జీఎస్టీ చెల్లింపుదారులకు ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. జీఎస్టీ 3బీ రిటర్న్స్ దాఖలుకు సంబంధించి ఆలస్య రుసుమును తగ్గించింది. దీంతో జూలై 2017 నుండి జూలై 2020 వరకు సంబంధించిన జీఎస్టీఆర్ 3బీ రిటర్న్స్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ వరకు దాఖలు చేస్తే ఆలస్య రుసుమును గరిష్టంగా రూ.500గా ఉంటుంది. పన్ను చెల్లించనవసరం లేని పక్షంలో లేట్ ఫీ చెల్లించాల్సిన పని లేదని కూడా కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు (CBIC) తెలిపింది.
తగ్గించిన ఆలస్య రుసుము ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు దాఖలు చేసిన జీఎస్టీఆర్ 3బీకి మాత్రమే వర్తిస్తుందని CBIC శుక్రవారం తెలిపింది. కాగా, ఇందుకు సంబంధించి పలు రిప్రజెంటేషన్స్ రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 2020 నుండి ఏప్రిల్ 2020 వరకు ఉపశమనం ఇచ్చింది. మరియు జూలై 2017 నుండి జనవరి 2020 మధ్య రిటర్న్స్ పెండెన్సీపై కూడా ఉపశమనం కల్పించింది.

ప్రభుత్వం కల్పించిన ఈ ఉపశమనం ద్వారా రెండు విధాలుగా ప్రయోజనాలు ఉన్నాయని ట్యాక్స్ టెక్నాలజీ కంపెనీ టీఎంఎస్ఎల్ ఫౌండర్ పార్ట్‌నర్ జిగార్ దోషి అన్నారు. బ్యాక్ లాగ్ రిటర్న్స్ క్లియర్ చేసుకోవడంతో పాటు, పన్ను చెల్లింపుదారులకు కొంత వర్కింగ్ క్యాపిటల్ రిలీఫ్ ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. కరోనా - లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి 25వ తేదీన ప్రారంభమైన లాక్ డౌన్ దాదాపు మూడు నెలలు కొనసాగింది. ఆ తర్వాత క్రమంగా ఆంక్షలు ఎత్తివేస్తూ, ఇప్పుడు ఆన్-లాక్ 2 కొనసాగుతోంది.
More From GoodReturns

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications