న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థికమందగమనం నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశ పెడుతున్న బడ్జెట్‌లో కీలక ప్రకటనలు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. బడ్జెట్లో ఉద్యోగులకు పలు వరాలను ప్రకటించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఇందులో భాగంగా రూ.7 లక్షల వరకు ఆదాయపు పన్ను పరిమితిని 5 శాతానికే ప్రతిపాదించేందుకు ఆర్థికమంత్రి నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం సాగుతోంది.

ఆదాయపు పన్ను సడలింపుపై పరిశీలన
2024-25 ఆర్థిక సంవత్సరానికి భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిర్మించాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించింది. మందగమనం నేపథ్యంలో ప్రజల కొనుగోలు శక్తిని పెంచే ప్రయత్నాల్లో భాగంగా ఆదాయపు పన్ను ఊరట కూడా ఇస్తే బాగుంటుందనేదే వాదన ఉంది. వ్యక్తిగత ఆదాయపు పన్ను సడలింపుపై ప్రభుత్వం సలహాలను పరిశీలిస్తున్నట్లు ఇటీవల ఆర్థికమంత్రి చెప్పారు.

గత రెండేళ్లలో..
మోడీ ప్రభుత్వం గత రెండేళ్లలో ఆదాయపు పన్ను ఊరటలు ఇచ్చింది. 2018లో స్టాండర్డ్ డిడక్షన్ (రూ.40,000) తిరిగి ప్రవేశ పెట్టింది. 2019లో ఈ పరిమితిని రూ.50,000కు పెంచింది. 2019 బడ్జెట్‌లో రూ.5 లక్షల ఆదాయం వరకు పన్నురహితంగా ఉండేందుకు మార్గం సుగమం చేసింది. రెండో ఇంటిపై వెసులుబాటు కల్పించింది. ప్రస్తుత మందగమనం నేపథ్యంలో ఈసారి బడ్జెట్‌లో మరింత ఊరట ఉంటుందని భావిస్తున్నారు. కొత్త స్లాబ్స్ తీసుకు వస్తారని లేదా రూ.7 లక్షల వరకు ఆదాయంపై ఊరట ఉంటుందని భావిస్తున్నారు.

రూ.7 లక్షల వరకు 5 శాతం
ప్రస్తుతం రూ.2.5 లక్షల ఆదాయం కలిగిన వారికి ఎలాంటి ఆదాయపు పన్ను లేదు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 5 శాతం ఉంది. దీనిని రూ.7 లక్షలకు చేస్తారని అంచనా. అంటే రూ.7 లక్షల ఆదాయం వరకు 5 శాతం స్లాబ్‌లోకి వస్తుంది. బడ్జెట్‌లో ఈ ఊరట కలిగిస్తే ఎంతోమంది వేతనజీవులకు ఊరట.

స్లాబ్స్ సవరణ
చాలా ఏళ్ళుగా స్లాబ్స్‌లలో సవరణ లేదు. పన్ను పరిమితులను కూడా పెంచలేదు. రిబెట్లు, మినహాయింపులు మాత్రమే ఇచ్చారు. ఈసారి రిబేట్ లాంటి ప్రత్యామ్నాయాలను కాకుండా నేరుగా పన్ను స్లాబ్స్‌లలో మార్పులు చేస్తే బాగుంటుందనేది ఆర్థిక నిపుణుల సూచన. పన్నులను 5, 10, 20, 30, 35 శాతం స్లాబ్స్‌గా తీసుకు రావాల్సి ఉందని సూచిస్తున్నారు. ప్రస్తుతం 5 శాతం, 20 శాతం, 30 శాతం స్లాబ్స్ ఉన్నాయి. ఆదాయాన్ని ఐదు స్లాబ్స్‌గా విభజిస్తే చాలామందికి ప్రయోజనంగా ఉంటుందని అంటున్నారు.

మిగులు..
రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం కలిగిన వారికి ప్రస్తుతం 20 శాతం ఉండగా, రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం కలిగిన వారికి 10 శాతం పన్ను ఉండవచ్చునని అంచనా. రూ.10 లక్షల నుంచి ఆ పైన ఆర్జించే వారికి కూడా స్లాబుల్లో మార్పులు ఉండాలని భావిస్తున్నారు. రూ.10 లక్షల లోపు ఆదాయం ఆర్జించే వారికి ప్రతి సంవత్సరం కనీసం రూ.60,000 వరకు పన్ను తగ్గుతుంది. రూ.15 లక్షల ఆదాయం ఉంటే రూ.1.10 లక్షలు, రూ.20 లక్షల ఆదాయం ఉంటే రూ.1.60 లక్షల పన్ను మిగులుతుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications