ఆర్థిక మందగమనం నుంచి బయటపడేందుకు కేంద్రం వివిధ రకాల ఉద్దీపన చర్యలు తీసుకుంది. ఆయా రంగాలకు వేల కోట్లు ప్రకటించడం, కార్పోరేట్ ట్యాక్స్ వంటివి తగ్గించడం చేసింది. మందగమనం నేపథ్యంలో వచ్చే బడ్జెట్‌లోను ఆదాయపు పన్ను, ప్రత్యక్ష, పరోక్ష పన్నులు, ఎక్సైజ్, కస్టమ్ సుంకాలపై పరిశ్రమ, వాణిజ్య సంఘాల నుంచి సూచనలు కోరుతోంది. వివిధ వర్గాల నుంచి సలహాలు, సూచనలు కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ సర్క్యులర్ జారీ చేసింది.

తగ్గుతున్న జీడీపీ
డిమాండ్ తగ్గడంతో జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ రేటు ఆరేళ్ల కనిష్ఠానికి (5 శాతం) పడిపోయింది. ఈ క్వార్టర్లోను మరింత తగ్గుతుందని (4.2%) అంచనా ఉంది. ఈ ఏడాది జీడీపీ ఆందోళనకరంగా ఉన్నప్పటికీ వచ్చే ఏడాది మెరుగుపడుతుందని వివిధ రేటింగ్ ఏజెన్సీలు వెల్లడించాయి. ప్రస్తుత మందగమన పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ఉద్దీపన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ట్యాక్స్ అంశాలను కూడా పరిశీలిస్తోంది.

ట్యాక్స్ తగ్గింపులు...
కంపెనీల ఆదాయ పన్ను చెల్లింపు భారంపై ఊరట కల్పించారు. ఎన్‌బీఎఫ్‌సీ, రియల్టీ రంగాలను ఆదుకునేందుకు ప్రత్యేక సహాయక ప్యాకేజీ ప్రకటించారు. ఉద్దీపన ప్రభావాలు మెల్లిగా కనిపిస్తున్నాయి. మరింత ఊతమిచ్చేందుకు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల భారం మరింత తగ్గించి ప్రజలు, కంపెనీల వినిమయ ఆదాయం మరింత పెంచితే తప్ప డిమాండ్ ఊపందుకునే అవకాశం లేదని భావిస్తోంది.

నోటిఫికేషన్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే వివిధ రంగాల ప్రతినిధులతో చర్చలు ప్రారంభించారు. ఇప్పుడు ఎక్సైజ్, దిగుమతి సుంకాలు, వ్యక్తిగత, కార్పొరేట్ ఆదాయ పన్ను రేట్లలో చేయాల్సిన మార్పులపై పరిశ్రమ వర్గాల అభిప్రాయాలు తెలపాలని ఏకంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. పరిశ్రమ, వాణిజ్యవర్గాల అభిప్రాయాలు, సూచనల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం బహుశా ఇదే మొదటిసారి అంటున్నారు.

రాబడి తగ్గినా...
ప్రభుత్వ ఆదాయ మార్గాలను కొంత వదులుకున్నప్పటికీ జీడీపీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ సర్కార్ ముందుకెళ్తోందని చెబుతున్నారు. జీఎస్టీ అమలుతో ప్రభుత్వ ఖజానాకు రాబడి తగ్గింది. అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్న స్తబ్ధతను పారద్రోలేందుకు ఇటీవల కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించింది. ఇటీవల ఏర్పాటైన కొత్త ఉత్పాదక రంగ సంస్థలకు 15% కార్పొరేట్ ట్యాక్స్ ప్రకటించింది. దీంతో ప్రభుత్వానికి రూ.1.45 లక్షల కోట్ల నష్టం. ఇప్పుడు ఐటీ, ఎక్సైజ్, కస్టమ్ సుంకాల తగ్గింపుకు కూడా సిద్ధమవుతోంది.
More From GoodReturns

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications