మన దేశంలో బంగారం లోహం మాత్రమే కాదు. విశ్వాసానికి ప్రతీక. అందుకే భారతీయ సంప్రదాయంలో తరతరాలుగా కుటుంబాలన్నీ బంగారాన్ని ఆభరణాలు, నాణేలు రూపంలో కూడబెడుతున్నాయి. అయితే బంగారం నిల్వపై ఆదాయపన్ను శాఖ కఠినమైన నిబంధనలు అమలు చేస్తోంది. మీ ఇంట్లో పరిమితికి మించి బంగారం ఉంటే ఆదాయపు పన్ను శాఖ రైడ్ చేస్తుంది. అసలు మీ పసిడి కొనుగోళ్లపై ఆదాయపు పన్ను శాఖ కూడా నిఘా ఉంచుతుందన్న విషయం మీకు తెలుసా?
మీరు నిర్దేశిత పరిమితికి మించిన బంగారం నిల్వ ఉంచి, దాని చట్టబద్ధతకు సంబంధించిన ఆధారాలు చూపలేకపోతే, ఆదాయపు పన్ను నోటీసు లేదా రైడ్‌కు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి, అలాంటి పన్ను దర్యాప్తు సమస్యలను నివారించాలంటే, ఇంట్లో చట్టబద్ధంగా ఎంత బంగారం ఉంచుకోవచ్చో తెలుసుకోవడం చాలా అవసరం.లేకుంటే మీరు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు ఎదుర్కునే అవకాశం ఉంది. ప్రభుత్వ పరిమితికి మించిన బంగారం ఉంచి, దాని మూలాన్ని రుజువు చేయలేకపోతే మీకు నోటీసులు రావొచ్చు..లేదా రైడ్ జరగవచ్చు.

అందువల్ల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ప్రకారం ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? అనే దానిపై కొన్ని రూల్స్ ఉన్నాయి. వివాహిత స్త్రీ తన ఇంట్లో 500 గ్రాముల వరకు బంగారాన్ని ఉంచుకోవడానికి ఈ నిబంధన కింద అనుమతి ఉంది. ఇక వివాహం కాని స్త్రీలు అయితే 250 గ్రాములు Gold వరకు ఉంచుకోవచ్చు. మగవారు అయితే 100 గ్రాములు బంగారం తమ దగ్గర పెట్టుకోవచ్చు. ఈ పరిమితికి మించిన బంగారం ఎవరిదగ్గరైనా ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు చూపాలి. డాక్యుమెంట్స్ ద్వారా ఆదాయపు పన్ను శాఖ వద్ద రుజువు చేసుకోవాలి.
వారసత్వంగా వచ్చిన బంగారానికి పన్ను ఉందా? అంటే లేదనే చెప్పాలి. మీరు పన్ను చెల్లించిన ఆదాయంతో బంగారం కొనుగోలు చేసినా లేదా వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయంతో కొనుగోలు చేసినా లేదా వారసత్వంగా చట్టబద్ధంగా పొందినా అటువంటి బంగారంపై ఎటువంటి పన్ను ఉండదు.ఇక ప్రభుత్వం సూచించిన పరిమితి లోపల ఉన్న బంగారాన్ని అధికారులు రైడ్ సమయంలో స్వాధీనం చేసుకోలేరు.
అయితే బంగారం మీ దగ్గర ఉన్నంత కాలం ఎటువంటి పన్ను ఉండదు.. బంగారం అమ్మితే పన్ను వర్తిస్తుంది. పరిమితికి మించి బంగారం ఉన్నా అది ఆదాయపు పన్ను శాఖ కంట్లో పడనంత వరకు బాగానే ఉంటుంది. పడితే మాత్రం మీకు పన్ను పడుతుంది. Gold అమ్మినప్పుడు పన్ను ఎలా లెక్కిస్తారో చాలామందికి తెలియదు. యూనియన్ బడ్జెట్ 2024 ప్రకారం ఫిజికల్ గోల్డ్ (ఆభరణాలు, నాణేలు)పై షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (STCG) పన్ను కోసం హోల్డింగ్ పీరియడ్‌ను 3 సంవత్సరాల నుండి రెండు సంవత్సరాలకు తగ్గించారు. 2 సంవత్సరాల లోపు మీ దగ్గర ఉన్న Gold అమ్మితే లాభంపై STCG పన్ను ఉంటుంది. ఇక 2 సంవత్సరాల తరువాత అమ్మితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG) కింద పన్ను 12.5 శాతం వరకు ఉంటుంది.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులు సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

బంగారం, వెండి ధరలు తగ్గాయి. తాజా రేట్లు ఇక్కడ చూడండి

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారంపై షాకింగ్ న్యూస్.. 10 దేశాల కేంద్ర బ్యాంకుల నిల్వ కంటే ఎక్కువే..

భగ్గుమన్న బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 8, బుధవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

ఈ ఏడాది బంగారం, వెండి పెరుగుదలపై సంచలన నివేదిక.. ఏకంగా ఆ స్థాయి వరకు వెళుతుందంటున్న నిపుణులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications