పసిడి ప్రియులకు అలెర్ట్: నేడు తెలుగురాష్ట్రాల్లో బంగారం ధరలిలా.. త్వరపడండి!!
అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరల మధ్య ఊగిసలాట కొనసాగుతుంది. కాస్త తగ్గినట్టే తగ్గిన బంగారం ధరలు మళ్లీ విపరీతంగా పెరగడం, మళ్లీ కొద్దిగా క్షీణించడం పరిపాటిగా మారిపోయింది. ప్రస్తుతం బంగారం ధరలు స్వచ్ఛమైన బంగారానికి 61 వేల రూపాయలకు పైనే పలుకుతోంది. బంగారం ధరలు ముందుముందు 70 వేల రూపాయలకు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా నేడు బంగారం ధరల విషయానికి వస్తే నేడు బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి పది రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి 10 రూపాయల మేర ధర తగ్గింది. దీంతో దేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,290 రూపాయలుగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,410 రూపాయలుగా నేడు విక్రయించబడుతుంది.

ఇక తెలంగాణ రాష్ట్రం లోని హైదరాబాద్ తో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ ఆదిలాబాద్ లో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 56,290 రూపాయలు కాగా, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 61,410 రూపాయలుగా ట్రేడవుతోంది. నిన్న హైదరాబాద్ లో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 56,300 రూపాయలు ఉంటే, నేడు కేవలం 10రూపాయలు తగ్గింది. స్వచ్ఛమైన బంగారం ధర హైదరాబాద్ లో నిన్న 61,420 రూపాయలుగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, ప్రకాశం, రాజమండ్రి, కాకినాడ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,290 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61, 410 రూపాయలు గా ప్రస్తుతం విక్రయించబడుతుంది.
దేశ రాజధాని ఢిల్లీ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,440 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61, 560 రూపాయలుగా ప్రస్తుతం విక్రయించబడుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56, 290 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61, 410 రూపాయలుగా ట్రేడవుతోంది.భవిష్యత్ లో బంగారం ధరలు పెరుగుతాయన్న అంచనాల నేపధ్యంలో బంగారాన్ని ఇప్పుడే కొనుగోలు చేసుకుంటే మంచిది అన్న భావన వ్యక్తం అవుతుంది.


Click it and Unblock the Notifications