మనుషులకు ఇక ఉద్యోగాలే ఉండవు.. AIతో అందరూ నిరుద్యోగులవుతారన్న ఆంత్రోపిక్ పరిశోధకుడు..

Anthropic Researcher Warns: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవం కారణంగా భవిష్యత్తులో మానవాళి ఉపాధి అవకాశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ (Anthropic) పరిశోధకుడు టావో లిన్ సంచలన హెచ్చరిక చేశారు.

కేవలం రెండేళ్ల లోపే.. అంటే 2027 చివరి నాటికి (సుమారు 1.3 సంవత్సరాలలో) దాదాపు ప్రతి రంగంలోనూ మానవుల కంటే అత్యంత సమర్థవంతంగా పనిచేయగల 'విస్తృత మానవాతీత ఏఐ' (Broadly Superhuman AI) అందుబాటులోకి వస్తుందని ఆయన అంచనా వేశారు. ప్రముఖ పరిశోధనా సంస్థ 'పాలిసేడ్ రీసెర్చ్' (Palisade Research)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లిన్ ఈ ఆందోళనకర విషయాలను వెల్లడించారు.

Anthropic researcher Tao Lin AI replacing humans AI job loss AI unemployment Permanent unemployment Superhuman AI AI by 2027 Artificial Intelligence future AI automation AI AI AI 2027 AI AI AI

ప్రోగ్రామింగ్, సినిమా నిర్మాణం నుండి రాజకీయ వ్యూహరచన వరకు దాదాపు అన్ని రంగాలలోనూ అత్యుత్తమ మానవ నిపుణుడికి సమానంగా లేదా అంతకంటే మెరుగ్గా పనిచేసే సామర్థ్యం ఏఐకి లభిస్తుందని టావో లిన్ నిర్వచించారు. అయితే, ఈ సాంకేతిక పురోగతి వల్ల పని ప్రపంచంపై పడే ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఏఐ ధాటికి ప్రజలు తమ ప్రస్తుత ఉద్యోగాలను కోల్పోయి, కొద్దికాలం పాటు వేరే ప్రత్యామ్నాయ వృత్తులలోకి మారినప్పటికీ, కొంతకాలానికి ఆ కొత్త రంగాలు కూడా పూర్తిగా ఆటోమేషన్‌కు గురవుతాయని వివరించారు. ఈ ప్రక్రియ రాత్రికి రాత్రే జరగకపోయినా, క్రమంగా భూమిపై ఉన్న దాదాపు మానవులందరూ శాశ్వతంగా ఉపాధికి అనర్హులుగా మారి" జీవనోపాధి కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆధారపడాల్సిన దుస్థితి వస్తుందని, మళ్లీ ఎప్పటికీ ఉద్యోగం దొరుకుతుందనే ఆశ లేకుండా పోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read

ఇంతటి శక్తివంతమైన ఏఐ సామర్థ్యం ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు భారీ ఎత్తున ఉద్యోగాల కోతలు ఎందుకు జరగలేదన్న ప్రశ్నకు లిన్ ఆసక్తికరమైన విశ్లేషణ ఇచ్చారు. దీనికి ప్రధాన అడ్డంకి ఏఐ మేధస్సు కాదని, భౌతిక ప్రపంచపు పరిమితులేనని ఆయన వాదించారు. డిజిటల్, మేధోపరమైన పనులలో సాఫ్ట్‌వేర్ త్వరలోనే మనుషులను అధిగమించినప్పటికీ, భౌతిక శ్రమ చేసే కార్మికులను పూర్తిగా తొలగించాలంటే కంపెనీలు బిలియన్ల కొద్దీ అధునాతన రోబోలను తయారు చేసి క్షేత్రస్థాయిలో మోహరించాల్సి ఉంటుందని, అందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు.

సమాజం ఈ మార్పులకు అనుగుణంగా సిద్ధమయ్యే వేగం కంటే అత్యంత శక్తివంతమైన ఏఐ వ్యవస్థలను నిర్మించే పోటీ ప్రమాదకర స్థాయిలో వేగంగా సాగుతోందని హెచ్చరిస్తూ, ఏఐ కంపెనీలు తమ అభివృద్ధి వేగాన్ని కొంత నెమ్మదింపజేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఉద్యోగాలపై ఏఐ ప్రభావం గురించి ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్న వేళ లిన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆంత్రోపిక్ సంస్థ నిర్వహించిన సొంత పరిశోధనలు ఇప్పటివరకు ఇంతటి తీవ్రమైన పరిస్థితిని చూపించలేదు. 2022 చివరి నుండి ఏఐ ప్రభావం ఉన్న రంగాలలో నిరుద్యోగం విస్తృతంగా పెరిగినట్లు స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ, కొన్ని విభాగాలలో ప్రారంభ స్థాయి (Entry-level) యువ ఉద్యోగుల నియామకాలు మాత్రం మందగించినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

కేవలం ఉపాధి మాత్రమే కాకుండా, మానవులు మరియు యంత్రాల మధ్య దీర్ఘకాలిక అధికార సమతుల్యత (Power Balance) దెబ్బతిని, కీలక నిర్ణయ ప్రక్రియల నుండి మానవాళి పూర్తిగా పక్కకు తప్పుకోవాల్సిన ప్రమాదం పొంచి ఉందని టావో లిన్ హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+