భారత ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ఇబ్బందిలేదని, ఎగుమతుల్లో మంచి పురోగతి సాధిస్తున్నామని, అదేసమయంలో దిగుమతులు తగ్గుముఖం పడుతున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సోమవారం అన్నారు. కరోనా మహమ్మారితో కుదేలైన ఆర్థికవ్యవస్థ తిరిగి కోలుకుంటుందనే సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయన్నారు. ఆయన ఫిక్కీ నిర్వహించిన వర్చువల్ ఎఫ్‌ఎంసీజీ సప్లై చైన్ ఎక్స్‌పోలో మాట్లాడారు.

పెరిగిన ఎగుమతులు
క్రితం నెలలో ఎగుమతులు మంచి వృద్ధిని కనబరిచాయని గోయల్ చెప్పారు. 2019 జూలైలో నమోదైన ఎగుమతుల్లో 91శాతానికి చేరుకున్నట్లు వెల్లడించారు.
దిగుమతులు డెబ్బై శాతం నమోదయ్యాయన్నారు. విదేశాల్లోని అవకాశాలను అందిపుచ్చుకోవడంపై భారత పారిశ్రామికరంగంలో నమ్మకం ఏర్పడిందన్నారు. ఇది మరింత వృద్ధికి సహకరిస్తుందన్నారు. పెట్రోలియం, టెక్స్‌టైల్ రంగాలలో మందగమనం కారణంగా జూన్ వరకు వరుసగా నాలుగు నెలలు ఎగుమతులు తగ్గుముఖం పట్టాయన్నారు.

18 ఏళ్లలో తొలిసారి.. BOP చాలా పటిష్టం
వాణిజ్యంలో మిగులు నమోదయిందని గోయల్ చెప్పారు. జూన్ నెలలో 790 మిలియన్ డాలర్ల ట్రేడ్ సర్‌ప్లస్ నమోదయిందన్నారు. 18 ఏళ్లలో ఇలా మిగులు ఉండటం తొలిసారి అన్నారు. కరోనా మహమ్మారి కారణంగా చమురుకు డిమాండ్ లేకపోవడం, పసిడి దిగుమతులు తగ్గడం, ఇతర ఇండస్ట్రియల్ ఉత్పత్తులు తగ్గడం వంటి వివిధ కారణాలతో దిగుమతులు తగ్గినట్లు చెప్పారు.
తయారీ, పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించేందుకు కేంద్రం చేపడుతున్న చర్యలు ఇందుకు ఎంతగానో దోహదం చేస్తున్నాయన్నారు. చెల్లింపుల సమతౌల్యం (బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్-BOP) ఈ ఏడాది భారత్‌కు చాలా చాలా పటిష్టంగా ఉండే అవకాశముందన్నారు. ఒక నిర్దిష్ట కాలవ్యవధిలో ట్రేడ్ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించి ఓ దేశం ఇతర దేశాలకు చెల్లించాల్సిన మొత్తమే చెల్లింపుల సమతౌల్యత.

ఎగుమతులు పెరిగి... దిగుమతులు తగ్గి..
ఒకవైపు ఎగుమతులు పెరగడం, మరోవైపు దిగుమతులు తగ్గుతుండటం వల్ల మన ఆర్థిక వ్యవస్థకు చెల్లింపుల సమతౌల్యత సానుకూలపరిస్థితి ఏర్పడిందని గోయల్ చెప్పారు. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతున్న సంకేతాలు ఉన్నాయని, ఎగుమతుల్లో స్పష్టమైన రికవరీ కనిపిస్తోందన్నారు. ఎగుమతుల్లో గతంలో కంటే క్షీణత ఉన్నప్పటికీ ఆ రేటు తగ్గుతూ వస్తోందన్నారు. ఏప్రిల్ నెలలో మైనస్ 60.28 శాతం క్షీణిస్తే, మే నెలలో 34.47 శాతం, జూన్ నెలలో 12.41 శాతంగా ఉందన్నారు. జూలైలో అయితే గత ఏడాదితో పోలిస్తే 91 శాతానికి ఎగుమతుల పరిమాణం పెరిగిందన్నారు. దిగుమతులు 70 శాతం నుండి 71 శాతంగా ఉన్నట్లు తెలిపారు.
More From GoodReturns

Gold bonds: బంగారంతో జాక్పాట్.. రూ. 1 లక్ష పెడితే రూ. 4 లక్షలు అయ్యాయి! రేపే ఆ గోల్డ్ బాండ్ల రిడెంప్షన్!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications