defense: వివిధ రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతోంది. గతంలో రక్షణ రంగం ఉత్పత్తులన్నిటినీ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్లం. కానీ మోడీ ప్రభుత్వ హయాంలో పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. సాధ్యమైనన్ని పరికరాలను స్వయంగా తయారు చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా వంటి పథకాల ద్వారా ఈ కలను సాకారం చేసుకోవాలని ఇండియా చూస్తోంది. దేశీయంగా తయారైన కొన్ని ఆయుధాలను ఇప్పటికే విదేశాలకు ఎగుమతి చేస్తుండగా.. పూర్తిస్థాయిలో ఇది ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుంది అనేది చూడాల్సి ఉంది.

అంతర్జాతీయ దిగుమతుల్లో 11 శాతం:
రక్షణ రంగ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కొన్నింటిని భారత్ లో తయారు చేయడం సైతం ప్రారంభించారు. కానీ ఇప్పటికీ ఆయుధాల కొనుగోళ్లలో ఇండియా అగ్రస్థానంలో ఉందని స్వీడన్ కు చెందిన థింక్ ట్యాంక్ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(SIPRI) ఓ నివేదిక విడుదల చేసింది. మొత్తం అంతర్జాతీయ సైనిక పరికరాల దిగుమతుల్లో ఇండియా 11 శాతం వాటాను కలిగి ఉందని వెల్లడించింది. అయితే గతంతో పోలిస్తే మాత్రం పెద్ద ఎత్తున దిగుమతులు తగినట్లు నివేదిక స్పష్టం చేసింది.

64 నుంచి 45 శాతానికి తగ్గిన కొనుగోళ్లు:
భారత్ కు ఆయుధాలు అమ్మడంలో 45 శాతంతో రష్యా అగ్రస్థానంలో కొనసాగుతోందని SIPRI నివేదిక వెల్లడించింది. ఫ్రాన్స్ నుంచి 29 శాతం, అమెరికా నుంచి 11 శాతం చొప్పున ఆయుధాలను ఇండియా దిగుమతి చేసుకుంటున్నట్లు పేర్కొంది. ఇవే కాకుండా దక్షిణ కొరియా, ఇజ్రాయిల్, దక్షిణాఫ్రికా వంటి దేశాల నుంచి సైతం డిఫెన్స్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. రష్యా నుంచి ఆయుధాల కొనుగోళ్లు 2017 నాటికి 64 శాతం ఉండగా.. 2022 నాటికి 45 శాతానికి తగ్గినట్లు తెలిపింది.

డిఫెనస్ హబ్ గా ఇండియా.. కానీ..!
దేశాన్ని డిఫెన్స్ హబ్ గా మార్చాలనే ఆశయాన్ని ప్రధాని మోడీ వెల్లడించారు. 2025 నాటికి 5 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు సాధించాలని లక్ష్యం నిర్దేశించారు. దీనికి కొనసాగింపుగా గతేడాది అక్టోబర్ 30న గుజరాత్ లోని వడోదరలో యూరోపియన్ C-295 మిలిటరీ ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీకి శంకుస్థాపన చేశారు. కానీ ఇందుకు విరుద్ధంగా ఇటీవల బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా ఈవెంట్ లో భారత్ కు వివిధ ఉత్పత్తులను విక్రయించడానికి దేశ, విదేశాల నుంచి పలు కంపెనీలు ఆసక్తి కనబరిచాయి. మొత్తం మీద 266 ఒప్పందాల్లో భాగస్వామ్యాలు కుదిరాయి. వీటి విలువ దాదాపు 80 వేల కోట్లుగా ఉంటుందని అంచనా.

గతంలో అలా, ఇప్పుడు ఇలా:
మేకిన్ ఇండియా, మేక్ ఫర్ ది గ్లోబ్ అనే నినాదాలతో భారత్ ముందుకు సాగనున్నట్లు మోడీ ప్రకటించారు. తమ ప్రభుత్వం స్థిరమైన, ముందు చూపుతో కూడిన వాస్తవికత ఆధారంగా పాలసీలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చాలని ప్రణాళిక రచిస్తున్నట్లు చెప్పారు. 2000 సంవత్సర ప్రారంభంలోనే డిఫెన్స్ ఉత్పత్తుల్లోకి 100 శాతం ప్రైవేట్ సెక్టార్ ని ప్రభుత్వం అనుమతించింది. దీనిలో26 శాతాన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి రూపంలో ఇన్వెస్ట్ మెంటుకు ఓకే చెప్పండి. కానీ దీనికి సంబంధించి ఎటువంటి ఇన్సెంటివ్లను ప్రకటించకపోవడంతో మేకర్స్ ను ఈ ప్రపోజల్ అంతగా ఆకర్షించలేదు. ఆసారి ఏమవుతుందో చూడాలి మరి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications