స్టాక్ మార్కెట్‌కి ముంచుకొస్తున్న పెను ప్రమాదం.. ఏఐ షేర్ మార్కెట్‌లో బబుల్ బ్లాస్ట్ ముప్పు..

AI Bubble Alert: స్టాక్ మార్కెట్లో పెను ప్రమాదం రాబోతుందా.. 170 సంవత్సరాల స్టాక్ మార్కెట్ చరిత్రపై జరిపిన ఒక అధ్యయనం ఈ ముఖ్యమైన ప్రమాదాన్ని వెల్లడిస్తోందంటే నమ్మగలరా.. ఈ అధ్యయనం ప్రకారం.. AI బబుల్ పగిలిపోయే ప్రమాదం ఇప్పుడు 97 శాతానికి చేరుకుందని తెలుస్తోంది. కృత్రిమ మేధస్సు రంగంపై మొదలైన అంచనాలు, భారీ పెట్టుబడులు, వాటి వల్ల పెరిగిన స్టాక్ మార్కెట్ల విలువల చుట్టూ 170 సంవత్సరాల ఆర్థిక చరిత్రను పరిశీలించిన కొత్త అధ్యయనం ఆసక్తికర విషయాలను వెలుగులోకి తెచ్చింది.

సీఎన్‌బీసీ ఇంటర్నేషనల్ కథనం ప్రకారం.. జూలై 2025 నుండి వేగం పుంజుకున్న ఏఐ పరుగు జూలై 2026 తర్వాత మలుపు తిరగడం, ఖరీదైన ఏఐ నమూనాలు, డేటా సెంటర్ల వ్యయాలు కంపెనీల ఆదాయాలను మించిపోవడం వంటి అంశాలు మదుపర్లలో ఆందోళన కలిగించాయి. ఈ నేపథ్యంలో లండన్ బిజినెస్ స్కూల్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు మార్కో గ్రోటేరియా, అఫోన్సో అల్వెస్ మాంటెరో, కాన్‌స్టాంటైన్ యన్నెలిస్ నిర్వహించిన అధ్యయనం బుడగ సంకేతాలపై విశ్లేషణ అందించింది.

AI stock market bubble AI bubble 97 percent 170 years stock market history AI stocks crash prediction AI bubble burst London Business School study University of Cambridge research dot com bubble comparison global stock market crash AI investment risks financial bubble warning 97 170

1843- 2013 మధ్య 'ది ఎకనామిస్ట్'పత్రికలో ప్రచురించబడిన సుమారు 7,96,000 కథనాలను లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ సహాయంతో విశ్లేషించిన పరిశోధకులు, 10 దేశాల్లోని 22 గత ఆర్థిక బుడగలను, 1840ల బ్రిటిష్ రైల్వేల విజృంభణ, 1990ల చివరి డాట్-కామ్ బబుల్, 2008 గృహ సంక్షోభం వంటివాటిని పరిశీలించారు. కొత్త ఆలోచన చుట్టూ మార్కెట్ ఉత్సాహం, నియంత్రణ సంస్థల హెచ్చరికలు, పెరిగిన ఊహాగానాలు, షేర్లు రెట్టింపు కంటే ఎక్కువ పెరుగుతాయన్న చర్చ, ధరలు పెరుగుతూనే ఉంటాయన్న బుల్లిష్ వాతావరణం అనే ఐదు సంకేతాలతో ఒక బబుల్ ఇండెక్స్‌ను రూపొందించారు.

Also Read

ఈ అధ్యయనంలోని ఒక నమూనా సెప్టెంబర్ 2026లో ఏఐ సంబంధిత బుడగ ఏర్పడేందుకు 97 శాతం సంభావ్యతను చూపగా.. మరో రెండు నమూనాలు సుమారు 40 శాతం సంభావ్యతను అంచనా వేశాయి. ఇవి చారిత్రక సగటుల కంటే ఎక్కువగా ఉండి డాట్-కామ్ కాలం స్థాయిలకు చేరువగా ఉన్నాయి.

అయితే ఈ 97 శాతం సంభావ్యతను మార్కెట్ తక్షణమే కుప్పకూలుతుందన్న అంచనాగానో.. పతనం జరిగే తేదీగానో భావించరాదని పరిశోధకులు స్పష్టం చేశారు. వార్తల్లో ఆరు నెలల్లోపు పెద్ద మార్కెట్ సంక్షోభం వచ్చే సగటు అంచనా సుమారు 20 శాతంగా ఉన్నప్పటికీ.. వాస్తవానికి అలాంటి పెద్ద పతనాలు కేవలం 5.7 శాతం సందర్భాలలోనే జరిగాయని.. అంటే పతనం భయాలు వార్తల్లో తరచుగా అతిశయోక్తిగా కనిపిస్తాయని తెలుస్తోంది.

అయితే హెచ్చరికలలో ఆకస్మిక పెరుగుదల, బబుల్ నెలల్లో సూచీ ఎక్కువగా ఉండటం (74 శాతం సందర్భాల్లో, డాట్-కామ్ సమయంలో 94 శాతం) కీలకమని తేల్చారు. బుడగను గుర్తించడం వేరు, అది పగిలిపోయే సమయాన్ని అంచనా వేయడం వేరు అని పేర్కొంటూ.. సూచీ పెరిగిన తర్వాత 12 నుండి 24 నెలల్లో నాస్‌డాక్ రాబడులు బలహీనపడే ధోరణి చారిత్రకంగా కనిపించిందని తెలిపారు.

అదే సమయంలో ఏఐ బబుల్ సంకేతాలు ఉన్నంత మాత్రాన ఏఐ సాంకేతికత నిరుపయోగమని కాదని.. రైల్వేలు, ఇంటర్నెట్ యుగాలలోనూ అతిగా పెరిగిన అంచనాలు సద్దుమణిగినా ఆయా సాంకేతికతలు, మౌలిక సదుపాయాలు దీర్ఘకాలంలో నిలిచిపోయాయని, ప్రస్తుత పరిస్థితిలో ప్రధానంగా అధిక వాల్యుయేషన్లు, పెరుగుతున్న వ్యయాల నడుమ వాస్తవ ఆదాయాలను బేరీజు వేసుకోవాల్సిన అవసరమే కనిపిస్తోందని విశ్లేషణ వివరించింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+