4రోజుల తర్వాత మళ్ళీ పసిడి ధరలకు రెక్కలు; నేడు తెలుగురాష్ట్రాల్లో ధరలిలా!!
నిన్న మొన్నటి వరకు కాస్త తగ్గినట్టుగా రిలీఫ్ ఇచ్చిన బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి. గత నాలుగు రోజులుగా గ్యాప్ ఇచ్చిన బంగారం మళ్లీ పెరిగిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. 62 వేలకు చేరుకున్న బంగారం ధరలు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత నాలుగు రోజులుగా బాగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ నేడు పెరిగాయి.
నేడు 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం మీద 240 రూపాయలు, 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం మీద 320 రూపాయల మేర ధర పెరిగింది. దీంతో స్వచ్ఛమైన బంగారం ధర దేశీయంగా 61 వేల వైపు పయనిస్తోంది. ఇక ఆర్నమెంట్ బంగారం ధర 56 వేల వైపు ప్రయాణం చేస్తోంది.

నేడు హైదరాబాద్లో బంగారం ధర ల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55, 600 రూపాయలుగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,650 రూపాయలు గా ప్రస్తుతం ట్రేడవుతోంది. నిన్న ఈ ధరలు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 55,300 రూపాయలుగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 60, 650 రూపాయలుగా విక్రయించబడ్డాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, ప్రకాశం, రాజమండ్రి, కాకినాడ లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,600 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,650 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు 55,750 రూపాయలుగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,800 రూపాయలుగా ట్రేడవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55, 600 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60, 650 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది.


Click it and Unblock the Notifications