ఉద్యోగాలే కాదు.. ప్రజాస్వామ్యానికీ పెను ముప్పు.. AI భవిష్యత్తుపై సత్య నాదెళ్ల సంచలన వ్యాఖ్యలు..

Satya Nadella Big Warning on AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవం వల్ల కలిగే ముప్పు కేవలం ఉద్యోగాల కోతలకే పరిమితం కాదని, అది ప్రజాస్వామ్య వ్యవస్థల మనుగడను ఎన్నికల ఫలితాలను సైతం తలకిందులు చేయగలదని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సంచలన హెచ్చరిక చేశారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని చేజ్ సెంటర్‌లో జరిగిన 'మైక్రోసాఫ్ట్ ఇగ్నైట్ 2026' (Microsoft Ignite 2026) కీలకోపన్యాసం అనంతరం విలేకరులతో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.

పూర్తిగా ఏఐ, పెట్టుబడి (Capital) ఆధారంగా నడిచే ఆర్థిక వ్యవస్థలో మానవ శ్రమకు స్థానం లేకపోతే, ప్రజాస్వామ్యం నిలబడే పునాదులే కదిలిపోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ కేవలం పెట్టుబడి మాత్రమే ఉండి, శ్రమ లేని పరిస్థితి ఏర్పడితే.. కనీసం ప్రజాస్వామ్యంలోనైనా ఎవరూ ఎన్నికల్లో గెలవలేరు. అది అసలు ఆర్థిక వ్యవస్థే కాదని 'ది వెర్జ్' (The Verge) కథనం ప్రకారం నాదెళ్ల వ్యాఖ్యానించారు.

Satya Nadella Microsoft CEO AI replacing humans AI replacing human workers AI job loss Artificial Intelligence impact on jobs AI and unemployment AI economy AI and democracy Microsoft AI warning Future of jobs AI automation AI technology news Microsoft Ignite 2026 AI AI AI AI AI AI AI

దశాబ్దాలుగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ ఆధిపత్యం చెలాయిస్తున్న రంగంలోకి పోటీ సంస్థ ఆంత్రోపిక్ (Anthropic) తన కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడంపై అడిగిన ప్రశ్నకు నాదెళ్ల స్పందిస్తూ.. కేవలం ఉత్పత్తుల పోటీ కంటే ఒకే ఏఐ కంపెనీ గుత్తాధిపత్యం ఏర్పడటమే అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే ఒక్క సంస్థ అన్నింటినీ సొంతం చేసుకుంటే, ఇక మనందరికీ అంతా ముగిసినట్టే కదా? ఇక్కడున్న విలేకరులు కూడా ఏదో ఒక విధంగా ఆంత్రోపిక్‌కు అనుబంధంగా మారిపోతారని అన్నారు.

Also Read

ఏఐ అనేది టెక్ దిగ్గజాల మధ్య ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కోసం జరిగే పోటీ మాత్రమేనని భావించడం అత్యంత సంకుచిత దృక్పథమని ఆయన తిరస్కరించారు. ఒక శక్తివంతమైన ఏఐ మోడల్‌కు సహజమైన పరిమితులు ఉండవని.. అది ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక సేవల రంగాలను ఆక్రమించడమే కాకుండా చివరికి ప్రభుత్వాన్ని సైతం స్వాధీనం చేసుకోగలదని హెచ్చరించారు.

ఆర్థిక వ్యవస్థను, రాజకీయాలను ఏఐ సమూలంగా మార్చగలదనే విషయంలో తాను ఇప్పుడు పూర్తిగా 'ఏజీఐ-పిల్డ్' (AGI-pilled) అయ్యానని నాదెళ్ల అంగీకరించారు. అయితే ఆంత్రోపిక్ 'క్లాడ్' (Claude) వంటి మోడళ్లకు సొంత చైతన్యం (Consciousness) ఉందన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. ఏఐకి నైతిక హోదా ఆపాదించకూడదని వాదించే మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్ అభిప్రాయంతో ఏకీభవిస్తూనే, దీనిపై ఆరోగ్యకరమైన చర్చ జరగాలన్నారు.

ఈ గుత్తాధిపత్య ప్రమాదాన్ని నివారించేందుకు ప్రతి కంపెనీ తమ ఉద్యోగుల మానవ మూలధనంతో పాటు, స్వంతంగా నియంత్రించుకునే ఏఐ సామర్థ్యమైన "టోకెన్ క్యాపిటల్" (Token Capital)ను నిర్మించుకోవాలని నాదెళ్ల పిలుపునిచ్చారు. కొన్ని ఏఐ మోడళ్లు మాత్రమే మొత్తం ఆర్థిక విలువను కైవసం చేసుకుంటే, ప్రపంచీకరణ కాలంలో అవుట్‌సోర్సింగ్ పారిశ్రామిక వ్యవస్థలను దెబ్బతీసినట్లుగా రాజకీయ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర తిరుగుబాటు వస్తుందని ఆయన హెచ్చరించారు.

మైక్రోసాఫ్ట్ ఇగ్నైట్ 2026లో ప్రకటించిన కొత్త సాధనాలు కూడా వ్యాపార సంస్థలు తక్కువ ఖర్చుతో తమ సొంత మోడళ్లను నడుపుకునేలా, డేటాపై నియంత్రణ కలిగి ఉండేలా రూపొందించబడ్డాయి. మైక్రోసాఫ్ట్ పెట్టుబడిదారుగా ఉన్న ఆంత్రోపిక్ గురువారం నాడు నాస్‌డాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ANT టిక్కర్‌తో అరంగేట్రం చేస్తున్న తరుణంలో నాదెళ్ల చేసిన ఈ వ్యాఖ్యలు టెక్ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+