భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్ మంగళవారం ఒక సున్నితమైన సందేశం ఇచ్చారు. యూ జింగ్ తన వ్యాఖ్యలను సోషల్ మీడియా వేదిక అయిన X (ట్విట్టర్)లో పోస్ట్ చేస్తూ, "ఇరు దేశాల మధ్య సంబంధాలు అభివృద్ధి దశలో కీలక ఘట్టాన్ని చేరుకున్నాయి" అని పేర్కొన్నారు. అంతేగాక, ద్వైపాక్షిక బంధాన్ని మరింత పటిష్టంగా, పరస్పర గౌరవంతో నడిపించేందుకు చైనా అంకితభావంతో ఉన్నట్లు తెలియజేశారు.

భారత్‑చైనా సంబంధాలు ఇప్పుడు ఒక కీలక మలుపు దాటి ముందుకు సాగుతున్నాయని ఆమె అభిప్రాయం. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు ఒక్కోచోట తడబడుతున్నా, వాటిని స్థిరంగా, ఆరోగ్యంగా మలచుకునే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. చైనా ఈ మార్గంలో భారత్‌తో కలిసి ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ఇటీవలి కాలంలో కొన్ని ఉద్రిక్తతలు, చర్చనీయాంసలు దేశాల మధ్య ఉదయించినా, యూ జింగ్ వ్యాఖ్యలు భారత్-చైనా మధ్య ఇంకా సంభాషణకు తలుపులు తెరిచి ఉన్నాయని సూచిస్తున్నాయి. దేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయాలనే ఆశయంతో చైనా ముందుకు వస్తోంది. ఈ వ్యాఖ్యల ద్వారా మరోసారి స్పష్టమవుతోంది.
భారత్-పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలు:
ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మార్పులను మేము జాగ్రత్తగా గమనిస్తున్నాం. ఇరు దేశాలు శాంతి కోసం మాట్లాడుకుంటుండటం చక్కటి పరిణామం. చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయన్న నమ్మకం చైనాకు ఉంది. ఈ ప్రక్రియలో చైనా కూడా అవసరమైతే సహాయక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉంది, అని యూ జింగ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
భారత్-చైనా మధ్య వాణిజ్య సంబంధాలు:
ప్రస్తుతం ఒక ప్రత్యేక దశకు చేరుకున్నాయి. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య లోటు దాదాపు $99.2 బిలియన్లకు చేరింది. అంటే మన దేశం చైనాతో ఎక్కువ దిగుమతులు చేసుకుంటోంది, కానీ ఎగుమతులు మాత్రం తక్కువగా ఉన్నాయి. ఈ లోటు తగ్గించుకోవాలంటే పరస్పర సహకారం అవసరం.
ఇటీవల చైనా రాయబారి షు ఫేహోంగ్ మాట్లాడుతూ, భారత్‌తో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయాలని తమ దేశం ఆసక్తిగా ఉందని చెప్పారు. భారతీయ కంపెనీలు తమ ఉత్పత్తులను చైనా మార్కెట్‌లో విక్రయించేందుకు సహాయపడతామని, మన దేశ ప్రీమియం ఉత్పత్తులను కూడా చైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. భారత్‌లో కార్యకలాపాలు చేస్తున్న చైనా కంపెనీలకు కూడా సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. అంటే - "మీ కంపెనీలకు మేము సహాయం చేస్తాం, మీరు కూడా మా కంపెనీలకు అవకాశం ఇవ్వండి" అన్నమాట.
అంతర్జాతీయంగా అమెరికా పెంచిన టారిఫ్‌ల వల్ల వ్యాపారానికి కలిగిన గందరగోళం మధ్య, భారత్-చైనా కలిసి పనిచేస్తే రెండు దేశాల అభివృద్ధికి ఉపయోగపడుతుందని చైనా భావిస్తోంది. మొత్తంగా, వ్యాపార సంబంధాలను సమతుల్యంగా, పరస్పర లాభంగా కొనసాగించాలని చైనా భారత్‌ను కోరుతోంది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్-చైనా మధ్య వాణిజ్య లోటు రికార్డు స్థాయికి చేరుకుంది. సుమారు $100 బిలియన్. వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2024-25లో భారత్ చైనాకు $14.25 బిలియన్ విలువైన ఉత్పత్తులు ఎగుమతి చేసింది, ఇది గత ఏడాది ($16.66 బిలియన్)తో పోలిస్తే 14.4% తగ్గుదల.
అదే సమయంలో, 2024-25లో భారత్ చైనాతో $113.45 బిలియన్ విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది, ఇది గత సంవత్సరం ($101.73 బిలియన్)తో పోలిస్తే 11.5% పెరుగుదల. అంటే, భారత ఎగుమతులు తగ్గిపోగా, దిగుమతులు పెరగడం వల్ల వాణిజ్య లోటు $99.2 బిలియన్‌కి చేరుకుంది.
More From GoodReturns

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

నేస్తం నేనున్నా.. భారత్‌కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications