కరోనా కంటే దారుణమైన పరిస్థితులు.. 2027లో ఆహారం, డబ్బు రెడీ చేసుకోవాలంటూ AI నిపుణుడు హెచ్చరిక..

AI Threat Alert: కోవిడ్ మహమ్మారి సృష్టించిన విలయం ఇంకా ప్రపంచం మరిచిపోలేదు. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడం, ఉద్యోగాలు పోవడం, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడం.. వంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ఆ రోజులను గుర్తు చేసుకుంటేనే ప్రజలకు ఇప్పటికీ వణుకు పుడుతోంది. అయితే ఇప్పుడు మరో కొత్త ఆందోళన తెరపైకి వచ్చింది.

అది వైరస్ కాదు.. కంటికి కనిపించని కృత్రిమ మేధ (AI). 2027లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా కరోనా కంటే ఎక్కువ విధ్వంసకర పరిస్థితులు ఏర్పడవచ్చని ఓ AI పరిశోధకుడు హెచ్చరించడం టెక్నాలజీ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. తన కుటుంబ సభ్యులను ఉద్దేశించి రాసిన బహిరంగ లేఖలో ఇంట్లో రెండు వారాలకు సరిపడా ఆహారం, నీరు, కొంత నగదు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంతకీ ఆయన ఎవరు? 2027 గురించి ఎందుకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు?

AI warning 2027 AI researcher Nikola Jurkovic 2027 worse than Covid AI safety risks artificial intelligence global crisis AI threat to humanity AI disaster warning stockpile food and water AI regulation 2027

ఎవరీ AI పరిశోధకుడు?

నికోలా జుర్కోవిక్ (Nikola Jurkovic) అనే ఏఐ పరిశోధకుడు ఈ హెచ్చరిక చేశారు. ఆయన METR అనే లాభాపేక్షలేని సంస్థలో మెంబర్ ఆఫ్ టెక్నికల్ స్టాఫ్‌గా పనిచేస్తున్నారు. ఈ సంస్థ అధునాతన AI వ్యవస్థల సామర్థ్యాలు, వాటివల్ల ఎదురయ్యే ప్రమాదాలను పరీక్షిస్తుంది. అమెరికాలో థాంక్స్ గివింగ్ సందర్భంగా తన కుటుంబ సభ్యులు, స్నేహితులను ఉద్దేశించి ఆయన సోషల్ మీడియా వేదిక Xలో ఓ బహిరంగ లేఖను పంచుకున్నారు. AI పరిణామాలపై తాను చాలా కాలంగా ఆందోళన చెందుతున్నానని.. ఇప్పుడు ఆ విషయాలను బహిరంగంగా చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు.

Also Read

AIతో ఎదురయ్యే మూడు ప్రధాన ప్రమాదాలు: నికోలా తన లేఖలో ప్రధానంగా మూడు ప్రమాదాలను ప్రస్తావించారు.

1. కీలక మౌలిక సదుపాయాలపై దాడులు: AI వ్యవస్థలు మానవ నియంత్రణ దాటి పనిచేస్తే విద్యుత్, బ్యాంకింగ్, ఇతర కీలక మౌలిక సదుపాయాలపై సైబర్ దాడులు జరిగే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

2. బయోలాజికల్ ఆయుధాల ముప్పు: చెడు ఉద్దేశాలు కలిగిన వ్యక్తులు AI సాంకేతికతను ఉపయోగించి ప్రమాదకరమైన జీవ ఆయుధాల తయారీకి ప్రయత్నించవచ్చని హెచ్చరించారు. ఇది ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారవచ్చని పేర్కొన్నారు.

3. నిర్ణయాధికారం యంత్రాల చేతుల్లోకి: ప్రభుత్వాలు, వ్యాపార సంస్థల్లో కీలక నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు అతిగా AIపై ఆధారపడితే, మానవ నియంత్రణ తగ్గిపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.

పదేళ్లలో చాలా ఉద్యోగాలు మాయమవుతాయా?

AI ప్రభావం కేవలం సైబర్ దాడులకే పరిమితం కాదని నికోలా అభిప్రాయపడ్డారు. రాబోయే పదేళ్లలో ప్రస్తుతం ఉన్న చాలా ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా చదువు, ఉద్యోగం, కెరీర్, కుటుంబం వంటి విషయాల్లో రాబోయే ఒకటి నుంచి ఐదేళ్లలో ప్రజలు వేసుకునే ప్రణాళికలు కూడా AI పరిణామాల వల్ల మారిపోవచ్చని పేర్కొన్నారు.

కుటుంబాలు రెండు వారాల ఆహారం, నగదు సిద్ధం చేసుకోవాలని సూచన..

నికోలా చేసిన సూచనల్లో అత్యంత ఆసక్తికరమైనది ఇదే. తన కుటుంబ సభ్యులు ఇంట్లో కనీసం రెండు వారాలకు సరిపడా ఆహారం, తాగునీరు నిల్వ ఉంచుకోవాలని చెప్పారు. అలాగే ఆన్‌లైన్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలు పనిచేయని పరిస్థితులు ఎదురైతే ఉపయోగపడేలా కొంత నగదు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. 2027లో కరోనా మహమ్మారి కంటే ఎక్కువ అంతరాయం కలిగించే పరిస్థితులు రావచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

AI ప్రమాదాలను అడ్డుకోవడం సాధ్యమేనా?

అయితే పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయిందని ఆయన చెప్పడం లేదు. AI అభివృద్ధిపై అంతర్జాతీయ స్థాయిలో కఠినమైన నియంత్రణలు తీసుకురావాలని సూచిస్తున్నారు. అత్యంత శక్తివంతమైన AI వ్యవస్థల అభివృద్ధిలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరి చేయాలని.. ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకోవాలని కోరుతున్నారు. యూరోపియన్ యూనియన్ తీసుకొచ్చిన AI చట్టాన్ని కూడా ఉదాహరణగా ప్రస్తావించారు. మరోవైపు AI రంగంలో ప్రముఖ పరిశోధకులైన యోషువా బెంజియో, జెఫ్రీ హింటన్ కూడా అధునాతన AI వల్ల ఎదురయ్యే ప్రమాదాలపై గతంలో ఆందోళన వ్యక్తం చేశారు.

నిజంగానే 2027లో అంతటి ప్రమాదం ఉందా?

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. నికోలా జుర్కోవిక్ చేసినవి ఆయన వ్యక్తిగత అంచనాలు, హెచ్చరికలు మాత్రమే. 2027లో కచ్చితంగా కరోనా కంటే భయంకరమైన విపత్తు వస్తుందని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు ప్రస్తుతం లేవు. ఆయన పేర్కొన్న ప్రమాద శాతాలు కూడా శాస్త్రీయంగా నిర్ధారించిన అంచనాలు కావు.

మొత్తంగా చూసినట్లయితే మనిషి సృష్టించిన సాంకేతికతే భవిష్యత్తులో మనిషికి సవాలుగా మారుతుందా? అన్న ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు వస్తోంది. AIతో ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థ, భద్రతలో మార్పులు రావడం ఒకవైపు.. అదే టెక్నాలజీ నియంత్రణ దాటితే ఎదురయ్యే ప్రమాదాలు మరోవైపు. అందుకే AI అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుందో.. దానికి తగిన భద్రతా నియంత్రణలు కూడా అంతే వేగంగా రావాలన్నది ఈ హెచ్చరికలోని ప్రధాన సందేశం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+