బిగ్ రిలీఫ్: దిగొచ్చిన బంగారం ధర.. నేడు తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలిలా!!
కొండెక్కి కూర్చున్న బంగారం ధరలు నేడు కాస్త తగ్గి సామాన్యులకు ఊరట ఇస్తున్నాయి. 2024 సంవత్సరం ప్రారంభమైన తర్వాత మొదటిసారి గోల్డ్ రేటు తగ్గడం బంగారం ప్రియులకు బిగ్ రిలీఫ్ గా చెప్పొచ్చు. గత డిసెంబర్ నెలలో ఊహించని విధంగా బంగారం రేటు పెరిగిన విషయం తెలిసిందే. ఆల్ టైం రికార్డును నమోదు చేసిన బంగారం ధరలు నేడు కాస్త క్షీణించాయి..
నేడు దేశీయంగా బంగారం ధరల విషయానికి వస్తే హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 58,500 రూపాయలుగా ఉంది. నిన్న ఈ ధర 58,750 రూపాయలుగా కొనసాగింది. నిన్నటితో పోలిస్తే ఈరోజు 250 రూపాయలు మేర బంగారం ధర తగ్గింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు 63,820గా ప్రస్తుతం కొనసాగుతుంది. నిన్న ఈ ధర 64,090 రూపాయలుగా కొనసాగింది.

నేడు 270 రూపాయలు తగ్గి కాస్త ఊరట ఇచ్చింది. ఇది ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ విశాఖపట్నం గుంటూరు నెల్లూరు ప్రాంతాలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు 58,500 కాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 63,820 రూపాయలుగా విక్రయించబడుతుంది.
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు 58,650 రూపాయలుగా విక్రయించబడుతుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 63,970 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు 58,500 రూపాయలుగా విక్రయించబడుతుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 63,820 రూపాయలగా విక్రయించబడుతుంది.
ఇక బంగారం ధరల మాదిరిగానే వెండి ధరలు కూడా పతనాన్ని చూస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర 300రూపాయలు తగ్గి 78, 600 మార్కు వద్ద ఉంది. ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర 300రూపాయలు తగ్గి ప్రస్తుతం 80 వేల రూపాయల వద్ద ఉంది.


Click it and Unblock the Notifications