ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా రక్కసి ప్రభావం ఆర్ధిక వ్యవస్ధలో భాగస్వాములైన సంస్ధలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్రంగా ఉంది. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ ప్రభావంతో ఇప్పటికే కుదైలేన ఆసియా దేశాల సంస్ధలకు రాయిటర్స్ విశ్లేషణ చేదు కబురు చెప్పింది. ఇప్పటికే లాక్ డౌన్ తో కుదేలైన ఆసియా దేశాల సంస్ధలకు ఈ ఆర్ధిక సంవత్సరం మిగిలిన క్వార్టర్స్ లో తీవ్ర చెల్లింపుల సమస్యను ఎదుర్కోక తప్పదని రాయిటర్స్ అంచనా వేస్తోంది.

రాయిటర్స్ విశ్లేషణ అంచనాలు...
ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న కరోనా మహమ్మరి ప్రభావం భారత్, చైనాతో పాటు ఇతర ఆసియా దేశాల్లోని లక్షలాది సంస్ధలపై తీవ్రంగా పడింది. మార్చితో ముగిసిన క్వార్టర్ పరిస్ధితి గమనిస్తే గత 11 ఏళ్ల కనిష్ట స్ధాయికి ఆయా కంపెనీల నిర్వహణ లాభాలు- వడ్డీ చెల్లింపుల నిష్పత్తి పడిపోయింది. వాస్తవానికి జూన్ 2014 నుంచే సంస్ధల రుణాల చెల్లింపుల భారం పెరుగుతూ వస్తోంది. కరోనా దెబ్బకు ఇది మరింత పెరిగిపోవడంతో కంపెనీలు ఇప్పుడు హై డిఫాల్ట్ రిస్క్ కేటగిరిలోకి వచ్చేశాయి.

ఈ రంగాలకు మరిన్ని కష్టాలు...
ఎనర్జీ, రియల్ ఎస్టేట్, యుటిలిటీ రంగాల్లో ఉన్న సంస్ధలకు ఈ చెల్లింపుల రిస్క్ ఎక్కువగా ఉండబోతోందని తాజా విశ్లేషణలు చెబుతున్నాయి. చెల్లింపుల భారం అత్యధికంగా ఎదుర్కొనే సంస్ధల్లో ఎయిర్ లైన్స్ ముందు వరుసలో ఉన్నాయని రాయిటర్స్ విశ్లేషణ చెబుతోంది. కరోనా ప్రభావంతో ఎయిర్ లైన్స్ రాకపోకలు ప్రారంభమైనా ప్రయాణికులు ఆసక్తి చూపకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

మూడీస్ అంచనాలు ఇవే....
మరో టాప్ రేటింగ్ సంస్ధ మూడీస్ కూడా తన తాజా అంచనాల్లో ఆసియా-ఆఫ్రికా దేశాల్లో ఆర్ధికేతర సంస్ధలు ఇచ్చే అప్పుల బకాయిల రేటు ఈ ఏడాది చివరి నాటికి భారీగా పెరగనుందని తేల్చిచెప్పింది. ఈ ఏడాది మార్చి నాటికి 2.3 శాతంగా ఉన్న వీటి అప్పుల బకాయిల రేటు ఈ ఏడాది చివరి నాటికి 6.4కు చేరుకోనుందని హెచ్చరించింది. వీటిలో కొన్ని సంస్ధలు బకాయిల బారిన పడకుండా ఉండేందుకు రుణాలను, ముఖ్యంగా ఆఫ్ షోర్ రుణాల రీస్ట్రక్చర్ కోసం ప్రయత్నించే అవకాశముందని మూడీస్ తెలిపింది.

కరెన్సీల పతనం ప్రభావం...
ఆసియా దేశాల్లో కరెన్సీల పతనం ప్రభావం రుణ బకాయిల చెల్లింపులపై తీవ్రంగా ఉండబోతోందని తాజా అంచనాలు తేల్చాయి. ప్రధానంగా డాలర్లలో తీసుకున్న రుణాల చెల్లింపులో వీటి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని, దీనికి ప్రత్యామ్నాయాలు కూడా లేవని ఫిచ్ రేటింగ్స్ సంస్ధ తెలిపింది. మెచ్యూరిటీకి సిద్ధంగా ఉన్న డాలర్ బాండ్స్ ఆయా సంస్ధలకు మరింత సమస్యగా మారనున్నట్లు అంచనా వేస్తోంది. ఈ ఏడాది జూన్ నుంచి డిసెంబర్ మధ్య దాదాపు 100 బిలియన్ డాలర్ల విలువ కల డాలర్ బాండ్స్ మెచ్యూర్ అవుతున్నా, వీటి చెల్లింపుల పరిస్ధితి ఏంటో ఎవరూ చెప్పలేకపోతున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications