రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ మూడు చైనా బ్యాంకులకు ఆరు వారాల్లోగా 100 మిలియన్ డాలర్లు చెల్లించాలని బ్రిటన్ కోర్టు షాకిచ్చింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.700 కోట్లు. రుణ ఒప్పందం కింద అనిల్ నుంచి 680 మిలియన్ డాలర్లు రికవరీ చేయాలని కోరుతూ చైనా బ్యాంకులు వేసిన పిటిషన్‌ను కోర్టు విచారించి, తీర్పు చెప్పింది.

అనిల్ అంబానీ 100 మిలియన్ డాలర్లు చెల్లించాలి
రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీకి సంబంధించి చైనా ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలకు గాను వ్యక్తిగత హామీ ఇచ్చిన ప్రమోటర్ అనిల్ అంబానీకి బ్రిటన్ హైకోర్టులో శుక్రవారం చుక్కెదురైంది. ఆరు వారాల్లో 100 మిలియన్ డాలర్లు కోర్టులో డిపాజిట్ చేయాలని జడ్జి ఆదేశించారు. ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంకు ఆఫ్ చైనా ముంబై శాఖ, చైనా డెవలప్‌మెంట్ బ్యాంకు, ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనా... అనిల్‌పై దాఖలు చేసిన పిటిషన్లో కండిషనల్ ఆర్డర్లో భాగంగా ఆదేశాలు జారీ చేశారు.

అనిల్ ఆస్తులు సున్నా..
అంతకుముందు, అంబానీ తరఫున ఆయన లాయర్లు వాదించారు. అంబానీ నికర వ్యాల్యూ సున్నాగా మారిందని కోర్టుకు తెలిపారు. ఆయన కుటుంబం కూడా ఆదుకునే పరిస్థితి లేదని చెప్పారు. ఈ వాదనలను న్యాయమూర్తి డేవిడ్ వాక్స్‌మన్ తిరస్కరించారు. ఈ తీర్పును పైకోర్టులో సవాల్ చేస్తామని అనిల్ గ్రూప్ తెలిపింది.

2012 రుణంపై..
ఫిబ్రవరి 2012లో సుమారు 925మిలియన్ డాలర్ల బాకీ రీఫైనాన్సింగ్ లోన్‌పై వ్యక్తిగత హామీని అనిల్ ఉల్లంఘించినట్లు ఆరోపిస్తూ చైనా బ్యాంకులు UK హైకోర్టును సమ్మరీ జడ్జిమెంట్ కోరింది. ఈ రుణానికి సంబంధించి వ్యక్తిగత పూచీకత్తును పాటించలేదనే దానిపై దావా దాఖలైంది. అలాంటి గ్యారెంటీ ఇవ్వలేదని అనిల్ ఖండించారు. ఈ కేసులో అనిల్ అంబానీకి బ్రిటన్ కోర్టు షాకిచ్చింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications