క్లిష్ట సమయం.. వచ్చేయండి: అమెజాన్‌లో 75,000 కొత్త ఉద్యోగాలు
వాషింగ్టన్: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ, భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోంది. దీంతో ఆటో, ఐటీ, ఎఫ్ఎంసీజీ వివిధ రంగాల్లో తాత్కాలికంగా అయినా పెద్దఎత్తున ఉద్యోగాలు కోల్పోతారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో కొన్ని రంగాల్లో కొత్త ఉద్యోగాలు పుట్టుకు వస్తాయని కూడా చెబుతున్నారు. ఇప్పటికే ఈ-కామర్స్ వెబ్ సైట్స్ కొత్త ఉద్యోగులను తీసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆన్‌లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగ ప్రకటన చేసింది.

75,000 మందిని తీసుకుంటాం
కరోనా దెబ్బకు ఓ ఉద్యోగాలు తొలగిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆన్‌లైన్ అమెజాన్ ఏకంగా 75,000 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఆన్‌లైన్ సేవలకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో సంస్థ వేర్ హౌస్ నుండి మొదలు సరుకు రవాణా కోసం అత్యధిక మందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

అందుకే కొత్త ఉద్యోగాలు
కరోనా కారణంగా ఆన్‌లైన్ ఆర్డర్లు భారీగా పెరిగాయి. దీంతో గత నెలలో అమెరికాలో లక్ష మంది ఉద్యోగులను కొత్తగా చేర్చుకుంది. ఇప్పుడు మరో 75,000 మందిని తీసుకోనున్నట్లు తెలిపింది. మహమ్మారి కారణంగా డిమాండ్ ఆర్డర్లు పెరిగాయని, కస్టమర్లకు ఇబ్బందిలేని డెలివరీకి ఉద్యోగులను తీసుకుంటామని సోమవారం కంపెనీ తన బ్లాగ్‌లో పేర్కోంది. అమెరికాలోనే కాదు.. ఇండియాలోను డిమాండ్ పెరిగి ఈ రంగంలో ఉద్యోగాలు పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

క్లిష్ట సమయం.. వచ్చేయండి
అమెరికాలో అమెజాన్.. వేర్ హౌస్, షాపర్, డెలివరీ ఉద్యోగులకు వేతనం కూడా పెంచింది. కరోనా కారణంగా హాస్పిటాలిటీ, రెస్టారెంట్, రవాణారంగంపై భారీ ప్రభావం పడిందని, అక్కడ ఉద్యోగాలు కోల్పోయిన వారు ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో తమ వద్ద చేరవచ్చునని, పరిస్థి సద్దుమణిగాక వారి పాత యజమానుల వద్దకు వెళ్లవచ్చునని ఇదివరకే కంపెనీ ప్రకటించింది.

ఉద్యోగులకు రక్షణ చర్యలు
అమెజాన్ తన ఉద్యోగుల రక్షణ కోసం కూడా చర్యలు తీసుకుంటోంది. ఉద్యోగులకు మాస్కులు, టెంపరేచర్ చెక్ వంటి వస్తువులు అందిస్తోంది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత అంతకుముందు కంటే ఆన్ లైన్ ఆర్డర్లకు డిమాండ్ భారీగా ఉంటుందనేది ఆర్థిక నిపుణుల అంచనా. అమెరికా, భారత్ సహా అన్ని దేశాలకు ఇది వర్తిస్తుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications