అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్‌.. 250 మంది ఉద్యోగులకు తెల్లవారుజామునే మెయిల్స్‌..

Amazon Layoffs 2026: ప్రముఖ ఈ-కామర్స్, టెక్నాలజీ దిగ్గజం అమెజాన్ (Amazon) తన ఉద్యోగులకు మరోసారి షాకిచ్చింది. కిండిల్ ఇ-రీడర్లు (Kindle e-readers), ఎకో స్మార్ట్ స్పీకర్ల (Echo smart speakers) వంటి ప్రముఖ హార్డ్‌వేర్ ఉత్పత్తులను అభివృద్ధి చేసే తన 'డివైసెస్ అండ్ సర్వీసెస్' యూనిట్‌లో సుమారు 250 మంది ఉద్యోగులను ఆ సంస్థ తొలగించింది. ఈ లేఆఫ్స్ ప్రధానంగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపాయి.

ప్రభావితమైన ఉద్యోగులకు తెల్లవారుజామునే ఈ-మెయిళ్లు, టెక్స్ట్ సందేశాల ద్వారా ఈ తొలగింపుల వార్తను తెలియజేయడం గమనార్హం. రాయిటర్స్ సంస్థ ఉటంకించిన ఒక ఈ-మెయిల్‌లో, అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ చెరీ రాబిన్సన్ (Cherie Robinson) మాట్లాడుతూ.. సంస్థ తన "నిర్మాణంపై సమగ్ర సమీక్ష" నిర్వహించిందని, దాని ఫలితంగానే ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలనే కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఎన్ని ఉద్యోగాలపై ప్రభావం పడిందనే విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించనప్పటికీ, విశ్వసనీయ నివేదికల ప్రకారం దాదాపు 250 మంది సిబ్బందిని తొలగించినట్లు తెలుస్తోంది.

Amazon layoffs Amazon layoffs 2026 Amazon job cuts Amazon 250 employees Amazon early morning emails Amazon Devices and Services Amazon software developers Amazon Kindle Amazon Alexa tech layoffs 2026 Amazon restructuring Amazon employee layoffs technology jobs AI and employment 250

అమెజాన్ వరుసగా ఉద్యోగ కోతలకు పాల్పడుతుండటానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలోకి భారీగా నిధులను మళ్లించడమే ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. గూగుల్ (Google) మరియు మైక్రోసాఫ్ట్ (Microsoft) వంటి పోటీదారులతో గట్టిగా తలపడే క్రమంలో, అమెజాన్ తన ఏఐ సామర్థ్యాలను పెంచుకునేందుకు డేటా సెంటర్లు, మౌలిక వసతులపై ఏకంగా 125 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 10 లక్షల కోట్లకు పైగా) భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం.

Also Read

ఈ ఏడాది జనవరి ప్రారంభంలో అమెజాన్ సుమారు 16,000 ఉద్యోగాలను తొలగించగా, అంతకుముందు అక్టోబర్ 2025లో కూడా ఆ సంస్థ 14,000 మందిని తొలగించింది. సాంప్రదాయ హార్డ్‌వేర్, డివైసెస్ విభాగాలను కుదించుకుంటూ, కృత్రిమ మేధస్సు (AI), క్లౌడ్ టెక్నాలజీలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలన్న అమెజాన్ వ్యూహం టెక్ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+