For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

35,000 డాలర్ల దిగువకు బిట్ కాయిన్ వ్యాల్యూ, టాప్ 10 క్రిప్టో వ్యాల్యూ

|

ఎనర్జీ యూసేజ్ ఆందోళనల నేపథ్యంలో చైనా సియాచిన్ ప్రావిన్స్ అధికారులు బిట్ కాయిన్ మైనింగ్ పైన ఉక్కుపాదం మోపారు. క్రిప్టోకు వ్యతిరేకంగా ఆందోళనలతో మైనింగ్ నిలిపివేత ప్రభావం బిట్ కాయిన్, ఇతర క్రిప్టోలపై పడింది. నేడు బిట్ కాయిన్ 1.17 శాతం క్షీణించి 35వేల డాలర్ల దిగువకు పడిపోయింది. ఉదయం సెషన్‌లో 34,998 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. చైనా సియాచిన్ ప్రావిన్స్ సౌత్ వెస్ట్ ప్రావిన్స్ అధికారులు బిట్ కాయిన్ మైనింగ్ నిలిపివేతకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో 90 శాతం చైనా బిట్ కాయిన్ మైనింగ్ నిలిచిపోతుంది.

మైనింగ్

మైనింగ్

అంతకుముందు టర్కీ నిర్ణయం, ఆ తర్వాత కొత్త బిట్ కాయిన్స్‌ను వెలికితీసే క్రిప్టో మైనింగ్ ప్రక్రియను చైనా నిలిపి వేయడం వంటి కారణాలతో బిట్ కాయిన్ వ్యాల్యూ వరుసగా పతనమవుతోంది. ఓ సమయంలో 65వేల డాలర్లకు చేరుకున్న బిట్ కాయిన్ ఇప్పుడు 35 వేల డాలర్ల దిగువన ట్రేడ్ అయింది. ఈ ప్రక్రియకు విద్యుత్ వినియోగం ఎక్కువ అవుతోందన్న కారణంగా క్రిప్టోమైనింగ్ ప్రాజెక్టులను నిలిపివేయాలని తాజా ఆదేశాలు జారీ అయ్యాయి.

అలా కాలుష్యం పెరుగుతుంది

అలా కాలుష్యం పెరుగుతుంది

వివిధ రకాల పజిల్స్‌కు సమాధానాలు వెతకడం ద్వారా కొత్త బిట్ కాయిన్స్‌ను వెలికితీయవచ్చు. దీనిని క్రిప్టో మైనింగ్ అంటారు. పజిల్స్ అత్యంత సంక్లిష్టంగా ఉండటంతో దీనికి భారీగా కంప్యూటర్లను వినియోగించాల్సి వస్తోంది. ఫలితంగా విద్యుత్ వినియోగం పెరుగుతోంది. విద్యుత్ ఉత్పత్తికి శిలాజ ఇంధనాలు ప్రధాన ఆధారం. దీంతో గ్రీస్ హౌస్ వాయువుల విడుదలకు దారి తీసి పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది.

వివిధ బిట్ కాయిన్స్ వ్యాల్యూ

వివిధ బిట్ కాయిన్స్ వ్యాల్యూ

Bitcoin: $34,382.20, 3.52 శాతం క్షీణత

Ethereum: $2,132.41, 2.96 శాతం క్షీణత

Tether: $1.00, 0.04 శాతం జంప్

Binance Coin: $325.80, 2.80 శాతం క్షీణత

Cardano: $1.36, 2.89 శాతం క్షీణత

Dogecoin: $0.2645, 6.86 శాతం క్షీణత

XRP: $0.7224, 3.62 శాతం క్షీణత

USD Coin: $1, 0.07 శాతం జంప్

Polkadot: $22.31, 5.58 శాతం క్షీణత

Uniswap: $19.66, 1.49 శాతం క్షీణత

English summary

35,000 డాలర్ల దిగువకు బిట్ కాయిన్ వ్యాల్యూ, టాప్ 10 క్రిప్టో వ్యాల్యూ | Bitcoin drops below 35,000 dollars as China intensifies crackdown

Bitcoin plunged on Monday amid a nationwide crackdown against cryptocurrency mining in China. The Bitcoin dropped 1.17% to $34,998.68.
Story first published: Monday, June 21, 2021, 16:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X