ముంబై: గుజరాత్‌కు చెందిన ప్రముఖ రసాయనిక పరిశ్రమ ఈథర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. పబ్లిక్ ఇష్యూ ఇవ్వాళ స్టాక్ మార్కెట్స్‌లో లిస్టింగ్ అయింది. ఇన్వెస్టర్లకు 10 శాతానికి పైగా లాభాలను పంచి పెట్టింది. మొత్తంగా 808 కోట్ల రూపాయలను ఇన్వెస్టర్ల నుంచి సమీకరించుకోవాలనే లక్ష్యంతో ఈథర్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూను జారీ చేసిన ఈ కెమికల్ ఇండస్ట్రీ 704 రూపాయలతో బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయింది.

ఒక్కో షేర్‌పై
ఈథర్ ఇండస్ట్రీస్ షేర్ ప్రైస్ బ్యాండ్ 610 నుంచి 642 రూపాయలు. 704 రూపాయలతో లిస్టింగ్ అయిందంటే ఒక్కో షేర్ మీద 62 రూపాయల మేర లాభాలను పంచింది. తొలి గంటలో ఈ కంపెనీ షేర్లు 774 రూపాయల వరకు దూసుకెళ్లాయి. అంటే ఒక్కో షేర్ మీద 132 రూపాయల రిటర్న్ లభించినట్టే. ఒక్కో లాట్ సైజు 23 షేర్లు. రిటైల్ ఇన్వెస్టర్లు, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి మంచి ఆదరణ లభించింది.

బిగినింగ్ నుంచి పాజిటివ్‌గానే..
కిందటి నెల 24 నుంచి 26వ తేదీ వరకు పబ్లిక్ ఇష్యూ గడువు సమయంలో అన్ని కేటగిరీలకు చెందిన ఇన్వెస్టర్ల నుంచి 6.26 సార్లు ఎక్కువగా బిడ్డింగ్స్ దాఖలయ్యాయి. క్వాలిఫైడ్, నాన్ క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు తమకు కేటాయించిన 2.52 కంటే 17.57 సార్లు ఎక్కువగా బిడ్డింగ్స్ వేశారు. ఓవర్సీస్ మార్కెట్‌పై గట్టిపట్టు ఉండటం ఈథర్ ఇండస్ట్రీస్‌కు కలిసి వచ్చిన అంశంగా మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి.

జీఎంపీ అంచనాలకు అనుగుణంగా..
తొలుత 757 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయాలని ఈథర్ ఇండస్ట్రీస్ లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం తన ఐపీఓ సైజును తగ్గించింది. 627 కోట్లకు కుదించుకుంది. ఇదే కాకుండా ప్రమోటర్ల రూపంలో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా మరో 28.2 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేసింది. కాగా ఇవ్వాళ్టి గ్రే మార్కెట్ ప్రీమియం నాలుగు రూపాయలుగా సూచిస్తోంది. అంటే ఐపీఓ కటాఫ్ ధర 642 కాగా.. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లాభంతో లిస్టింగ్ అవుతుందని గ్రే మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. దీనికి అనుగుణంగానే లిస్టింగ్ అయ్యాయి ఈ కంపెనీ షేర్లు.

లాభాల్లో ఉండటం..
మొత్తం ఐపీఓలో సంస్థాగత ఇన్వెస్టర్లు- 35, రీటైల్ ఇన్వెస్టర్లు- 15 శాతం, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేశారు. ఈథర్ ఇండస్ట్రీస్ స్పెషలైజ్డ్ కెమికల్స్ తయారీ సెగ్మెంట్‌కు చెందిన కంపెనీ. ఫార్మాస్యూటికల్, ఆగ్రోకెమికల్, మెటీరియల్ సైన్స్, ఎలక్ట్రానిక్ కెమికల్ వంటి రంగాలకు తన ప్రొడక్ట్స్‌ను సరఫరా చేస్తోంది. ఈ ఇండస్ట్రీస్ ఆపరేటింగ్ రెవెన్యూ 2021-22లో 450 కోట్ల రూపాయలుగా నమోదైంది.

ఎక్స్‌పాన్షన్ కోసం..
పబ్లిక్ ఇష్యూ రూపంలో సమీకరించిన మొత్తాన్ని కొత్త ప్రాజెక్టులకు మళ్లిస్తామని ఈథర ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాజమాన్యం పేర్కొంది. ఈ విషయాన్ని ఇదివరకే సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్‌కు అందజేసిన తన డ్రాఫ్ట్ రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్‌లో పొందుపరిచింది. మూల ధన వ్యయ అవసరాలు తీర్చుకోవడానికి ఈ ఐపీఓ ద్వారా వచ్చే పెట్టుబడుల్లో కొంత మొత్తాన్ని వినియోగిస్తామని, రుణాల చెల్లింపులకు మరికొంత మొత్తాన్ని వినియోగిస్తామని పేర్కొంది.
More From GoodReturns

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications