చైనా దుర్మార్గంగా భారత భూభాగంలోకి రావడంతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనా వైపు కూడా భారీ నష్టమే వాటిల్లింది. డ్రాగన్ తీరుపై భారత్‌లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. దీంతో భారతీయులు, వివిధ ఆర్గనైజేషన్స్ చైనా వస్తువులను బహిష్కరిద్దాం అంటూ ఉద్యమాన్ని ప్రారంభించారు. భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తత, బాయ్‌కాట్ చైనా ప్రోడక్ట్స్ సెగ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పోకు తగిలింది.

ఆవిష్కరణ లైవ్ షో రద్దు
బుధవారం జరగాల్సిన ఆన్‌లైన్ లైవ్ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఒప్పో రద్దు చేసుకుంది. ఫైండ్ ఎక్స్2 సిరీస్‌లో రెండు ప్రీమియం స్మార్ట్ ఫోన్స్‌ను దేశీయ మార్కెట్‌లో లైవ్ ఆన్‌లైన్ ద్వారా పరిచయం చేయాలని భావించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల మధ్య ఇది శ్రేయస్కరం కాదని వాయిదా వేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరణకు సంబంధించిన 20 నిమిషాల వీడియోను ముందుగానే చిత్రీకరించి విడుదల చేసింది. కరోనా వైరస్ కట్టడికి భారత్‌లో తాము చేస్తున్న కృషిని కూడా ఒప్పో ఈ సందర్భంగా తెలిపింది.

అందుకే వాయిదా
తొలుత బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు దీనిని లాంచ్ చేయాలని భావించింది. కానీ ఆ తర్వాత వాయిదా వేసుకుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో, బయట పెద్ద ఎత్తున చైనా ఉత్పత్తులను నిషేదిద్దామనే ఉద్యమం పుంజుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో లాంచింగ్ చేసి, అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది. మొన్నటి సరిహద్దు ఘర్షణ వాతావరణానికి ముందే బాయ్ కాట్ చైనా ఉద్యమం ఊపందుకుంది. కరోనా నేపథ్యంలో చైనా వస్తువుల వినియోగాన్ని సాధ్యమైనంతగా తగ్గించాలని భారతీయులు పిలుపునిస్తున్నారు.

చైనా మార్కెట్ వాటానే 76 శాతం
కాగా, ఒప్పో లైవ్ షో ద్వారా లాంచ్ చేయాలనుకున్న ఈ 5G ఫైండ్ ఎక్స్ 2 హ్యాండ్ సెట్ ఖరీదు ఇండియాలో రూ.64,990. ప్రస్తుతం దేశంలోని టాప్ 5 స్మార్ట్ ఫోన్లలో షియోమీ, వివో, రియల్‌మి, ఒప్పో చైనా ఉత్పత్తులు కావడం గమనార్హం. ఈ చైనా ఉత్పత్తుల స్మార్ట్ ఫోన్ల మార్కెట్ వాటా 2020 మార్చి నాటికి 76 శాతం వరకు ఉంటుంది. సౌత్ కొరియాకు చెందిన శాంసంగ్ 15.6 శాతంతో మూడో స్థానంలో ఉంది. టాప్ 5లో నాన్-చైనీస్ సంస్థ శాంసంగ్ ఒక్కటే ఉంది.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications