడ్జెట్‌ను అనుసరిస్తామని, 27 శాతం మంది కొన్నిసార్లు అనుసరిస్తామన్నారు. మధ్య తరగతిలో 67 శాతం మంది ప్రజలు తమ పర్సనల్ ఫైనాన్స్ పైన బడ్జెట్ ప్రభావం ఉంటుందన్నారు. పేదలు, సంపన్నులు మాత్రం ప్రభావం ఉండదన్నారు.
More From GoodReturns

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications