సరిహద్దు ప్రాంతాల్లో ఓ వైపు కవ్విస్తూనే మరోవైపు భారత్‌లో పెట్టుబడులు పెడుతోంది చైనా! గాల్వాన్ లోయలో బారత సైనికులపై దాడులకు దిగిన డ్రాగన్ కంట్రీ నుండి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. మహారాష్ట్రలో రూ.5వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. నాథులా పాస్‌లో భారత సైన్యంతో ఘర్షణకు కొద్ది సమయం ముందు మహారాష్ట్ర ప్రభుత్వంతో చైనాకు చెందిన మూడు కంపెనీలు ఈ పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నాయి.

చైనా మూడు కంపెనీలతో మహారాష్ట్ర ఒప్పందం
మాగ్నెటిక్ మహారాష్ట్ర 2.0 పేరుతో మహారాష్ట్ర ప్రభుత్వం పలు దేశాలకు చెందిన కంపెనీలతో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి అవగాహన ఒప్పందాలు చేసుకుంటోంది. మొత్తం రూ.16,000 కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలపై 12 దేశాలకు చెందిన కంపెనీలతో మహారాష్ట్ర ప్రభుత్వం సంతకాలు చేసింది. ఇందులో చైనాకు చెందిన మూడు కంపెనీలు ఉన్నాయి. గాల్వాన్ లోయలో భారత సైనికులపై దాడులకు పాల్పడడానికి ముందు ఈ ఒప్పందాలు జరిగినట్లు చెబుతున్నారు. చైనాకు చెందిన హెంగ్లీ ఇంజినీరింగ్, పీఎంఐ ఎలక్ట్రో మొబిలిటీ సొల్యూషన్స్ జెవి విత్ ఫోటాన్, గ్రేట్ వాల్ మోటార్స్ కంపెనీలు పుణె జిల్లాలోని తలేగావ్‌లో పెట్టుబడులు పెట్టనున్నాయి.

ఎంత పెట్టుబడులు పెట్టనున్నాయంటే
హెంగ్లీ ఇంజినీరింగ్ రూ.250 కోట్లు, ఆటో రంగంలో పీఎంఐ రూ.1,000 కోట్లు, గ్రేట్ వాల్ మోటార్స్ కంపెనీ రూ.3,770 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. మహారాష్ట్రతో అవగాహన ఒప్పందాలు చేసుకున్న ఇతర కంపెనీల్లో అమెరికా, సింగపూర్, సౌత్ కొరియా దేశాలకు చెందిన ఆటోమొబైల్, లాజిస్టిక్స్, బ్యాంకింగ్, ఇంజినీరింగ్, మొబైల్ రంగ కంపెనీలు ఉన్నాయి.

HDFCలో పెట్టుబడులు
గత కొన్నేళ్లుగా చైనా కంపెనీలు ఇండియాలో పెట్టుబడులు పెంచుతున్నాయి. మార్చి 31, 2020తో ముగిసిన త్రైమాసికానికి HDFCలో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా 1.01 శాతం వాటాను కొనుగోలు చేశాయి. చైనాతో పాటు హాంగ్‌కాంగ్, తైవాన్ నుండి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయి. ఈ మూడు దేశాల నుండి దాదాపు 5.4 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి.

చైనా నుండి పెరుగుతున్న పెట్టుబడులు
ఎన్ఎస్ఈఇన్ఫోబేస్ డాట్ కామ్ డేటా ప్రకారం 2019 డిసెంబర్ నాటికి చైనా నుండి వచ్చిన పెట్టుబడులు మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రూ.774 కోట్లుగా ఉంది. మార్చి 2020 నాటికి ఈ పెట్టుబడులు రూ.3,257 కోట్లకు పెరిగాయి. విదేశీ పోర్ట్‌ఫోలియోల (FPI) ద్వారా ఇండియా లిస్టెడ్ కంపెనీల్లో చైనా పెట్టుబడులు గత అయిదేళ్లుగా పెరుగుతున్నాయి. లిస్టెడ్ ఇండియన్ కంపెనీల్లో డిసెంబర్ 2015 నాటికి రూ.136 కోట్లు ఉండగా, మార్చి 2020 నాటికి రూ.3,257 కోట్లకు పెరిగాయి. మరిన్ని పెట్టుబడులు పెరిగే అవకాశముంది. ఇప్పటి వరకు అథిపెద్ద పెట్టుబడి HDFC రూ.2,857 కోట్లు. అసలు ఈ పెట్టుబడులు రూ.12వేల కోట్లకు పైగా ఉండవచ్చునని కూడా అంచనా.

ఐదేళ్లలో ఎఫ్‌పీఐ ద్వారా..
ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో (మార్కెట్ వ్యాల్యూ ప్రకారం) ఎఫ్‌పీఐల ద్వారా వచ్చిన చైనా పెట్టుబడులు 2015 డిసెంబర్‌లో రూ.136.78 కోట్లు, 2016 డిసెంబర్‌లో 52.89 కోట్లు, 2017 డిసెంబర్‌లో రూ.696.75 కోట్లు, 2018 డిసెంబర్‌లో రూ.560.97 కోట్లు, 2019 డిసెంబర్‌లో 774.12 కోట్లు, మార్చి 2020లో రూ.3,257.67 కోట్లు ఉన్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications