తాను మూడు చైనా బ్యాంకులకు రిలయన్స్ కమ్యూనికేషన్(RCom) తీసుకున్న రుణాలకు గాను వ్యక్తిగతంగా హామీ ఇవ్వలేదని అనిల్ అంబానీ స్పష్టం చేశారు. చైనా బ్యాంకులకు ఆర్.కామ్ 717 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.5,400 కోట్లు చెల్లించాల్సిందిగా బ్రిటన్ కోర్టు.. అనిల్ అంబానీని ఆదేశించింది. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుండి తీసుకున్న రుణాలకు వ్యక్తిగత హామీని ఇచ్చినట్లు సంకేతాలు ఇచ్చారు.

అవి కార్పోరేట్ రుణాలు
ఎస్బీఐ, చైనా బ్యాంకులు తనపై దాఖలు చేసిన వ్యాజ్యం వ్యక్తిగత రుణాలకు సంబంధించింది కాదని, అది కార్పోరేట్ రుణాలకు సంబంధించినదని అనిల్ అంబానీ చెప్పారు. ఇటీవల రూ.1200 కోట్ల రికవరీ కోసం ఎస్బీఐ... ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. ఈ రెండు కేసులు అంటే ఎస్బీఐ, చైనా బ్యాంకుల అంశంలో గ్రూప్ కంపెనీ మాత్రమే రుణాలు తీసుకుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన రిలయన్స్ ఇన్ఫ్రా ఏజీఎంలో ఆయన మాట్లాడారు.

వాదించడానికి వీల్లేకుండా పోయింది
ఎనిమిదేళ్ల క్రితం రిలయన్స్ కమ్యూనికేషన్స్ తీసుకున్న కార్పోరేట్ రుణానికి నాన్ బైండింగ్ లేఖలో మాత్రమే పరిమితమైన పవర్ ఆఫ్ అటార్నీ సంతకం చేసినట్లు చెప్పారు. చైనా బ్యాంకులు చెబుతున్నట్లు వ్యక్తిగత హామీ మీద ఎలాంటి సంతకం చేయలేదన్నారు. చైనా బ్యాంకుల వాదనపై న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నట్లు కూడా రిలయన్స్ ఇన్ఫ్రా తెలిపింది. బ్రిటన్ కోర్టులో 100 మిలియన్ డాలర్ల వ్యక్తిగత డిపాజిట్ చేయలేకపోవడంతో వాదించేందుకు వీల్లేకుండా పోయిందని తెలిపింది.

భారీ రుణాలు
ఆర్.కామ్‌కు ఇచ్చిన 925 మిలియన్ డాలర్ల రుణాన్ని రికవరీ చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ ఆఫ్ చైనా, చైనా డెవలప్‌మెంట్ బ్యాంకు, ఎగ్జిమ్ బ్యాంకు ఆఫ్ చైనాలు అనిల్ అంబానీపై బ్రిటన్ కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. మే 22న మూడు బ్యాంకులకు 21 రోజుల్లో 717 మిలియన్ డాలర్లు చెల్లించాలని అనిల్ అంబానీకి కోర్టు ఆదేశించింది. అయితే తన ఆస్తులు సున్నా అని అనిల్ అంబానీ కోర్టుకు తెలిపారు. అయితే అతని వాదనతో కోర్టు ఏకీభవించలేదు. అయితే మొత్తానికి తాను వ్యక్తిగత గ్యారెంటీ ఇవ్వలేదని అనిల్ అంబానీ చెబుతున్నారు. ఆర్.కామ్. రూ.46,000 కోట్ల అప్పుల్లో ఉంది.

రుణరహిత సంస్థగా అనిల్ అంబానీ కంపెనీ
ఇదిలా ఉండగా రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రా కంపెనీల్లో ప్రమోటర్ల వాటా పెంచుకోవాలని నిర్ణయించినట్లు అనిల్ అంబానీ తెలిపారు. గత వారం ప్రిఫరెన్షియల్ కేటాయింపు ద్వారా 10 శాతం వరకు వాటా పెంచుకునేందుకు సెబి అనుమతించింది. గత మార్చి నాటికి రిలయన్స్ ఇన్ఫ్రాలో 14.7 శాతం, రిలయన్స్ పవర్‌లో 19.29 శాతం వాటా చొప్పున ప్రమోటర్లకు వాటాలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఇన్ఫ్రా రుణరహిత సంస్థగా మారుతుందని తెలిపారు. ఈ కంపెనీకి రూ.6,000 కోట్ల రుణాలు ఉన్నాయి. ఆస్తుల విక్రయం ద్వారా రుణభారం తగ్గించుకోనున్నారు. అనిల్ అన్న ముఖేష్ అంబానీ జియో ప్లాట్‌ఫాంలో వాటాల విక్రయం ద్వారా రుణరహిత సంస్థగా నిలబెట్టిన విషయం తెలిసిందే.
More From GoodReturns

మెంతికూరపై హాట్ డిబేట్..భారత్ వర్సెస్ అమెరికా రేట్లతో పోల్చిన మహిళ..నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications