అమెజాన్‌లో లేఅఫ్స్ మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి. ఈసారి కారణం "2027 నాటికి అమెరికాలో సుమారు 6 లక్షల ఉద్యోగాలను రోబోట్లతో భర్తీ చేయాలని అమెజాన్ ప్లాన్ చేస్తోందట. ఇలా చేస్తే కంపెనీకి 2025 నుంచి 2027 మధ్య $12.6 బిలియన్ (సుమారు రూ. 1.05 లక్షల కోట్లు) వరకు కార్మిక వ్యయాలు తగ్గుతాయని లెక్క. ఇప్పుడు అమెరికాలో అమెజాన్‌కు 10 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. కానీ వచ్చే రెండేళ్లలోనే దాదాపు 1.6 లక్షల మంది వేర్‌హౌస్ ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. కంపెనీ మాత్రం "మాస్ లేఅఫ్స్ లేవు" అంటూనే, ఆటోమేషన్‌లో భారీ పెట్టుబడులు పెడుతున్నాం అని అంగీకరించింది.
అమెజాన్ తన వేర్‌హౌస్ మరియు లాజిస్టిక్స్ కార్యకలాపాల్లో 75% వరకు ఆటోమేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే 2027 నాటికి సుమారు 6 లక్షల మంది ఉద్యోగాలు రోబోట్లతో భర్తీ అవ్వొచ్చు లేదా కొత్త రిక్రూట్‌మెంట్ జరగకపోవచ్చు. ఇది అమెరికా కార్పొరేట్ చరిత్రలోనే పెద్ద ఉద్యోగ మార్పుగా నిలిచిపోవాలి. ఇంతవరకు మనుషులు ప్యాకింగ్, సార్టింగ్, షిప్పింగ్ చేసే గోడౌన్లు ఇక రోబోట్లతో నిండిపోవచ్చు.

ఎందుకు ఈ భారీ మార్పు?
ప్రపంచవ్యాప్తంగా ఈ-కామర్స్ పోటీ పెరుగుతోంది. దాంతో అమెజాన్ ఖర్చులను తగ్గించి, వేగం పెంచే మార్గాలను వెతుకుతోంది. మానవ శ్రామిక శక్తి కంటే AI ఆధారిత రోబోలు ఎక్కువ వేగంగా, ఖచ్చితంగా, తక్కువ ఖర్చుతో పనిచేస్తాయని కంపెనీ చెబుతోంది. ఆర్డర్లను త్వరగా ప్రాసెస్ చేయడం, పొరపాట్లు తగ్గించడం, వేగంగా డెలివరీ చేయడం ఇవన్నీ రోబోట్లు సులభంగా చేస్తాయట. ఈ ఆటోమేషన్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నవి Proteus మరియు Sequoia అనే రోబోలు. ఇవి కెమెరాలు, సెన్సర్లు, AI ఆల్గోరిథమ్స్‌తో అమర్చబడి ఉంటాయి. వేర్‌హౌస్‌లో స్వతంత్రంగా తిరుగుతూ ప్యాకేజీలను ఎత్తడం, తరలించడం, సార్టింగ్ చేయడం వంటి పనులు రోజుకు 24 గంటలు చేయగలవు. ఇలా మానవ శ్రమ తగ్గడం వల్ల కంపెనీకి భారీగా ఖర్చు ఆదా అవుతోంది.
డెలివరీలకూ రోబో ముఠా వస్తుందా?
అమెజాన్ ఇప్పుడు వేర్‌హౌస్‌లకే కాదు, డెలివరీ రంగంలో కూడా AIని తెస్తోంది. సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు, డ్రోన్ షిప్పింగ్ ప్రాజెక్టులు, AI ఆధారిత లాజిస్టిక్స్ సిస్టమ్స్ ఇవన్నీ ట్రయల్‌లో ఉన్నాయట. ఇవి సక్సెస్ అయితే కంపెనీ సరఫరా వ్యవస్థ సూపర్ ఎఫిషియెంట్ అవుతుంది, కానీ అదే సమయంలో డెలివరీ ఉద్యోగాలు వేల సంఖ్యలో మాయం కావొచ్చు. అమెరికాలోని అనేక అమెజాన్ గోడౌన్లులో ఉద్యోగులు చెబుతున్నది ఒకటే రోజురోజుకీ రోబోలు పెరుగుతున్నారు, మనుషులు తగ్గిపోతున్నారు. కొంతమంది ఉద్యోగులు "రోబోలు వేగంగా, చవకగా, తప్పులు చేయకుండా పనిచేస్తున్నాయి... మేము క్రమంగా అవుట్ అవుతున్నామేమో" అని భయపడుతున్నారు.
నిపుణులు చెబుతున్నట్లుగా, అమెజాన్ ఈ ఆటోమేషన్ మార్పుతో అమెరికా ఉద్యోగ మార్కెట్ మొత్తం మారిపోవచ్చు. అమెజాన్ మార్గాన్ని అనుసరిస్తూ వాల్మార్ట్, టార్గెట్ వంటి కంపెనీలు కూడా రోబోటిక్ సిస్టమ్స్ వైపు వెళ్లవచ్చు. దాంతో రాబోయే 10 ఏళ్లలో మిలియన్ల లో మిడ్-స్కిల్ ఉద్యోగాలు ఆటోమేషన్ చేతిలోకి వెళ్లే అవకాశం ఉంది. అమెజాన్ ఈ ప్రణాళికను పూర్తి స్థాయిలో అమలు చేస్తే, ఇది అమెరికా ఉద్యోగ మార్కెట్‌లో టర్నింగ్ పాయింట్ అవుతుంది.
అమెజాన్ అమెరికాలో అతిపెద్ద ప్రైవేట్ ఎంప్లాయర్ కాబట్టి దాని మార్పు మిగతా కంపెనీలపైనా ప్రభావం చూపుతుంది. అలానే ఈ ఆటోమేషన్ ప్రణాళికను భారత్‌లో కూడా పూర్తిగా అమలు చేస్తే, ఇది భారతీయ ఉద్యోగ మార్కెట్‌లో కూడా ఒక పెద్ద మలుపు అవుతుంది. ఇప్పటికే అమెజాన్ భారత్‌లో లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి ఇస్తోంది. ముఖ్యంగా గోడౌన్లు, డెలివరీ స్టేషన్లు, లాజిస్టిక్స్, కస్టమర్ సపోర్ట్ వంటి విభాగాల్లో. ఈ రంగాల్లో ఆటోమేషన్ వేగంగా పెరిగితే, తక్కువ నైపుణ్యం అవసరమైన అనేక ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంది.
భారతదేశం వంటి దేశంలో ఈ ప్రభావం మరింతగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఎక్కువమంది ఉద్యోగులు రోజువారీ ఆధారంగా పనిచేస్తారు. వారిని రోబోట్లు లేదా AI సిస్టమ్స్‌తో భర్తీ చేస్తే, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోవచ్చు. అయితే మరోవైపు, అమెజాన్ యొక్క ఆటోమేషన్ పెట్టుబడులు కొత్త టెక్నికల్ ఉద్యోగాలను కూడా సృష్టించే అవకాశం ఉంది. రోబోటిక్స్ మెయింటెనెన్స్, ప్రోగ్రామింగ్, సిస్టమ్ మేనేజ్‌మెంట్ వంటి రంగాల్లో ఈ కొత్త ఉద్యోగాలకు అధిక నైపుణ్యం అవసరం అవుతుంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications