For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాష్ట్రాల ఖర్చు-ఆదాయాలపై కరోనా వైరస్ భారీ దెబ్బ

|

కరోనాపై పోరు నిమిత్తం ఖర్చు కోసం, లాక్ డౌన్ నేపథ్యంలో అంతటా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో రాష్ట్రాల SDL(స్టేట్ డెవలప్‌మెంట్ లోన్స్) రూ.1.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. మార్చి ఇరవై ఐదో తేదీ నుండి లాక్ డౌన్‌ను పలుమార్లు పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వాల ట్యాక్స్ కలెక్షన్స్ పడిపోయాయి. అలాగే కేంద్రం ఇచ్చిన వాటాతో పాటు కరోనా కోసం పెద్ద మొత్తంలో ఖర్చులు పెట్టవలసి వచ్చింది. దీంతో ఖర్చులు, ఆదాయం మధ్య అంతరం పెరిగింది.

59 యాప్స్ నిషేధంపై WTOకు వెళ్తే... ఈ కారణాలతో చైనా అడ్డంగా బుక్కైనట్లే!59 యాప్స్ నిషేధంపై WTOకు వెళ్తే... ఈ కారణాలతో చైనా అడ్డంగా బుక్కైనట్లే!

దీంతో మొదటి క్వార్టర్‌లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఎస్డీఎల్ భారీగా పెరిగి రూ.0.8 ట్రిలియన్ (2019-20 ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్) నుండి రూ.1.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఏడాది ప్రాతిపదికన 31.5 శాతం పెరుగుదల. రుణాల పెరుగుదల రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయానికి భారీ షాక్ అని చెప్పవచ్చు. లాక్ డౌన్ కాలంలో నిత్యావసర, అత్యవసర వస్తువులు మాత్రమే కొనుగోలు చేశారు. దీంతో అవసరం లేని వస్తువుల వినియోగం తగ్గాయి.

Borrowings by states double to Rs 1.7 trillion: Icra

ఎస్డీఎల్ లోన్స్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో రూ.1.4 ట్రిలియన్‌కు చేరుకుంటాయని తొలుత అంచనా వేసింది. జూన్ 8వ తేదీ నుండి వరుసగా లాక్ డౌన్ ఎత్తివేసినప్పటికీ కరోనా వ్యాప్తి నివారణకు కొన్నిచోట్ల అవే నిబంధనలు కొనసాగుతున్నాయి. దీంతో కొన్ని రాష్ట్రాలలో జూన్ నెలలోను ఇదే పరిస్థితి ఉండవచ్చునని భావిస్తోంది.

రాష్ట్రాల రుణాల విషయానికి వస్తే తమిళనాడు రూ. 28,000 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత మహారాష్ట్ర రూ.25,500 కోట్లు, రాజస్థాన్ రూ.16,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ.15,000 కోట్లు, తెలంగాణ రూ.12,500 కోట్లు, కేరళ రూ.12,400 కోట్లు, బెంగాల్ రూ.10,000 కోట్లు, హర్యానా రూ.9,000 కోట్లు, గుజరాత్ రూ.8,600 కోట్లు, కర్నాటక రూ.7,000 కోట్లుగా ఉంది. ఈ రాష్ట్రాల వాటానే 86.1 శాతంగా ఉంది. తెలంగాణ తొమ్మిది నెలల రుణ పరిమితిని కేవలం కరోనా సమయంలనే దాటిపోయింది.

English summary

రాష్ట్రాల ఖర్చు-ఆదాయాలపై కరోనా వైరస్ భారీ దెబ్బ | Borrowings by states double to Rs 1.7 trillion: Icra

The states' combined market borrowings as state development loans have doubled to Rs 1.7 trillion during the first quarter of current fiscal, on account of expenditure to fight Covid-19 and lower tax realisation due to multiple lockdown extensions, Icra said in a report.
Story first published: Saturday, July 4, 2020, 15:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X