ముంబై: ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ఆదిత్య బిర్లా ఏఎంసీ ఐపీఓ అలాట్‌మెంట్ పూర్తయింది. కిందటి నెల మొదలైన ఈ ఐపీఓ ప్రక్రియ రెండు రోజుల పాటు కొనసాగింది. ఈ నెల 1వ తేదీన ముగిసింది. పబ్లిక్ ఇష్యూను జారీ చేసే విషయంలో అత్యంత కీలకంగా భావించే షేర్ల అలాట్‌మెంట్ ముగియడంతో ఇక లిస్టింగ్ కోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. సోమవారం ఆదిత్య బిర్లా ఏఎంసీ ఐపీఓ లిస్టింగ్‌కు వచ్చే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
బోంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లల్లో ఈ ఐపీఓ లిస్టింగ్ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో- ఆదిత్య బిర్లా ఏఎంసీ ఐపీ గ్రే మార్కెట్ ప్రీమియంపై అందరి దృష్టి నిలిచింది. గ్రే మార్కెటలో ఈ షేరు ఒక్కింటి విలువ 17 రూపాయలుగా నమోదైంది. ఇదివరకు దీని విలువ 35 రూపాయలుగా ఉండేది. అలాట్‌మెంట్ తరువాత గ్రే మార్కెట్ సైజ్ మరింత తగ్గింది. ప్రీమియంలో రెండు రూపాయల మేర డిస్కౌంట్ ఉండే అవకాశం లేకపోలేదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఆదిత్య బిర్లా లిస్టింగ్ ప్రైస్ 712 రూపాయలు ఉంటే.. దానికి ఈ గ్రే మార్కెట్ ప్రీమియం 17 రూపాయలు జత కలుస్తాయి. అంటే మొత్తంగా దీని ఒక్కో షేరు విలువ 729 రూపాయలుగా పలికే అవకాశం ఉంది. ఇందులో ఉన్న ఈక్విటీ షేర్లు 3,88,80,000 ఉండగా.. ఒక్కో షేరు ధరను ప్రారంభంలో 695 రూపాయల నుంచి 712గా నిర్ణయించారు. దీనికి 17 రూపాయల గ్రే మార్కెట్ ప్రైస్‌ను కలిపితే 729 రూపాయలకు పెరగొచ్చని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తోన్నాయి.
ఈ ఈక్విటీ షేర్లల్లో సన్‌లైఫ్ ఇండియా ఏఎంసీ ఇన్వెస్ట్‌మెంట్స్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థకు సంబంధించిన కొన్ని వాటాలను బదలాయించాయి. ఇందులో ఆదిత్య బిర్లా క్యాపిటల్ వాటా 28.51 లక్షల వరకు ఈక్విటీ వరకు ఉంటోంది. మిగిలినవి అంటే 3.6 కోట్ల ఈక్విటీలు సన్‌లైఫ్ ఇండియా ఏఎంసీకి అలాట్ అయినవి. పబ్లిక్ ఇష్యూకు వెళ్లడానికి ముందే ఆదిత్య బిర్లా ఏఎంసీ 789 కోట్ల రూపాయలను సమీకరించింది. ఇవి పోను మిగిలిన ఈక్విటీని అలాట్ చేసినట్లు చెబుతున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications