For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వచ్చే వారం స్టాక్ మార్కెట్లోకి మరో మూడు ఐపీవోలు

|

అంతకుముందు ఐపీవోకు వచ్చిన ఎల్ఐసీ సబ్‌స్క్రిప్షన్ 9వ తేదీన ముగిసింది. ఎల్ఐసీ ఐపీవో వచ్చే వారం మార్కెట్‌లో లిస్ట్ కానుంది. మార్కెట్ క్రమంగా కోలుకుంటున్న పరిస్థితుల నేపథ్యంలో ఐపీవోలు వస్తున్నాయి. వచ్చే వారం మూడు కంపెనీలు ఐపీవోకు రానున్నాయి. బీఎస్ఈ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం పారాదీప్ ఫాస్పేట్స్ ఐపీవో, ఎథోస్ ఐపీవో, ఈ-ముద్రా ఐపీవో ఉన్నాయి.

ఇందులో పారాదీప్ ఫాస్పేట్స్ ఐపీవో 17వ తేదీ మే 2022న వస్తుంది. ఎథోస్ ఐపీవో 18వ తేదీన, ఈ-ముద్రా ఐపీవో 20వ తేదీన వస్తోంది. ఈ మూడు కంపెనీలు కూడా రూ.2387 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో ఐపీవోకు వస్తున్నాయి. ఇందులో పారాదీప్ ఫాస్పేట్స్ ఐపీవో సైజ్ రూ.1501, ఎథోస్ ఐపీవో సైజ్ రూ.472 కోట్లు, ఈ-ముద్రా ఐపీవో సైజ్ రూ.412 కోట్లు.

 After LIC IPO, next week Three IPOs worth ₹2387 crore to hit stock market

రానున్న మూడు కీలక ఐపీవోల గురించి క్లుప్తంగా... పారాదీప్ పాస్పట్ ఐపీవో రూ.1501 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో మే 17న ఐపీవోకు వస్తుంది. మే 19 వరకు సబ్‌స్క్రైబ్ కావొచ్చు. ఈ ఐపీవో ప్రైస్ బ్రాండ్ షేర్ వ్యాల్యూ రూ.39 నుండి రూ.42. కంపెనీ లాట్‌లో 350 వరకు షేర్లు ఉంటాయి. ఐపీవో అలాట్‌మెంట్ 24 మే 2022, లిస్టింగ్ డేట్ 27 మే 2022.

ఎథోస్ ఐపీవో రూ.472 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో వస్తోంది. 18న ప్రారంభమయ్యే సబ్‌స్క్రిప్షన్ 20వ తేదీన ముగుస్తుంది. ఒక్కో షేర్ ధరను రూ.836 నుండి రూ.878 మధ్య కేటాయించారు. ఒక్కో లాట్‌లో 17 షేర్లు ఉంటాయి. 25న అలాట్ చేస్తారు. 30 మే 2022న లిస్ట్ అవుతుంది.

ఈ-ముద్రా ఐపీవో సబ్‌స్క్రిప్షన్ 20వ తేదీన ప్రారంభమై, 24న ముగుస్తుంది. రూ.412 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో వస్తుంది. ప్రైస్ బ్రాండ్ రూ.243 నుండి రూ.256. ఒక్కో లాట్‌లో 58 షేర్లు ఉంటాయి. ఐపీవో అలాట్‌మెంట్ 27న, లిస్టింగ్ జూన్ 1న ఉంటుంది.

English summary

వచ్చే వారం స్టాక్ మార్కెట్లోకి మరో మూడు ఐపీవోలు | After LIC IPO, next week Three IPOs worth ₹2387 crore to hit stock market

While LIC IPO applicants are awaiting share listing of the insurance behemoth next week, three more IPOs (Initial Public Offerings) — Paradeep Phosphates IPO, Ethos IPO and eMudhra IPO — are going to hit primary market next week.
Story first published: Saturday, May 14, 2022, 18:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X