ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు 20వేల తాత్కాలిక ఉద్యోగాలను ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం సీజనల్ ఉద్యోగాలపై ప్రకటన చేసింది. వీరి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్లకు అవసరమైన సేవలు అందించనుంది. ఈ తాత్కాలిక ఉద్యోగులతో రానున్న ఆరు నెలల పాటు కస్టమర్ల అవసరాలు తీర్చడంలో ఇబ్బందులు ఉండవని అమెజాన్ ఇండియా డైరెక్టర్ (వినియోగదారుల సేవా విభాగం) తెలిపారు.

ఇంటర్‌తో ఈ తాత్కాలిక ఉద్యోగం
హైదరాబాద్, పుణే, కోయంబత్తూరు, నోయిడా, కోల్‌కతా, జైపూర్, చండీగఢ్, మంగళూరు, ఇండోర్, భోపాల్, లక్నోతో సహా పది నగరాల్లో తమ సంస్థ అనుబంధ కార్యాలయాల్లో ఈ ఉద్యోగాలను కల్పించనున్నట్లు తెలిపింది. ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్ తదితర భాషలు వచ్చి ఉండాలి. ఈ ఉద్యోగానికి 12వ తరగతి పాస్‌ను అర్హతగా నిర్ణయించింది అమెజాన్.

అందుకే సీజనల్ ఉద్యోగాలు
2025 నాటికి ఇండియాలో సుమారు పదిలక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ఈ ఏడాది ప్రారంభంలో అమెజాన్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ప్రస్తుతం కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆన్ లైన్ అమ్మకాలు పెరిగాయి. దీంతో సీజనల్ ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయించింది.

ఏడాది తర్వాత వీరికి పర్మినెంట్ ఉద్యోగం
కరోనా నేపథ్యంలో అమెజాన్ ఇండియాలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇప్పుడు తీసుకునే ఉద్యోగుల్లో ఏడాది తర్వాత కొంతమందిని శాశ్వత ఉద్యోగులుగా తీసుకునే తీసుకుంటారు. ఉద్యోగుల పనితీరుతో పాటు వ్యాపార అవసరాన్ని బట్టి ఏడాది తర్వాత ఇందులో 1 శాతం మందిని పర్మినెంట్‌గా తీసుకుంటారు. పరిస్థితులు ఇలాగే ఉన్నా లేకపోయినా, కస్టమర్లు ఆన్ లైన్ వైపు మొగ్గు చూస్తున్నారని గుర్తు చేస్తున్నారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications